Tuesday, May 24, 2016

కోరి వండేద్దాం..కొర్రలు!

కోరి వండేద్దాం..కొర్రలు!
కొర్రలు.. చిరుధాన్యాల్లో ఒక రకం.. చాలామందికి దీంతో అన్నం వండుకోవడమే తెలుసు..అయితే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వీటిని మరెన్నో రకాలుగా కూడా వండవచ్చు. పీచుతోపాటూ, యాంటీఆక్సిడెంట్లను సమృద్ధిగా అందించి.. రక్తంలో చక్కెరస్థాయుల్ని సమతూకంలో ఉంచే కొర్రలతో.. ఇంకేమేం చేసుకోవచ్చో చూద్దాం.

పులిహోర
 కావల్సినవి: కొర్రల అన్నం - పది కప్పులు, ఆవాలు - పావుచెంచా, జీలకర్ర - అరచెంచా, సెనగపప్పు - ఒకటిన్నర చెంచా, ఎండుమిర్చి - తొమ్మిది, పచ్చిమిర్చి - ఆరు, కరివేపాకు - రెండు రెబ్బలు, నూనె - అరకప్పు, పసుపు - పావుచెంచా, ఉప్పు - తగినంత, జీడిపప్పు పల్లీలు - రెండూ కలిపి పావుకప్పు, నిమ్మరసం - పావుకప్పు.
తయారీ: పొడిగా వండిన కొర్ర అన్నాన్ని ఓ పళ్లెంలోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి. అందులో ఉప్పూ, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఆవాలూ, జీలకర్రా, సెనగపప్పూ, ఎండుమిర్చీ, పల్లీలూ, జీడిపప్పు వేయించుకోవాలి. అవి వేగాక పసుపూ, కరివేపాకూ, పచ్చిమిర్చి ముక్కలూ వేయించుకుని పొయ్యి కట్టేయాలి. ఈ తాలింపు కొద్దిగా చల్లగా అయ్యాక కొర్ర అన్నంలో వేసి కలిపితే సరిపోతుంది. కొర్ర పులిహోర సిద్ధం.
టొమాటో రైస్‌
కావల్సినవి: కొర్రల అన్నం - పది కప్పులు (హోటళ్లలో సాంబారు వడ్డించే చిన్న కప్పుతో కొలుచుకోవాలి), నూనె, నెయ్యి - పావు కప్పు చొప్పున, లవంగాలు - మూడు, దాల్చినచెక్క - అంగుళం చొప్పున మూడు ముక్కలు, ఉల్లిపాయముక్కలు - ముప్పావు కప్పు, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు - రెండున్నర కప్పులు, పచ్చిమిర్చి - నాలుగు, ఉప్పు -తగినంత, అల్లంవెల్లుల్లి మిశ్రమం ముద్ద - అరచెంచా, కారం - చెంచా, నీళ్లు - రెండు కప్పులు.
తయారీ: బాణలిలో నెయ్యి, నూనె వేసి పొయ్యిమీద పెట్టాలి. అవి వేడయ్యాక లవంగాలూ, దాల్చినచెక్క ముక్కలూ వేయాలి. నిమిషం తరవాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలూ, కొంత ఉప్పూ, కారం వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయముక్కలు వేగాక అల్లంవెల్లుల్లి మిశ్రమాన్ని వేయించాలి. అందులో టొమాటో ముక్కలు వేసి మంట తగ్గిస్తే.. కాసేపటికి అవి మగ్గుతాయి.అప్పుడు నీళ్లూ, మిగిలిన ఉప్పు చేర్చి మంట తగ్గించాలి. అవి ఒక్క పొంగు వచ్చాక ముందుగా వండి పెట్టుకున్న కొర్ర అన్నం వేసి మూత పెట్టేయాలి. ఒకటిన్నర నుంచి రెండునిమిషాలయ్యాక దింపేస్తే చాలు.
కొబ్బరి పాలతో...
 కావల్సినవి: వండిన కొర్రల అన్నం - పది కప్పులు, నూనె, నెయ్యి - పావు కప్పు చొప్పున, లవంగాలు - మూడు, దాల్చినచెక్క - అంగుళం చొప్పున మూడు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు - ముప్పావు కప్పు, క్యారెట్‌ ముక్కలు - అరకప్పు, పచ్చిబఠాణీ - కప్పు, పచ్చిమిర్చి - ఐదు, ఉప్పు - తగినంత, కొబ్బరిపాలు - రెండున్నర కప్పులు, అల్లంవెల్లుల్లి ముద్ద - అర చెంచా.
తయారీ: బాణలిలో నెయ్యి, నూనె వేసి పొయ్యిమీద పెట్టాలి. అవి వేడయ్యాక లవంగాలూ, దాల్చినచెక్క ముక్కలూ వేయాలి. నిమిషం తరవాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలూ, పావుచెంచా ఉప్పూ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయముక్కలు వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద చేర్చి వేయించాలి. అందులో పచ్చిబఠాణీ, క్యారెట్‌ ముక్కలు వేసి మంట తగ్గిస్తే.. కాసేపటికి అవి మగ్గుతాయి. అప్పుడు కొబ్బరిపాలూ, మరికొంచెం ఉప్పూ వేసి మంట తగ్గించాలి. ఒక్క పొంగు వచ్చాక ముందుగా వండి పెట్టుకున్న కొర్ర అన్నం వేసి మూత పెట్టేయాలి. ఒకటిన్నర నుంచి రెండు నిమిషాలయ్యాక దింపేస్తే చాలు. అయితే మూడు నిమిషాల తరవాత మూత తీసి వడ్డించాలి.
పకోడి

కావల్సినవి: పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - కప్పు, జీలకర్ర - పావుచెంచా, అల్లంపచ్చిమిర్చి పేస్టు - పావుచెంచా, కొర్రపిండి, సెనగపిండి - అరకప్పు చొప్పున, ఉప్పు - తగినంత, నూనె - వేయించేందుకు సరిపడా.
తయారీ: ఉల్లిపాయముక్కల్లో అల్లంపచ్చిమిర్చి పేస్టు వేసి కలపాలి. తరవాత వీటిపై నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పకోడీ గట్టిగా కావాలనుకుంటే.. పావు నుంచి అరకప్పు నీళ్లు చేరిస్తేచాలు. కాస్త మెత్తగా కావాలనుకుంటే కప్పు నీళ్లు పోసుకుని పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఈ పిండిని పకోడీల్లా వేసుకుని ఎర్రగా వేగాక తీస్తే చాలు.
పాయసం

కావల్సినవి: పచ్చి కొర్రలు - రెండున్నర కప్పులు, బెల్లం - ఐదు కప్పులు, నీళ్లు - పదిహేను కప్పులు, నెయ్యి - కప్పు, జీడిపప్పు - అరకప్పు, కిస్‌మిస్‌ - పావుకప్పు, యాలకులపొడి - పావుచెంచా.
తయారీ: కొర్రల్ని అరగంటసేపు నానబెట్టుకోవాలి. తరవాత పొయ్యిమీదపెట్టి నీరుపోసి ఉడికించుకోవాలి. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు బెల్లం వేసేయాలి. పది నుంచి పన్నెండు నిమిషాలకు బెల్లం కరిగి.. పాయసం కొద్దిగా చిక్కగా అయి, రంగు మారుతుంది. అప్పుడు నాలుగు చెంచాల నెయ్యి వేయాలి. పాయసం ఇంకాస్త ఉడికి.. దగ్గరవుతున్నప్పుడు మరో పొయ్యిమీద మిగిలిన నెయ్యి కరిగించి జీడిపప్పూ, కిస్‌మిస్‌ పలుకులు వేయించుకోవాలి. తరవాత దీన్ని పాయసంలో వేసి, యాలకులపొడి చేర్చి దింపేయాలి.

Wednesday, May 18, 2016

రుద్రాక్షలను శివునిప్రతిరూపాలుగా కొలుస్తాము....!



రుద్రాక్షలు పవిత్రమైనవి,శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి.రుద్రాక్షలు ధరించడంవల్లఅనుకున్న పనులు నెరవేరతాయి.  ఎలాంటి కష్టనష్టాలు రావు.అడ్డంకులు తొలగిపోయి,సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించినదివ్యమైన కానుక రుద్రాక్ష.ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికిరుద్రాక్ష అసలైన మార్గంచూపుతుంది. రుద్రాక్షనుఋషులు భూమికీ, స్వర్గానికీ మధ్యవారధిగా భావిస్తారు. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు. అనారోగ్యసమస్యలతో జారిపోతున్నవారురుద్రాక్షలను ధరిస్తే వారిసమస్యలుమటుమాయమవుతాయి.అంతేకాదు, ఏవైనా వ్యసనాలకులోనయినవారు తమ అలవాటుమంచిది కాదని తెలిసి, అందులోంచిబయట పడలేకపోతున్నట్లయితేరుద్రాక్షమాలను ధరిస్తే చాలా
మంచి ఫలితముంటుంది. నొసటనవిభూతి, కంఠాన రుద్రాక్షమాలధరించి శివనామ జపం చేస్తున్నవ్యక్తిని దర్శించుకుంటేత్రివేణీ సంగమ స్నానం చేసినంతపుణ్యం కలుగుతుంది.రుద్రాక్షలను సర్వపాపములనూనశింపచేసే సరస్వతీ నదితోపోల్చారు మునులు. మెడ,చేతులు, చెవులకు, రుద్రాక్షలనుధరించినవారు ఏ అపజయాలులేకుండా తిరుగులేనివారిగాభాసిస్తారు. ఎవరి మెడలో రుద్రాక్ష ఉంటుందో వారుఈశ్వరానుగ్రహానికిపాత్రులవుతారని పురాణాలుచెబుతున్నాయి. రుద్రాక్షలపైఉండే ముఖాల ఆధారంగారుద్రాక్షలను ఇరవయ్యొక్కరకాలుగా విభజించారు.రుద్రాక్షలను ధరించిన వారుతప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి,
1. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు.
2. రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు.
3. కుటుంబసభ్యులు అయినప్పటికీ ఒకరి
రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు.
4. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు.
5. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు.
6. రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు.
7. స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు.

రుద్రాక్షమాల ధారణవిధి:
సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభసమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివపూజ చేయాలి. ఆ తర్వాతే రుద్రాక్షను ధరించాలి. రుద్రాక్షను ధరించిన వెంటనే ఏదో అద్భుతం జరిగిపోతుంది అని ఎదురుతెన్నులు చూస్తే ఫలితం ఉండదు. సత్వర ఫలితాన్ని ఆశించేవారు, రుద్రాక్షల పూర్తి సమాచారాన్ని సేకరించి, సిసలైన పద్ధతి ప్రకారం, గురువు సమక్షంలో ధరించి, సాధన చేయాలి.
రుద్రాక్షమాలను ధరించవలసిన తిథులు:
పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి  నాడు ఈశ్వరుని రుద్రాక్షలతో పూజించడం మహాశ్రేష్టం.
రుద్రాక్షలను ధరిస్తే సర్వదుఃఖాలు తొలగిపోతాయి. సకల సంపదలూ ఒనగూడుతాయని స్కాందపూరాణం చెబుతోంది. జావా, సమత్రా, ఇండోనేషియా, నేపాల్
మొదలైన చోట్ల, ఇండియాలో చాలా కొద్ది ప్రదేశాల్లో రుద్రాక్ష చెట్లు పెరుగుతాయి.
జన్మనక్షత్ర రీత్యా ధరించవలసిన రుద్రాక్షలు:
నక్షత్రము ధరించవలసిన రుద్రాక్ష
అశ్వని     
    నవముఖి
భరణి           షణ్ముఖి
కృత్తిక          ఏకముఖి, ద్వాదశముఖి
రోహిణి         ద్విముఖి
మృగశిర       త్రిముఖి
ఆరుద్ర          అష్టముఖి
పునర్వసు     పంచముఖి
పుష్యమి        సప్తముఖి
ఆశ్లేష            చతుర్ముఖి
మఖ            నవముఖి
పుబ్బ           షణ్ముఖి
ఉత్తర            ఏకముఖి, ద్వాదశముఖి
హస్త             ద్విముఖి
చిత్త              త్రిముఖి
స్వాతి           అష్టముఖి
విశాఖ          పంచముఖి
అనురాధ      సప్తముఖి
జ్యేష్ఠ             చతుర్ముఖి
మూల          నవముఖి
పూర్వాషాఢ   షణ్ముఖి
ఉత్తరాషాఢ    ఏకముఖి లేదా ద్వాదశముఖి
శ్రవణం          ద్విముఖి
ధనిష్ట            త్రిముఖి
శతభిషం       అష్టముఖి
పూర్వాభాద్ర   పంచముఖి
ఉత్తరాభాద్ర    సప్తముఖి
రేవతి            చతుర్ముఖి


నవనందులు

ఎవరు సదాశివ నామస్మరణ చేస్తారో అలాంటి వారి వెంటే శివుడుంటాడు. అలాంటి తన నిజమైన భక్తుల్నే శివుడు వెన్నంటి కాపాడుతాడు. ఆ స్వామి తన భక్తులకోసం వెలసిన క్షేత్రాలు మన దేశంలో అనేకం ఉన్నాయి. ఆ పరంపరలోని మరో విశిష్ఠ శైవ క్షేత్రమే నంది మండలం.
ఇది కర్నూలు జిల్లాలో ఉంది. నంద్యాల చుట్టూ నవ నందులుండడంవల్ల ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది. నంద్యాల కర్నూలు జిల్లాలో ఉన్న ఒక విశిష్టమైన పట్టణం. చారిత్రక విశేష గాథలతో ముడిపడి ఉన్న ఈ పట్టణానికి ఆ పేరు రావడానికి కూడా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కుందూ నదీ తీరాన ఉన్న ఈ పట్టణాన్ని పూర్వం నందియాల అని పిలిచేవారు.
14వ శతాబ్దంలో నందన మహారాజు ఈ మండలం చుట్టూ నవ నందులను నిర్మించడంవల్ల దీనికి నంది మండలమని పేర్కొచ్చిందని చెబుతారు. ఇదే కాలాంతరంలో నంద్యాలగా రూపాంతరం చెందింది. మంచి వాణిజ్య కేంద్రంగా ఉన్న నంద్యాల ప్రముఖ శైవ క్షేత్రంగా కూడా పేర్గాంచింది. మండలంలో ఉన్న నవ నందులలో మూడు నందులు ఇక్కడే ఉండడం విశేషం.
ప్రథమ నంది:- నవ నందులలో ప్రథమమైన ప్రథమ నందీశ్వరాలయం ఇక్కడే ఈ పట్టణంలోనే ఉంది. నంద్యాల పట్టణంలో శ్యామ్ కాల్వ గట్టున ఈ ఆలయం అలరారుతోంది. విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ప్రథమ నందీశ్వరాలయం అనంతర కాలంలో ఆదరణ లేక జీర్ణావస్థకు చేరుకుంది. అయితే ఇటీవల కాలంలో భక్తులు, వధాన్యుల సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలు ఈ ఆలయం సొంతం.
విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ దివ్యాలయానికి చేరుకోగానే అక్కడి ప్రశాంత వాతావరణం మైమరపిస్తుంది. గర్భాలయంలో ప్రథమ నందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న కేదారేశ్వర లింగం భక్తులకు దర్శనమిస్తుంది. తేజో విరాజమానమవుతున్న కేదారేశ్వర లింగ దర్శనం, కేదారనాథ్‌లో కేదారేశ్వర లింగ దర్శన ఫలాన్నిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడే మరోపక్క కేదారేశ్వరి మాత కొలువుతీరి ఉంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం.
నాగనంది:- నంద్యాల పట్టణంలో ఆర్టీసీ బస్టాండుకు సమీపంలోఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు కొలువుదీరాడు. కోదండ రామాలయంగా ఖ్యాతికెక్కిన ఈ ఆలయం కూడా అతి పురాతనమైనదే.ఈ ఆలయం కొన్ని ఆలయాల కూడికగా కానవస్తుంది. ఈ మందిరంలో భారీ ఆకారంలో ఉన్న ఆంజనేయస్వామి మూర్తి చూపరులను విపరీతంగా ఆకర్షిస్తుంది. విశాల శిల్ప మూర్తిగా ఉన్న ఈ ఆంజనేయస్వామి దర్శనం సర్వ మంగళకరం. ఆంజనేయస్వామి గర్భాలయానికి సమీపంలో ఉన్న చిన్న మండపంలో నాగ నందీశ్వరుడు కొలువుదీరాడు. నవ నందులలో నాగ నందీశ్వరుడు రెండవ వాడు.
సోమనంది:- నంద్యాల పట్టణంలోనే ఆత్మకూరు బస్టాండుకు సమీపంలో ఉన్న మరో ఆలయం శ్రీ సోమ నందీశ్వరాలయం. చంద్రుడు ఇక్కడ మహేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించడంవల్ల ఈ లింగానికి సోమ నందీశ్వర లింగమనే పేరొచ్చింది. ఈ ఆలయం ప్రాంగణం చిన్నదే అయినప్పటికీ ప్రాశస్త్యం రీత్యా ఇక్కడ స్వామివారి మహిమ గొప్పది. గర్భాలయంలో సోమ నందీశ్వరుడు దర్శనమిస్తాడు.
శివనంది:- నంద్యాలకు సుమారు 15 కిలోమీటర్లు దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే శివనందీశ్వరాలయం. శివనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రం నవ నందులలో విశేషమైన నందిగా ఖ్యాతి గాంచింది. ఈ ఆలయం బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామంలో ఉంది. అతి పురాతన ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి నంద్యాల వరకు బస్సు లేదా రైలులో చేరుకోవాలి. అనంతరం అక్కడనుంచి ఏదైనా వాహనంలో గాని, బస్సులో గాని ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి దృశ్యాలు ఆభరణాలుగా అలరారుతున్న ఈ ఆలయ శోభ అనన్య సామాన్యం... విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలోనో కట్టడాలన్నీ చాళుక్యుల కాలం నాటివిగా ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది.
14వ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ శివనందిని ప్రతిష్టించినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరం విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆలయం అనంతర కాలంలో ఆదరణ లేక జీర్ణావస్థకు చేరుకుంది. అయితే ఇటీవల కాలంలో భక్తులు, వధాన్యుల సహకారంతో ఈ ఆలయాన్ని పనర్నిర్మించారు. గర్భాలయంలో శివనందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న మహాదేవ లింగం భక్తులకు దర్శనమిస్తుంది.
తేజో విరాజమానమవుతున్న పరమేశ్వర లింగ దర్శనం, అమోఘమైన పుణ్యఫలాన్నిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ముఖ మండపంలో మరోపక్క పార్వతి మాత కొలువుదీరి ఉంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వ మంగళకరం. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో వైపు భాగంలో వీరభద్రస్వామి కూడా కొలువుదీరాడు. విష్ణునంది లేక కృష్ణ నంది, శివనందీశ్వరస్వామి ఆలయానికి మూడు కిలోమీటర్లు దూరంలో తెలుగు గంగ కాల్వకు సమీపంలో విష్ణు నందీశ్వరుడు కొలువుదీరాడు. దట్టమైన నల్లమల అడవుల మధ్యలో ఉన్న ఈ ఆలయ శోభ వర్ణనాతీతం..
ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు ఇక్కడి ప్రకృతి అందాలకు మైమరచిపోతారు. చుట్టూ పరచుకున్న నల్లమల అడవీ ప్రాంతం, ఇంకో పక్క కొండలు, గుట్టలు ఈ క్షేత్రానికి వచ్చిన భక్తుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విష్ణునంది లేక కృష్ణనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు విష్ణుమూర్తి ఇక్కడ భవ్య లింగాన్ని ప్రతిష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా చెబుతున్నాయ. ఆ కారణంగానే ఈ నందికి విష్ణునంది అనే పేరొచ్చింది. గర్భాలయంలో విష్ణునందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. లింగ రూపంలో ఉన్న విష్ణు నీదంశ్వరుడి దర్శనం పూర్వజన్మల పుణ్య ఫలంగా భక్తులు భావిస్తారు. ఓ ప్రత్యేకమైన లోకాలకు తోడ్కొనిపోయే ఈ దివ్యాలయం చుట్టూ పురాతన కాలంనాటి కోనేరు, నవగ్రహాలు, వినాయక, విష్ణు, లక్ష్మి మందిరాలున్నాయి. ఆలయానికి సమీపంలో సెలయేరు నిత్యం పారుతూ ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ సెలయేటిలోనే భక్తితో స్నానాలు చేసి విష్ణునందీశ్వరుడ్ని దర్శించుకుంటారు.
సూర్యనంది:- నంద్యాలకు సుమారు 8 కిలోమీటర్లు దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే సూర్య నందీశ్వరాలయం. సూర్యనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రం నవనందులలో విశేషమైన నందిగా ఖ్యాతిగాంచింది. సూర్యుడు ఇక్కడ శివుడి గురించి తపస్సు చేసి ఆ స్వామి లింగాన్ని ప్రతిష్టించాడు. ఆ కారణంగా ఇది సూర్యనంది అయ్యింది. పూర్వకాలం నాటి ఆనవాళ్ళతో అలరారుతున్న ఈ ఆలయాన్ని అనంతరం భక్తులు, వధాన్యుల సహకారంతో నిర్మించారు. ఈ ఆలయం యు.బొల్లవరం గ్రామానికి సమీపంలో తమ్మడపల్లె గ్రామంలో ఉంది.
అతి పురాతన ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి నంద్యాల వరకు బస్సు లేదా రైలులో చేరుకోవాలి. అనంతరం నంద్యాలనుంచి మహానంది మార్గంలో ఏడు కిలోమీటర్లు ప్రయాణించి యు.బొల్లవరం గ్రామానికి చేరుకోవాలి. అక్కడనుంచి కుడి చేతివైపుగా కిలోమీటరు దూరం ప్రయాణిస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. తమ్మడపల్లె ఓ చిన్ని గ్రామం. ఇక్కడ ఉన్న సూర్య నందీశ్వరాలయంవల్ల ఈ గ్రామ ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ సూర్యనంది ఆలయాన్ని కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో సూర్య నందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న ఆలయంలో మరో పక్క పార్వతి మాత కొలువుదీరి ఉంది.
గరుడ నంది:- సూర్య నందీశ్వరస్వామి ఆలయానికి సుమారు పది కిలోమీటర్లు దూరంలో మహానంది దివ్య క్షేత్ర నడిబొడ్డున గరుడ నందీశ్వరుడు కొలువుదీరాడు. మహానంది క్షేతానికి ప్రారంభంలో ఉన్న ఈ గరుడ నందీశ్వరాలయం అతి పురాతనమైనది. ఆ కారణంగా ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో దీనిని తిరిగి పునరుద్ధరిస్తున్నారు. గరుడ నందిగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు గరుత్మంతుడు ఇక్కడ మహాదేవుని గురించి తపస్సు చేసి ఇక్కడో భవ్య లింగాన్ని ప్రతిష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగానే ఈ నందికి గరుడ నంది అనే పేరొచ్చింది. గర్భాలయంలో గరుడ నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.
వినాయక నంది:- మహానందిలో ఉన్న మరో విశిష్ట నంది వినాయక నంది. మహానందీశ్వరస్వామి వారి ఆలయానికి ఈశాన్య దిశలో ఉన్న ఈ దివ్యాలయం లో పరమేశ్వర లింగాన్ని సాక్షాత్తు వినాయకుడు ప్రతిష్టించడానికి ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యాలయంలో వినాయక నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. నాగ ఫణాఫణి ఛత్రంగా ఇక్కడ స్వామివారు అలరారుతున్నారు. వినాయక నందీశ్వరస్వామి వారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం.
మహానంది:- నవ నందులలో విశేషమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్న క్షేత్రం మహానంది. ఇది కర్నూలు జిల్లాలో నంద్యాలకు 14 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఆహ్లాదకరమైన యాత్రా స్థలం. గుడి చుట్టు ప్రవహించే నీటి బుగ్గల చల్లదనం, చుట్టు అల్లుకున్న నల్లమల అరణ్యపు ప్రకృతి సౌందర్యం, అన్ని కాలాల్లోను భక్తులను ఆకర్షిస్తూనే ఉంటుంది. పూర్వం శాలంకాయనుడు రాళ్ళను తింటూ అతి విచిత్రమైన తపస్సు చేసి శంకరుని మెప్పించి శిలాదునిగా పిలువబడుతూ, శివభక్తుడై, జీవించసాగాడు. అతడొక రోజున పొలాన్ని దున్నుకుంటుంటే, ఓ బాలుడు దొరికాడు. వృషభ రూపంలోనున్న ధర్ముడే ఇలా పుట్టాడని, అతనికి ‘‘నంది’’ అని పేరు పెట్టి పెంచాడు. అతడు పరమశివుని దర్శనం కోరి ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శంకరుడు నందిని వరం కోరుకొమ్మన్నాడు.
సదాశివ ధ్యానమే తనకు కలుగునట్లు వరం కోరుకున్నాడు నంది. శివుడు అనుగ్రహించి అతనిని పుత్రుడుగా స్వీకరించాడు. ఎన్నో సిద్ధులను ప్రసాదించి తనంతటి వాణ్ణి చేసి, వాహనంగా తన చెంతనే ఉండమన్నాడు. ‘‘సుయశ’’ అనే కాంతనిచ్చి వివాహం చేశాడు. తన ద్వారపాలకునిగా నియమించుకున్నాడు. ఈ విధంగా నందిని శంకరుడు అనుగ్రహించిన ప్రదేశమే మహానంది క్షేత్రం. ఇక్కడ ఉన్న ఈశ్వరుని నంది ప్రతిష్టించాడని, అందువల్లనే ఇది నందీశ్వరాలయమైందని స్థల పురాణం. ఈ క్షేత్రంలో వెలసిన మహానందీశ్వర స్వామి లింగం స్వయంభూలింగంగా ఖ్యాతికెక్కింది.
గర్భాలయంలో ఉన్న శివలింగంపై భాగాన ఆవు పాదం ముద్రలు కనిపిస్తాయి. శ్రీ మహానందీశ్వర స్వామి రజత కవచాలంకృతుడై నయన మనోహరంగా దర్శనమిస్తారు. పార్వతీదేవి కామేశ్వరిగా కొలువులందుకుంటోంది. కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవ నందుల దర్శనంవల్ల జన్మ జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. నవ నందుల దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం...

శివలింగాలు


"ఓం" అనే ఏకాక్షర మంత్రం ఎంత శక్తివంతమైందో తెలుసా?
.......................................................
"ఓం" అనే ఏకాక్షర మంత్రం... చాలా శక్తివంతమైంది. దీనినే ప్రణవమని అంటారు. ఓం, ఓమ్, లేదా ఓంకారము త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఓంకారం ఏర్పడింది. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. పరమాత్మకు శబ్దరూప ప్రతీక.
మంత్రోచారణం అనేది జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే సాధనం. ఇందులో ఓంకారానికి అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. ఓం కారము పరబ్రహ్మ స్వరూపము. ఆ ఓంకారము నుంచే యావత్తు జగము ఉద్భవించింది. వేదముల యొక్క సారము ఓంకారము.
`ఓం' అంటే ప్రారంభాన్ని తెలుపునది. ఓకాక్షర మంత్రము, భగవంతుని ముఖ్యనామమైన `ఓం'కు అనేక అర్థాలు కలవు. బ్రహ్మనాదము ఓంకారము. ఆత్మ ఓంకార మంత్ర స్వరూపము ప్రణవ నాదమే ప్రాణము. ప్రధమ నాదము ఓంకారము. అకార, ఉకార, మకారములను మూడు అక్షరముల కలయిక వలన ఓంకారము ఉద్భవించినదని పండితులు చెబుతున్నారు


శివలింగాలలోని ప్రత్యేకత...!
.......................................................
పరమశివుడికి సంబంధించిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత వుంటుంది. కొంతమంది వీటిలో తమకిష్టమైన వాటిని ఎంచుకుని నిరంతరం వాటినే పూజిస్తుంటారు. అలాగే ప్రతిఒక్కరూ రకరకాలుగా తమకు అనుగుణంగా వుండే విధంగా, తమకు నచ్చిన సమయంలో పూజించుకుంటుంటారు.
అయితే ఏ లింగాన్ని, ఎప్పుడు, ఎలా పూజించాలి...? వాటివల్ల వచ్చే నష్టాలేంటి, లాభాలేంటి దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం....
01. లింగపురాణాల ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్నీ, శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణలింగాన్నీ, వాణిజ్య ప్రధానలైన వైశ్యులు స్వర్ణలింగాన్నీ పూజించుకోవాలి. అయితే స్ఫటికలింగాన్ని మాత్రం ఎవరైనా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా పూజించుకోవచ్చు.
02. ఏ లింగాన్ని పూజిస్తే ఏ ఫలితం లభిస్తుందోనన్న విషయాలు లింగపురాణంలో వివరించి వున్నాయి. అందులో రత్నాజ శివలింగాన్ని పూజించడం వల్ల ఐశ్వర్యంతోపాటు వైభవం సిద్ధించి పరిపూర్ణత కలుగుతుంది. అలాగే ధాతుజలింగం భోగ విలాసాలను అందిస్తుంది. మృత్తికాలింగం కూడా శిలా లింగంలాగానే పరిపూర్ణతనునిస్తుంది.
03. శివునికి సంబంధించిన లింగాలలో అత్యంత పవిత్రమైన లింగం బాణలింగం. ఇవి తెల్లగా, చిన్న అండాకారలంలో నదీప్రవాహం వల్ల సహజంగా నునుపుదేలి వుంటాయి. ఇది నర్మదా నదిలో ఎక్కువగా లభిస్తుంది.
04. వైశాఖంలో వజ్రలింగాన్ని, జ్యేష్ట౦లోమరకత లింగాన్ని, శ్రావణంలో నిలపు లింగాన్ని, భాద్రపదంలో పద్మరాగ లింగాన్ని, ఆశ్వయుజంలో గోమేధికలింగాన్ని, కార్తికంలో ప్రవాళలింగాన్ని, మార్గశిరంలో వైడూర్య లింగాన్ని, పుష్యమాసంలో పుష్పరాగ లింగాన్ని, మాఘమాసంలో సూర్యకాంత లింగాన్ని, ఫాల్గుణ౦లో స్పటిక లింగాన్ని పూజించాలి. వీటికి ప్రత్యామ్నాయంగా వెండి, రాగి లింగాలను కూడా పూజించవచ్చు.
05. చివరగా.... లింగపూజ చేసుకునేవారు ఉత్తరముఖంగా కూర్చొని వుండాలి. అలాగే రుద్రాక్ష, భస్మం, మారేడు అనే మూడువస్తువులు తమతోపాటు తప్పనిసరిగా పూజలో వుంచుకోవాలని శివపురాణంలో చెప్పబడింది.


పాపాలు తొలగించు పాలాభిషేకం...!.....................................................

మానవుల కోరికలు, పాపాలు, అసంతృప్తులో వారి దుఃఖానికి కారణం. దీని వలనే మనం అశాంతి పాలవుతుంటాం. అలాంటప్పుడు పరమేశ్వరుడిని అభిషేకిస్తే పాప విముక్తులయి, దుఃఖం దూరమవుతుంది. ఆనందం ఆదిదేవుని ఆశ్వీర్వాదంగా లభిస్తుంది.
శివుడు అభిషేక ప్రియుడని భక్తులందరికీ తెలుసు. ఆ మహాదేవునికి అభిషేకానిసి నీళ్లు, పాలు, కొబ్బరినీళ్లు, చెరుకురసం, పండ్ల రసాలు లాంటి ద్రవ్యాలు వాడుతుంటారు. ఇలా ఒక్కో అభిషేక ద్రవ్యంతో అభిషేకం చేయడం వలన ఒక్కో ఫలితాన్ని పొందవచ్చని చెబుతుంటారు. పరమశివుడిని ఆవుపాలతో అభిషేకించడం వలన, దుఖాల నుంచి విముక్తి లభిస్తుంది.
జీవితంలో ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన వ్యథ. ముఖ్యమైన కార్యాలలో విజయం లభించకపోవడం, అనుకున్న పనులు నెరవేరక పోవడం, ఆటంకాలు ఏర్పడటం, అయినవాళ్లు ఆపదలు, అనారోగ్యం పాలవడం లాంటివి ఎన్నో. అన్ని రకాల దుఃఖ బాధల నుంచి విముక్తికి పరమశివుడి అనుగ్రహమే మార్గం. ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ఆవుపాలతో అభిషేకం చేయాలి. తద్వారా పాపవిముక్తి, భగవత్ అనుగ్రం కలుగుతాయి.


శివ నామ మహిమ....!.......................................................

శివుని ఉపాసి౦చు వారు ధన్యులు. కృత కృత్యులు. వారి జన్మ సఫలమగును. వారి కులము ఉద్ధరి౦పబడును. సదాశివ, శివ అ౦టూ శివనామమును జపి౦చు వానిని చెదలు నిప్పును వలె, పాపములు స్పృశి౦చజాలవు. ఓ శివా! నీకు నమస్కారము అని పలికే నోరు పాపములనన్నిటినీ పోగొట్టే పవిత్ర తీర్థము. ఎవనియ౦దు అత్య౦త శుభకరములగు శివనామము, విభూతి, రుద్రాక్షలు అనే మూడు ఉ౦డునో, అట్టివాని దర్శన మాత్రముచేత త్రివేణీ స౦గమములో స్నానము చేసిన ఫలము లభి౦చును. వాని దర్శనము పాపములను పోగొట్టును. ఎవని లలాటముపై విభూతి లేదో, ఎవని శరీరమున౦దు రుద్రాక్ష ధరి౦పబడదో, ఎవని పలుకులు శివనామ భరితములు కావో అట్టి వానిని అధముని వలె త్యజి౦చవలెను. శివనామము గ౦గ వ౦టిది. విభూతి యమున వ౦టిది. రుద్రాక్ష సర్వపాపములను పోగొట్టే సరస్వతీ నది వ౦టిది.
ఈమూడు ఎవని శరీరమున౦దు గలవో, వాని పుణ్యమును ఒకవైపు, త్రివేణీ స౦గమ స్నానము వలన లభి౦చు పుణ్యమును మరియొకవైపు ఉ౦చి విద్వా౦సులే కాక పూర్వము బ్రహ్మ కూడా లోకహితమును కోరి పోల్చి చూసెను. రె౦డి౦టి ఫలము సమానముగను౦డెను. కావున విద్వా౦సులు అన్నివేళలా ధరి౦చవలెను. ఆనాటి ను౦డియూ బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు మూడి౦టినీ ధరి౦చుచు౦డిరి. వీటి దర్శనము పాపములను పోగొట్టును.
శివనామమనే దావాగ్ని యెదుట మహాపాపములనే పర్వతములు తేలికగా బూడిదయగునను మాట ముమ్మాటికీ సత్యము. స౦సరమునకు మూలమైన పాపములు శివనామము అనే గొడ్డలితో నిశ్చయముగా నాశమును పొ౦దును. శివనామమున౦దు భక్తి కలిగిన మహాత్ములకు ముక్తి శీఘ్రముగా లభి౦చును. అనేక జన్మములు తపస్సు చేసిన వానికి పాపములన్నిటినీ పోగొట్టే శివనామమున౦దు భక్తి కుదురును. ఎవనికి శివనామము న౦దు అతిశయి౦చిన నిర౦తర భక్తి కుదురునో వానికి మాత్రమే మోక్షము సులభమగుననియు, ఇతరులము దుర్లభమనియు శివపురాణమున౦దు చెప్పబడినది.

ఈ ప్రపంచములో సృష్టిస్థితిలయములకు సకలచరాచర జీవకోటిని సంరక్షించుటకు 
కైలాసములో పార్వతీ పరమేశ్వరులుగా, 
శ్రీశైలములో భ్రమరాంబ మల్లిఖార్జునులుగా, 
కాశీలో విశాలాక్షి విశ్వనాధలింగేశ్వరులుగా, 
సోమేశ్వర, మల్లిఖార్జున, మహాకాళేశ్వర, అమరేశ్వర, వైద్యనాథేశ్వర, భీమేశ్వర, రామేశ్వర, నాగేశ్వర, విశ్వేశ్వర, త్రయంబకేశ్వర, కేదరేశ్వర, ఘృశ్వేశ్వర అను ద్వాదశ జ్యోతిర్లింగములుగా వివిధ పుణ్యక్షేత్రములలో ప్రసిద్ధి చెందినారు. 

ఆ జగద్రక్షకుడైన జగదీశ్వరుని ఎంత పొగిడినా తనివితీరదు. ఓం నమః శ్శివాయ అను పంచాక్షరి మంత్రమును నియమ నిష్ఠలతో పఠించిన శివకోటి భక్త జనులకు సర్వపాపములు పటాపంచలు అయి ముక్తి మోక్షఫల ప్రదంబుల నొసంగి జన్మ తరింపజేయును. శివదీక్షను, నిష్ఠ నియమాలతో ఆచరించిన, దేహపీడలు అకస్మాత్ కలహములు తొలగి ఆయురారోగ్యములు, అష్ట్యైశ్వర్యములతో శుభ ప్రదముగా జీవించునట్లు ఆశీర్వదించును. దేవతలందరిలో శివుడు దయారస హృదయుడు. భక్తుల మొరలాలించి వరాలిచ్చే బోళాశంకరుడు. శివ అంటే శుభము అని అర్థము. ఇతర దేవతలవలె శివుడు అవతారము లెత్తుటకై మహా శివుడు ఎవరి గర్భమున జన్మింపలేదు. అవతారము, అవతార సమాప్తి, అన్నియు లీలలే, శివుడు నిర్మలుడు, నిర్గుణుడు, నిష్కలంకుడు, నిటాలాక్షుడు, నిరంజనుడు. అట్టి ఆదిదేవుడు శివుని ఆలంబనముగా జేసుకొని ఆచరించబడేదే శివదీక్ష జగన్మాతయైన పార్వతీదేవి కఠోరమైన శివదీక్ష చేసి, ఆ పరమశివుని అనుగ్రహము వలన నిజమైన అర్థాంగియైనది. శివుని శరీర మందు అర్థభాగము స్వీకరించుటచే పరమేశ్వరుడు కూడా అర్థనారీశ్వరుడైనాడు. 
శ్రీరామచంద్రుడు శ్రీరామలింగేశ్వరుని, శ్రీకృష్ణుడు శివదీక్షను, అర్జునుడు పాశువత దివ్య దీక్షను స్వీకరించి తరించునట్లు చెప్పబడుచున్నది. మనకు తెలిసినంత వరకు శివదీక్ష పట్టిన వారిలో మొట్టమొదటి భక్తురాలు పార్వతీదేవి. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలు శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, భక్త కన్నప్ప నుండీ, పర్వతుడు, భక్త సిరియాలుడు మొదలైనవారు శివదీక్షను పాటించినట్లు విక్రమాదిత్యుని తామ్రశాసనం వలన తెలుస్తుంది. కార్తికేయుడు కూడా శివదీక్షను పూని దేవతాసిన్యాలకు అధిపతి అయినాడు. ఇంతటి దివ్య మహిమగల శివదీక్ష ఎంతో ప్రాచీనమైనది. మాఘమాసంలోని మహాశివరాత్రితో మండలకాలం అనగా 40 రోజుల్లో ముగియునట్లుగా ఆచరించుట మంచిది. 40 రోజులు పూర్తయి 41వ రోజున దీక్ష విరమించవలెను. మాఘమాసములోని మహాశివరాత్రితో గాని, కార్తీక మాసములోని మహాశివరాత్రితో గాని, కార్తీక మాసములోని మాస శివరాత్రితోకాని దీక్ష పూర్తి అయ్యే విధముగా ఆచరించవచ్చును. మండలకాలం పూర్తి అయిన తరువాత జ్యోతిర్ముడితో శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి మల్లిఖార్జున స్వామికి నమస్కరించి శ్రీశైల మహాక్షేత్రము నందు గల త్రిఫల వృక్షము క్రింద ఈ దీక్షా విరమణ చేయుట మిక్కిలి శ్రేష్ఠము. ఇది చేయలేని వారు అర్థ మండలం అనగా 20 రోజులు శివ దీక్షవహించిన 21 వ రోజులో దీక్షావిరమణ చేయవలెను. ఈ శివదీక్షను స్థానిక శివాలయములోని శివార్చకునితో కాని ఇంతకు పూర్వము శివదీక్షను స్వీకరించిన వారితోకాని మూలాధారణను చేయించుకొనవలెను. ఇట్టి మహత్తరమైన శివదీక్షను నియమానుసారము ఆచరించిన వారికి భూత, ప్రేత, పిశాచ, శత్రు బాధలు, గ్రహారిష్టములు తొలగిపోవును. సర్వ సంపదలు కలిగి ఐహికాముషిక సుఖబీమమీలు పొందెదరు. శంకరాచార్యుల వారు తన శివానందలూ ఓ పరమేశ్వరా ! ఈ జగత్తులో సహస్రార్థిలో దేవతలు ఉన్ననూ శాశ్వత మోక్ష ఫలమును ప్రసాదించువాడవు నీవే సుమా ! కనుక నీ పాదద్మములే నాకు శరణ్యము. శివదీక్ష - మాలాధారణ మంత్రం 108 రుద్రాక్షలు, దానికి చివర పరమేశ్వరుని ముద్రగల మాలను తీసుకొనవలెను. ఈ శ్లోకములను చెప్పుచూ మాలను శివ ముద్రకు నమస్కారం చేయవలెను. శ్లో!! ఓంకార శక్తి సంయుక్తాం సచ్చిదానంద రూపిణీం ! శ్రీశైలేశ దయాపూర్ణాం శివముద్రాం నమామ్యహం !! అంటూ రుద్రాక్షమాలకు గల స్వామి వారి నమస్కారం చేయాలి.

మాస శివరాత్రి ....!
.......................................................
ప్రతి మాసానిదీ ఒక విశిష్టత.. ప్రతి మాసంలోనూ ఒక పండుగ..ప్రతి రోజూ ఒక కొత్తదనం. పండుగలంటే మనకెంతో సరదా. ఎంతో ఉత్సాహంగా సరదాగా జరుపుకుంటాం. ఎంత బీదవారైనా గొప్ప వారైనా ఎలాగో అలాగ జరుపుకోవాలనే చూస్తారు. శ్రీరామనవమి నుంచి శివరాత్రిదాకా సంవత్సరం పొడుగునా పండుగలే. బహుశా ఏ మతంలోనూ కూడా మనకున్నన్ని పండుగలు, పూజలు, వ్రతాలు ఉండవేమోననిపిస్తుంది. పండుగలనగానే పిండివంటలు చేసుకోవటం బంధుమిత్రులతో వినోదంగా కాలక్షేపం చేయటమేనని చాలా మంది భావన అయితే మనకి కనిపించే వ్యవహారమిదే. కాని ఆంతర్యంలో చాలా విశేషాలుంటాయి. ప్రతి పండుగా ఏదో ఒక దేవుడిని దేవతను ఆరాధించాలని సంప్రదాయం. దేవుళ్లు అంటే అమర్త్యులు..... మనం మర్త్యులం. -- జన్మ, మృత్యు, జరావ్యాధులతో బాధలను తప్పించుకోవాలంటే అవి లేని
వారినారాధించాలి. అప్పుడు వారిలోని దివ్యగుణాలు కొన్నైనా మనలో చోటు చేసుకుంటాయి. అందుకే పండుగలలో ఆహారం కంటే పూజలకే ఎక్కువ ప్రాధాన్యత వుంటుంది. భారతీయ ఆధ్యాత్మికాచారాలలో పండుగలకున్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. పండుగను అభిమానించని భారతీయుడు ఉండడు. ప్రత్యేకంగా పండుగను చేసుకోని నాస్తికులు సైతం పండుగ దినాలను మాత్రం ఖచ్చితంగా సంతోషంగా అనుభవించే తీరతారు. అది పూజతో నిమిత్తం లేనిది. సంతోష ఉత్సాహాలకు నిలయమైనది. కాబట్టే పండుగ అనే భావన ఎటువంటివారిలోనైనా అలౌకికానందాన్ని పంచుతుంది. ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకమైన శోభను చేకూరుస్తూ మానసికోల్లసాన్నిస్తూ గృహాలకు కొత్త అందాలను ఇస్తుంది. అందుకే చిన్నా, పెద్దా అందరూ వీటికోసం ఎంతో ఆర్తిగా ఎదురుచూస్తుంటారు. పండుగల సంబరాలు చిన్న పిల్లలవే అయినప్పటికీ ఆ ముచ్చట్లను పెద్ద్లలు కూడా ఎంతో సంతోషంగా అనుభవిస్తారు.
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే
నిర్ధేశించబడుతుంది .
మాస శివరాత్రి :
ప్రతి నెలలోను వచ్చే బహుళ పక్షంలోని చతుర్ధశిని మాస శివరాత్రి అంటారు .అలా సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులు వస్తే అందులో గొప్పదైన ఈ శివరాత్రి - అంటే -మాఘ మాస శివరాత్రి ' మహా శివరాత్రి (తిథి ద్వయం వున్నప్పుడు అమావాస్యకు ముందు రోజు - రాత్రి చతుర్ధశి కలిగిన వున్న రోజుని జరుపుకోవాలి) అవుతోంది .'మహా' అని ఎక్కడ అనిపించినా కొన్ని అలాంటి వాటికంటే గొప్పదని భావం . శివ పార్వతులిరువురికి కలిపి 'శివులు' అని పేరు ( శివ శ్చ శివా చ సివౌ ).ఆ ఇద్దరికీ సంభందించిన రాత్రి శివరాత్రి అనేది మరో అర్థం . అందుకే శివరాత్రి నాడు అయ్యకి - అమ్మకి కుడా వుత్సవం సాగుతుంది .శివ - మంగళకరమైన - రాత్రి ఏదో అది శివరాత్రి అనేది మూడో అర్థం .
ప్రాణికోటి యావత్తు నిద్రపోతూ ఉండే కాలం.. రాత్రి , నిద్ర అనేది పాక్షిక మరణంతో సమానం. ఆ రాత్రి వేల తానూ మేల్కొని రక్షించే శంకరుడు రాత్రి దేవుడు . తన వివాహం కూడా అర్దరాత్రి దాటాకనే మొదలవుతుంది. చలి కాలం వెళ్ళబోతుండగా 'మహాశివరాత్రి' పండుగ దినము వస్తుంది. చలి , మంచు భాధకు తాళలేక శరీరంలో పుట్టే చలిని తట్టుకోలేక గొంగల్లని కప్పుకుని వుండగా - పిశాచ , భూత ప్రేతాలకి దుఃఖాన్ని చేకూర్చే వాడైన శంకరుడు, నెలవంకను శిరోభూషనముగా ధరించి భస్మ లేపనం వాసనల మద్య కన్నుల పండువగా జరిగే పార్వతీ పరమేశ్వరుల (శివ-పార్వతుల) కళ్యాణ మహోత్సవము కోసం ఎన్ని రాత్రులైనా వేచి చూడాల్సిందే.....
మాస శివరాత్త్రి పర్వదినం నాడు మెడలో మీకు నచ్చిన రుద్రాక్ష ధరించి, ఈ దీపాలను పడమర దిక్కున వెలిగించి, "ఓం నమఃశివాయ" అని 108 సార్లు ధ్యానించే వారికి కైలాస ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం. అదేవిధంగా.. ఆలయాల్లో పంచామృతముతో శివునికి అభిషేకం చేయిస్తే ఈతిబాధలు, దారిద్య్రాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
తెలిసిగానీ, తెలియక గానీ భక్తి తోగాని, డంబముతో గాని, యీరోజు ఎవరైతే స్నానము, దానము, ఉపవాసము జాగరణ చేస్తారో వారికి శివ సాయుజ్యం కైలాస ప్రాప్తి తధ్యమని భక్తి గాధలు తెలుపుతున్నాయి.

సూర్య నమస్కారాలు....!


| సూర్య నమస్కార మంత్రములు ||
ఓం ధ్యేయః సదా సవితృమణ్డల మధ్యవర్తి|
నారాయణః సరసిజాసన్సంఇవిష్టః|
కేయూరవాన్ మకరకుణ్డలవాన్ కిరీటీ|
హారీ హిరణ్మయవపుధృ|ర్తశంఖచక్రః||
ఓం మిత్రాయ నమః|
ఓం రవయే నమః|
ఓం సూర్యాయ నమః|
ఓం భానవే నమః|
ఓం ఖగాయ నమః|
ఓం పూష్ణే నమః|
ఓం హిరణ్యగర్భాయ నమః|
ఓం మరీచయే నమః|
ఓం ఆదిత్యాయ నమః|
ఓం సవిత్రే నమః|
ఓం అర్కాయ నమః|
ఓం భాస్కరాయ నమః|
ఓం శ్రీసవితృసూర్యనారాయణాయ నమః||
ఆదితస్య నమస్కారాన్‌ యే కుర్వన్‍తి దినే దినే|
జన్మాన్తరసహస్రేషు దారిద్ర్‌యం దొష నాశతే|
అకాలమృత్యు హరణం సర్వవ్యాధి వినాశనమ్‌|
సూర్యపాదొదకం తీర్థం జఠరే ధారయామ్యహమ్‌||
యొగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన|
యొపాకరొత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతొऽస్మి||

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా... అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి.
ఆసనానికో ప్రయోజనం :-
సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా... అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు! వీటిలో ఒకటి నుంచి ఐదు... ఎనిమిది నుంచి పన్నెండు ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో చూద్దాం...
ఒకటి, పన్నెండు :- శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి.
రెండు, పదకొండు :- జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వెన్నెముక, పిరుదులు బలోపేతమవుతాయి.
మూడు, పది :- రక్త ప్రసరణ పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. గ్రంధులపై కూడా ప్రభావం చూపుతాయి.
నాలుగు, తొమ్మిది :- వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి.
ఐదు, ఎనిమిది: గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి.
ఆరో ఆసనం :- మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఏడో ఆసనం :- జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నెముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది.
మరెన్నో లాభాలు :-
సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండటమే కాదు... మధుమేహం, బీపీ, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. "సూర్య నమస్కారాలలో 12 రకాల భంగిమలు ఉంటాయి. వీటిలో కొన్నింటిని నెమ్మదిగా చేయాలి. మరి కొన్నింటిని వేగంగా చేయాలి. వేగంగా చేసే భంగిమల్లో కండరాలకు మేలు జరుగుతుంది. ఏరోబిక్స్‌తో సమానమైన ఫలితాలు సాధించవచ్చు. నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి.
ఎక్కువ గాలిని పీల్చి, వదలడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది'' అని ఆనంద బాలయోగి వివరించారు. అధిక బరువు తగ్గడం, జీర్ణ ప్రక్రియ మెరుగవడంతోపాటు... సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్య నమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంధులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పార్థరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంధులు సాధారణ స్థాయిలో పని చేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.
1.నమస్కారాసనం ( ఓం మిత్రాయ నమ ):-
సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్ఛరించాలి.
2.హస్త ఉత్తానాసనం ( ఓం రవయే నమః) :-
కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి, తలను, నడుమును వెనుకకు వంచాలి. కాళ్ళు వంచకూడదు.
3.పాదహస్తాసనం ( ఓం సూర్యాయ నమః) :-
శ్వాస వదలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమిమీద ఆనించి, తలను మోకాలుకు ఆనించాలి.
4.ఆంజనేయాసనం ( ఓం భానవే నమ ) :-
ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.
5.పర్వతాసనం ( ఓం ఖగాయ నమః) :-
కాళ్ళు, చేతులు నేలమీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.
6.సాష్టాంగ నమస్కారం ( ఓం పూష్ణే నమః) :-
ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి 'అష్టాంగ నమస్కారం' అని కూడా అంటారు. రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, రొమ్ము మరియు గడ్డం - ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.
7.సర్పాసనం ( ఓం హిరణ్యగర్భాయ నమః ) :-
శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి.
8.పర్వతాసనం ( ఓం మరీచయే నమః) :-
ఐదవ స్థితివలెనే కాళ్ళు చేతులు నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.
9.ఆంజనేయాసనం ( ఓం ఆదిత్యాయ నమః) :-
నాలుగవ స్థితివలెనే కుడి పదాన్ని నేలపై ఉంచి, మోకాలును మడచి, ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి
10.పాదహస్తాసనం ( ఓం సవిత్రే నమః) :-
మూడవ స్థితివలెనే రెండు చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. శ్వాసను బయటకు వదలి ఆపాలి.
11.హస్త ఉత్తానాసనం ( ఓం అర్కాయ నమః) :-
రెండవ స్థితివలెనే రెండు చేతులను పైకెత్తి, తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి.
12.నమస్కారాసనం ( ఓం భాస్కరాయ నమః) :-
నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి.

నిత్యజీవితంలో మనం ఆచరించాల్సిన విషయాలు

1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.
2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.
3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.
4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు.
5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు.
6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు.
7. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి.
8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది.
9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.
10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.
11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు.
12. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి.
13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.
14. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు.
15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.
16. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్ర వచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోను అసహ్యించుకొనరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు.
17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం.
18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు.
19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు.
20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.
21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు.
22. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమంలేదు.
23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు.
24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు.
25. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.
26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను.
27. ఏకాదశి నాడు ఎన్ని అన్నంమెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు.
28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు.
29. తూర్పు, ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు.
30. ఉమ్ము మాత్రం తూర్పు, పడమరగా వేయరాదు.



ఏ రోజు ఏ అభరణాలు ధరిస్తే శుభం..?
.......................................................
మహిళలు నిత్యం అభరణాలు ధరిస్తారు. సందర్భాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. అయితే గ్రహాలను అనుసరించి ఆభరణాలు ధరించాల్సి ఉంటుంది. ఏ రోజు ఏ రకమైన నగలు ధరిస్తే మంచిదో తెలుసుకోవడం ముఖ్యం.
వారంలో రోజుకో గ్రహాధిపతి ఉంటాడు. ఆదివారానికి సూర్యుడు అధిపతి అయితే, శుక్రవారానికి శుక్రుడు అన్నట్టు.. ఆయా వారాలన్ని బట్టి ఆ రోజుకి ఉండే గ్రహాదిపతిని అనుసరించి ఏ నగలు ధరించాలో తెలుసుకోవాలి. నిత్యం నవగ్రహాలను అనుసరించి ఆభరణాలు ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి.
అయితే బంగారంతో పొదిగించిన ఆభరణాలు లేకపోయినా.. తమ తమ స్థోమతకు తగినట్లు ఇప్పుడు దుకాణాల్లో అమ్మబడే ఆభరణాలతో ప్రతిరోజూ అలంకరణ చేసుకోవడం మంచిది.
ఇక ఏ వారంలో ఎలాంటి ఆభరణాలు ధరించాలో తెలుసుకుందాం.
* ఆదివారం (సూర్యగ్రహానికి ప్రీతికరమైన రోజు) కెంపులతో చేసిన నగలు.. చెవిపోగులు, హారాలు మొదలగునవి ధరించడం శుభప్రదం. దీనిద్వారా నేత్ర సంబంధిత వ్యాధులు, శరీర తేజస్సు, ప్రకాశవంతం పొందవచ్చును.
* సోమవారం (చంద్రగ్రహానికి ప్రీతికరమైన రోజు) ముత్యాలతో తయారు చేసిన ఆభరణాలు.. హారాలు, గాజులను వేసుకోవడం మంచిది. ముత్యాలతో తయారయ్యే గాజులను, చెవిపోగులను వాడటం ద్వారా మనశ్శాంతి, అనుకున్న కార్యములో విజయం చేకూరుతుంది.
* మంగళవారం (కుజ గ్రహానికి ప్రీతికరమైన రోజు) పగడాలతో చేసిన ఆభరణాలు.. దండలు, ఉంగరాలను వాడటం మంచిది. పగడాలతో తయారైన ఉంగరాలను, దండలను వాడటం ద్వారా కుటుంబ సంక్షేమం చేకూరటం, ఈతిబాధలు తొలగిపోవడం వంటి ఫలితాలుంటాయి.
* బుధవారం (బుధ హానికి ప్రీతికరమైన రోజు) పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి వాడటం మంచిది. విద్యాకారకుడైన బుధునికి ప్రీతికరమైన ఈ రోజున విద్యార్థులు పచ్చని రంగుతో కూడిన ఉంగరాలు, స్త్రీలతే హారాలు వినియోగించడం మంచిది. దీంతో బుద్ధికుశలతలు పెరగడం, ధనలాభం, కార్యసిద్ధి చేకూరుతుంది.
* గురువారం బృహస్పతి (గురుభగవానుడు) కోసం పుష్యరాగముతో తయారైన చెవిపోగులు, ఉంగరాలు వంటి ఆభరణాలు ధరించడం మంచిది. దీంతో గురుగ్రహ ప్రభావంతో అవివాహితులకు కళ్యాణం జరగడం, వ్యాపారాభివృద్ధి, కార్యసిద్ధివంటి ఫలితాలుంటాయి.
* శుక్రవారం శుక్రుని (శుక్రగ్రహం) కోసం వజ్రాల హారాలు, ముక్కుపుడక వాడటం ద్వారా స్త్రీలకు సౌభాగ్యం, ఆర్థిక సమస్యలు తొలగిపోవడం, పదోన్నతులు, అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. లక్ష్మిదేవి అనుగ్రహం కూడా పొందినవారవుతారు.
* శనివారం (శనిగ్రహం) శనికోసం నీలమణి, మణిహారాలు వంటి ఆభరణాలు ధరించడం మంచిది. దీనిద్వారా శనిగ్రహ ప్రభావంతో తలెత్తే సమస్యలు కొంతవరకు సమసిపోతాయి. నీలమణితో తయారైన హారాలు చెవిపోగులు, ఉంగరాలు ధరించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

రాగితో ఆరోగ్యం బోలెడు....?
.......................................................
గతంలో రాగి చెంబు, రాగి బిందె, రాగి గ్లాసు, రాగి ప్లేటు ఇలా ఎక్కువగా రాగి వస్తువులనే వాడే వారు. కాని నేడు ఫ్యాషన్‌ ఎక్కువయ్యి ప్లాస్టిక్‌ వచ్చిపడింది. దాంతో రాగి పాత్రల వాడకం బాగా తగ్గిపోయింది. నీళ్ళు తాగాలంటే ప్లాస్టిక్‌ బాటిల్స్‌, లంచ్‌ బాక్సులు కూడా ప్లాస్టికే. నేటి ఇళ్ళు మొత్తం ప్లాస్టిక్‌ సామానుల మయమైపోయాయి. అయితే రాగి పాత్రలు వాడడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
* రాగిలో యాంటి బ్యాక్టిరియల్‌ నేచర్‌ ఉంటుంది. రాగితో చేసిన పాత్రలలో సూక్ష్మ క్రిములు చేరే అవకాశం ఉండదు. కాబట్టి ఇందులో నిల్వచేసే పదార్థాలు చెడిపోయే అవకాశాలు చాలా తక్కువ.
* మనకి వచ్చే చాలా రోగాలకి నీటి కాలుష్యం ముఖ్యమైన కారణం. రాగి పాత్రలలో నీళ్ళు ఉంచితే అందులో క్రిములు చేరే అవకాశం చాలా అరుదు. అందుకే పాత రోజుల్లో రాగి బిందెలు వాడేవారు.
* చెవులు కుట్టినప్పుడు కూడా చిన్న పిల్లలకి కొన్ని చోట్ల మొదటిసారి రాగి తీగలు చుడతారు. ఎందుకంటే పుండు పడకుండా ఉండటానికి. రాగికి వున్న ఆంటి బ్యాక్టిరియల్‌ లక్షణం పిల్లలకు ఆ ప్రమాదం రాకుండా చేస్తుంది.
* గతంలో నీళ్ళు వేడి చేసుకోవడానికి రాగితో చేసిన బాయిలర్లు వాడే వాళ్ళు. ఇందులో వేడి చేసిన నీరు వాడడం వల్ల చర్మ సంబంధిత రోగాలు కూడా తగ్గేవని రుజువు చెయ్యబడ్డాయి.
* రాగి చెంబులో రాత్రి నీరు వుంచి పగలు నిద్ర లేవగానే తాగితే చాలా చాలా మంచిది. అలా తాగితే కడు పులో వున్న చెడు అంతా మూత్రం ద్వారా బయటకి వచ్చేస్తుందట. ఈ అలవాటు వల్ల గ్యాస్‌, కిడ్నీ, లివర్‌ సమస్యలు కూడా తగ్గిపోతాయి.
* బ్రిటిష్‌కి చెందిన ఒక యూనివర్సిటీ వాళ్ళు కూడా రాగిపాత్రలలో ఉంచిన నీటిపై పరిశోధన జరిపి పైన పేర్కొన్న విషయాలు నిజమని నిరూపించారు.
రాత్రి రాగి చెంబులో మంచి నీళ్ళు వుంచి పరగడుపున తాగితే హాయిగా జీవించవచ్చు. రాత్రి నిద్ర పోయేముందు అర లీటర్‌ నుండి లీటర్‌ ఉండే రాగి చెంబు నిండా మంచినీళ్ళు పోసి మంచం పక్కనే పెట్టుకోవాలి ఉదయం నిద్ర లేచి లేవగానే రెండు సార్లు పుక్కిలించి ఊసి ఆ రాగి చెంబులోని నీళ్లు తాగాలి . దీనివల్ల 15 నిమిషాల నుండి అర గంటలోపు సుఖ విరోచనం అవుతుంది. గ్యాస్‌, కడుపుబ్బరము, కడుపులో మంట, మలబద్ధకం, తేపులు, మొదలైన బాధలన్నీ ఈ అలవాటుతో ఎటువంటి ఔషదాలు వాడే పని లేకుండా పూర్తిగా తగ్గిపోతాయి. మలబద్ధకం అనేది అన్ని వ్యాధుల్ని కలిగించడానికి మూలకారణం కాబట్టి ఈ అలవాటు తో మలబద్ధకం నివారించుకుంటే హాయిగా జీవించవచ్చు.
ఇక రాగి చెంబులో నీళ్ళే ఎందుకు తాగాలి వేరేవి ఉన్నాయి కదా అని కొందరికి సందేహం రావచ్చు .
రాగి గురించి వరాహ పురాణంలో వివరంగా ఉంది ఈ రాగి ఏడువేల యుగాల క్రితమే విష్ణు మాయ కారణంగా పుట్టింది . గూడకేశుడు అనే ఒక రాక్షసుడు తామ్ర ( రాగి) రూపంలో విష్ణు మూర్తిని ఆరాధించేవాడు అతని భక్తికి మెచ్చి వరం కోరుకోమంటే గూడకేశుడు తన అవయవాలన్ని తామ్ర( రాగి) రూపం దాల్చాలని భగవదారాధనకు ఆ పాత్ర లనే వాడాలని కోరుకుంటాడు. విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఒక శుభ మూహూర్తంలో వైశాఖ శుక్ల ద్వాదశి నాడు గూడ కేశ సంహరం జరిగింది . అతని కోరిక నెరవేరింది . ఆనాటి నుండి మనకు తామ్ర( రాగి) పాత్రలు ప్రాప్తించాయి. అందుకే ఇప్పటికీ దేవాలయాలల్లో, యజ్ఞంలో రాగి పాత్రలను మాత్రమే వాడతారు అంతేగాక రాగికి నీటిలో సూక్ష్మ క్రిముల్ని చంపి నీటిని శుద్ధి చేసే గుణం ఉంటుంది .

కష్టాలతో దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు కాపాడే దీపారాధన ఏది...!
.............,.........................................
దుర్గాదేవి ప్రీతి కోసం చీర, రవికల గుడ్డ, గాజులు, పువ్వులు అన్నీ ఎర్ర రంగులో ఉండేవి దానం ఇవ్వాలి. దీని ద్వారా శక్తి సామర్థ్యాలు, ధైర్యం పెరిగి, కార్య జయం కలుగుతుంది.
విపరీతమైన కష్టాలు ఏర్పడుతున్నప్పుడు దిక్కు తోచని స్థితిలో దుర్గాదేవి దేవాలయంలో 14 రోజులు ప్రదోషంలో అమ్మవారి ఎదురు గుండా పసుపు రంగు గుడ్డ మీద మేలిమి గంధం, పసుపు, కుంకుమ పొడి చల్లి, దాని మీద మట్టి ప్రమిదలో ఆవనూనెతో ఒక వత్తి వేసి, తూర్పు ముఖంగా చూసే విధంగా దీపారాధన చేయాలి.
వాహన ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉన్నప్పుడు 8 బుధవారాలు శివాలయంలో ఉండే అర్చకుడికి స్వయంపాకం దానంగా ఇచ్చి, మట్టి ప్రమిదలో ఆవునెయ్యి పోసి, దక్షిణ ముఖంగా దీపం వెలిగించాలి.

పాపాలు తొలగించు పాలాభిషేకం...!
.....................................................
మానవుల కోరికలు, పాపాలు, అసంతృప్తులో వారి దుఃఖానికి కారణం. దీని వలనే మనం అశాంతి పాలవుతుంటాం. అలాంటప్పుడు పరమేశ్వరుడిని అభిషేకిస్తే పాప విముక్తులయి, దుఃఖం దూరమవుతుంది. ఆనందం ఆదిదేవుని ఆశ్వీర్వాదంగా లభిస్తుంది.
శివుడు అభిషేక ప్రియుడని భక్తులందరికీ తెలుసు. ఆ మహాదేవునికి అభిషేకానిసి నీళ్లు, పాలు, కొబ్బరినీళ్లు, చెరుకురసం, పండ్ల రసాలు లాంటి ద్రవ్యాలు వాడుతుంటారు. ఇలా ఒక్కో అభిషేక ద్రవ్యంతో అభిషేకం చేయడం వలన ఒక్కో ఫలితాన్ని పొందవచ్చని చెబుతుంటారు. పరమశివుడిని ఆవుపాలతో అభిషేకించడం వలన, దుఖాల నుంచి విముక్తి లభిస్తుంది.
జీవితంలో ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన వ్యథ. ముఖ్యమైన కార్యాలలో విజయం లభించకపోవడం, అనుకున్న పనులు నెరవేరక పోవడం, ఆటంకాలు ఏర్పడటం, అయినవాళ్లు ఆపదలు, అనారోగ్యం పాలవడం లాంటివి ఎన్నో. అన్ని రకాల దుఃఖ బాధల నుంచి విముక్తికి పరమశివుడి అనుగ్రహమే మార్గం. ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ఆవుపాలతో అభిషేకం చేయాలి. తద్వారా పాపవిముక్తి, భగవత్ అనుగ్రం కలుగుతాయి.

ధాత్రీ ఫలం....!
ఉసిరికాయనే ఆమలక ఫలం,ధాత్రీ ఫలం అని పిలుస్తుంటారు. కార్తీక మాసంలో ప్రతిరోజు లేదా పౌర్ణమి, అమావాస్య రోజులలో గాని ఉసిరి వృక్షాన్ని పూజిస్తే సర్వ శుభములు కలుగుతాయని శాస్త్రవచనం.బ్రహ్మ ఆనందబాష్ప బిందువులనుండి ఉసిరిక ఉద్భవించింది. శ్రీమహావిష్ణువుకు ధాత్రి, తులసి దళాలు ప్రియములు. ధాత్రి మూలమున శ్రీహరి, స్కంధమున రుద్రుడు, ఊర్ధ్వమున బ్రహ్మ, శాఖలందు సూర్యుడు, ఉపశాఖలందు దేవతలు ఆశ్రయించి ఉంటారట.
"ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరీ విద్యాం, పుత్ర పౌత్రాం, ఆయురారోగ్యం, సర్వసంపదాం మమదేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే - ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీమ్‌ నీరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురుసర్వదా" అనే స్త్రోత్రం చేస్తూ ఉసిరి (ధాత్రీ) చెట్టు క్రింద శ్రీమహావిష్ణువును పూజించి, ఉసిరి దీపారాధన చేసి, ఉసిరికాయలు నివేదన చేసి, పదకొండు ప్రదక్షిణులు చేస్తే, అఖండమైన అష్టైశ్వర్యప్రాప్తి, అనంత పుణ్యఫలం లభిస్తుంది.
ఉసిరికాయలతో నివేదన, ఉసిరికాయలపై ఆవు నేతితో తడిపి వస్తులు వేసి దీపారాధన, ఉసిరిచెట్టు కింద శ్రీ మహావిష్ణువును పూజించడం, ఉసిరి వనంలో అన్నసమారాధానలు చేయడం, సాలగ్రామాలను, దీపాలను దానం చేయడం వలన అఖండ అష్టైశ్వర్య ప్రాప్తి, అనంత పుణ్యఫలం లభిస్తుంది. కార్తిక మాసంలో బంధు మిత్రులతో కలిసి ఉసిరి చెట్ల నీడలో వనభోజనాలు చేసినట్లయితే సకల పాపములు తొలగిపోయి, విష్ణులోకం పొందుతారని, కలియుగమందు ధాత్రీమాల నరుల ఎన్ని దోముములను స్పృశిస్తుందో అన్నివేల సంవత్సరములు వైకుంఠమందు వలసి లభిస్తుందని కార్తిక పురాణోక్తి.
మానవుడు తన ఆరోగ్యమును కాపాడుకొనుటకై ఉసిరికాయను ఏదో ఒక రూపములో ఉపయోగించవలసిందిగా, అది సాధ్యము కాలేనిచో కనీసం ఈ కార్తికమాసమునందైనా, తప్పక ఉసిరిని ఉపయోగించాలని ధార్మికముగా నియమము చేసినారు మన మహర్షులు. ఆయుర్వేదరీత్యా ఉసిరి వలన శరీరపు ఉష్ణమును తగ్గించి, జీర్ణశక్తిని పెంపొందింపజేసి, వీర్యవృద్ధిని కలిగించి, మంచి పుష్టిని పుట్టించును. దాహమును తీర్చే, మధుమేహ రోగులకు మంచి హితకారి. ఉసిరిక త్రిదోషహరము ‘సంజీవిని’ అని పిలువబడుతున్నది. కార్తిక మాసమునందు వాతావరణ ప్రభావము నుంచి ఉష్ణాశం తక్కువై త్రిదోషములు వికృతి పొందును. కార్తిక మాసంలో మనము బృందావనమునందు ఏర్పాటుచేసికొన్న ఉసిరిక కొమ్మ-తులసి రెమ్మల వాసనలవలన చక్కటి ఆరోగ్యము చేకూరుతుందని ఈ మాసంలో వనభోజనాలు ఏర్పాటుచేసినారు మన ప్రాచీనులు.

తులసి మొక్క ప్రాధాన్యత....!

భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసిలేని హిందువుల ఇల్లు ఉండదు. తులసి లక్ష్మీ స్వరూపం. అసలు తులసి మొక్కకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? తులసి ప్రత్యేకత ఏమిటి?
మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే, అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. మనకు అవి తెలియవి, అంతే. తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం.
మాములు మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజెన్ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్వన్-డై-ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని మన భారతీయుల పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు.
తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసి కున్న ఘాటైనవాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుకా కూడా తులసిమొక్కను పెట్టి పూజించమన్నారు, ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి.
తులసిలో విద్యుత్ఛక్తి అధికంగా ఉందని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వేదంలో కూడా వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి ప్రస్తావన ఉంది. తులసి ఏ ఇంటిలో ఉంటే, ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు. తులసిలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని మనం శరీరం గ్రహిస్తే, ఆరోగ్యం చేకూరుతుంది, అందుకోసమే తులసమ్మకు నీరు పోసి, చుట్టు ప్రదక్షిణం చేయాలి. అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా, ఆరికాళ్ళలోకి చేరి, నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది.
తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంధాలు చెప్పాయి. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడ అంగీకరించారు.
ప్రపంచాన్ని హడలుగొట్టిన స్వైన్‌ప్లూ భారత్‌లో స్వైరవిహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది. తులసి గాలి కారణంగా జనంలో స్వైన్‌ప్లూను తట్టుకునే రోగనిరోదక శక్తి పెరిగిందట. అంటే మన తులసమ్మ మనకు ఆయుషు పోసిందన్నమాట. ఏ ఇంట్లో అధికంగా తులసిమొక్కలు ఉంటాయో, ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు.
తులసిచెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. తాజ్‌మహల్ కాలుష్యం బారినపడి మసకబారకుండా ఉండడం కోసం, తాజ్‌మహల్ పక్కనే, లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు. అట్లాగే తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయి. కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కైనా పెంచాలి.
నల్గోండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తోంది. తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్ వ్యాపితిని తగ్గిస్తాయని ఏ మధ్యే దృవీకరించారు. మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే, రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఇది తులసి మహాత్యం.
తులానాం నాస్తి ఇతి తులసి అన్నారు, దేని గురించి ఎంత చెప్పుకున్నా, ఇంకా చెపుకోవలసినది మిగిలి ఉంటుందో, దాన్ని తులసి అంటారని అర్దం. తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతారు .

పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి....?
.....,................................................
పిల్లలకు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవస్తరం లో కాని తీయవలెను.
పిల్లలకు అన్నప్రాసన ఎన్నో నెలలో చేయాలి ?
.....,.................................................
ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి. 6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది.
పంచామృతం, పంచగవ్యములు అని దేనిని అంటారు ?
.................................................
ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటిని పంచామృతం అని,
ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని పంచగవ్యములు అంటారు.
ద్వారానికి అంత ప్రాముక్యం ఎందుకు ఇస్తారు?
..,....................................................
ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు. క్రింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్ర పరంగా చెప్పాలంటే గడప కు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు.
తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?
.......................................................
తొలితీర్థము శరీర శుద్ధికి,శుచికి…రెండవ తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనకు …మూడవ తీర్ధం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు.
తీర్థ మంత్రం:
.........................................
అకాల మ్రుత్యుహరణం సర్వవ్యాది నివారణం
సమస్త పాప శమనం విశ్నుపాదోధకం శుభం .
స్నానము ఎలా చేయ వలెను?
.................................................
నది లో ప్రవహమునకు ఎదురుగ పురుషులు, వాలుగ స్త్రీలు చేయవలెను.
చన్నీటి స్నానము శిరస్సు తడుపుకొని, వేడి నీటి స్నానము పాదములు తడుపుకొని ప్రారంబించ వలెను.
స్నానము చేయునపుడు దేహమును పై నుండి క్రింద కు రుద్దు కొనిన కామేచ్చ పెరుగును. అడ్డముగా రుదుకోనిన కామేచ్చ నశించును.
సముద్ర స్నానము చేయునపుడు బయట మట్టి ని లోపలి వేయవలెను. నదులలో,కాలువలు,చెరువులలో చేయునపుడు లోపల మట్టిని ముమ్మారు బయట వేయవలెను.(అవి పూడి పోకుండా ఉండటానికి)
ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితము ఉంటుంది?
.....................................................
గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. నది ప్రాంతంలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది.
గోశాలలో చేస్తే వంద రెట్లు, యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది. పుణ్య ప్రదేశాల్లో,
దేవాతా సన్నిదిలోను చేస్తే పదివేల రెట్లు వస్తుంది. శివసన్నిదిలో చేస్తే మహోన్నతమైన ఫలం వస్తుంది. పులి తోలు మీద కుర్చుని జపిస్తే మోక్షం కలుగుతుంది. అలాగే వెదురు తడక మీద కుర్చుని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది.
రాతి మీద కుర్చుని జపిస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చొని చేస్తే దుఖము, గడ్డి మీద చేస్తే కీర్తి నాశనం అవుతుంది.
పూజగది తూర్పు ముఖంలో ఉండాలని ఎందుకు అంటారు?
...................,.................................
తూర్పునకు అధిపతి ఇంద్రుడు, ఉత్తరానికి అధిపతి కుబేరుడు. అందుకే పూజగది తూర్పుముఖంగా కాని, ఉత్తరముఖం గా కాని ఉండాలని అంటారు. దక్షిణానికి అధిపతి యముడు. అందుకే దక్షిణ ముఖం గా ఉండకూడదని అంటారు.
ఏ ఏ సమయాల్లో ఏ దేవుణ్ణి పూజించాలి?
....,..................................................
సూర్య భగవానుని 4.30 నుంచి ఆరులోగా పూజించాలి. ఈ సమయంలో పూజ శ్రీ రామునికి, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతీ. ఆరు నుంచి ఏడున్నర వరకు మహాశివుడ్ని, దుర్గను పూజించిన మంచి ఫలము కలుగును. మధ్యాహ్నము పన్నెండు గంటలప్పుడు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించిన హనుమ కృపకు మరింత పాత్రులగుదురు. రాహువునకు సాయంత్రము మూడు గంటలకు పూజించిన మంచి ఫలితము కలుగుతుంది. సాయంత్రం ఆరు గంటల సమయాన అనగా సూర్యాస్తమయమున శివపూజకు దివ్యమైన వేల.రాత్రి ఆరు నుంచి తొమ్మిది వరకు లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణ కటాక్షములు ఎక్కువగా ఉంటాయి. తెల్లవారు జామున మూడు గంటలకు శ్రీమహా విష్ణువును పూజిస్తే వైకుంటవాసుడి దయ అపారంగా ప్రసరిస్తుంది.( ఇది నిబంధన మాత్రం కాదు. సమయానుకూలంగా కూడా మీ ఇష్ట దైవమును పూజించవచ్చు )
హనుమంతునకు, సువర్చాలకు వివాహం జరిగిందా?
......................................................
కొన్ని ఆలయాల్లో ఏకంగా వివాహం కూడా జరిపిస్తున్నారు. హనుమంతుడు బ్రహ్మచారి. సూర్యుని కుమార్తె పేరు సువర్చల. హనుమ సూర్యుని వద్ద విద్యాబ్యాసం చేశాడు. ఆ సమయంలో సువర్చల హనుమని ఇష్టపడింది. విషయం తెలిసిన సూర్యుడు
విద్యాభ్యాసం అనంతరం హనుమని గురుదక్షిణగా సువర్చలాను వివాహమాడమన్నాడు. హనుమ కలియుగాంతం వరకు ఆగమన్నాడు.
ఆ తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పాడు. కాబట్టి సువర్చలను హనుమ కలియుగం అంతమైన తర్వాతే వివాహం చేసుకుంటాడు. ఇచ్చిన మాట ప్రకారం, సూర్యునికిచ్చిన గురుదక్షిణ ప్రకారం.
ఈశాన్యాన దేవుణ్ణి పెట్టె వీలులేఖపోతే?
.......................................................
మారిన జీవన పరిణామాల దృష్ట్యా, ఉద్యోగ నిర్వహనలవల్ల ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది. అలాంటప్పుడు దేవుణ్ణి ఈశాన్యాన పెట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు దేవుడు పశ్చిమాన్ని చూసేలా ఏర్పాటు చేసుకోవాలి.
పిల్లలు లేని వారు సుబ్రమణ్యస్వామిని ఎందుకు పూజిస్తారు?
..............,......................................
పార్వతి,పరమేశ్వరులను దర్శించడానికిఅనేక మంది తాపసులు కైలసానికి వస్తారు.అందులో దిగంబర ఋషులు ఉండటంతో
సుబ్రమణ్యస్వామి హేళనగా నవ్వాడు. దానికి పార్వతిదేవి పుత్రుని మందలించి, మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్ణ్తిచినవి,
జాతికి జన్మస్థానాలు అని తెలియచెప్పింది. తల్లి జ్ఞాన భోధతో సుబ్రమణ్యస్వామి సర్పరూపం దాల్చాడు కొంతకాలం. జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకు తెల్సిందే. ఆ తర్వాత వాటికి అధిపతి అయాడు. అందువల్లే జీవకణాల అధిపతి అయిన సుబ్రమణ్యస్వామి ని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుంది.
మహాభారాతాన్ని వినాయకుడు ఎక్కడ వ్రాశాడు?
......................................................
వ్యాసుడు చెపుతుంటే వినాయకుడు ఘంటం ఎత్తకుండా వ్రాసింది మన భారత దేశ చివర గ్రామమైన “మాన ” లో. హిమాలయాల్లో ఉంది ఈ గ్రామం. భదిరినాత్ వెళ్ళినవారు తప్పనిసరిగా ఈ గ్రామాన్ని దర్శిస్తారు. “జయ” కావ్యమనే మహాభారతాన్ని వినాయకుడు వ్యాసును
పలుకు ప్రకారం రాస్తుంటే పక్కన ప్రవహిస్తున్న సరస్వతి నది తన పరుగుల,ఉరుకుల శబ్దాలకి అంతరాయం కలగకూడదని
మౌనం వహించి ప్రవహిస్తుంది. ఈ అధ్బుతాన్ని మీరు ఇప్పుడు కూడా చూడవచ్చు. ఆ ప్రదేశాన్ని దాటగానే మల్లి గలగలలు.
శ్రీకృష్ణుడు నెమలి పించాన్ని ఎందుకు ధరిస్తాడు?
..................,..................................
సృష్టి లో సంభోగం చెయ్యని ప్రాణి నెమలి మాత్రమే. శ్రీ కృష్ణుని పదహారువేలమంది గోపికలు. అన్నివేల మంది భామలతో శ్రీ కృష్ణుడు సరససల్లాపాలు మాత్రమే చేశాడు. అల్లరి చేసి ఆడాడు. అంతవరకే మెలిగాడు. ఆవిషయాన్ని తెలియచేయడమే శ్రీకృష్ణుడి
పైనున్న నెమలిపించం భావం. శ్రీకృష్ణుడు కొంటెవాడు మాత్రమే. అయితే శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు. వారందరితో పవిత్ర స్నేహసన్నితంగా ఉన్నానని పదపదే చెప్పడమే నెమలిని ధరించడం. నెమలి అంత పవిత్ర మయినది కనుకే మన జాతీయపక్షి అయింది.
అయిదో తనమంటే ?
................................
ముత్తయిదువ అని అర్థం. పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, మాంగల్యం. స్త్రీ ఈ అయిదు అలంకరణలతో కల కల లాడుతుండాలి. స్త్రీకి వివాహం అయిన తర్వాతే మెట్టెలు, మాంగల్యం వస్తాయి.

నిత్య జీవితంలో నిషిద్ధ కర్మలు
...................................................
కర్మాచరణలో వర్ణాశ్రమ ధర్మముల ప్రకారము ఎవరికి ఎట్టి కర్మలు విధివిహితములో అవియే సత్కర్మలు. అటుల కానివి నిషిద్ధకర్మలు. అటువంటి నిషిద్ధకర్మలు ఏంటో తెలుసుకోవడం అవసరం. నిత్య జీవితంలో ఎదురయ్యే నిషిద్ధ కర్మల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తూర్పు దిక్కున సకలదేవతలు ఉంటా.రు. దక్షిణమున పితృదేవతలు ఉంటారు పశ్చిమమున సమస్త ఋషులు ఉందురు. కనుక ఎప్పుడైనా సరే ఉత్తరం వైపునకే తుమ్మటం, ఉమ్మి వేయాలి. ఇక సుర్యాభిముఖంగా మూత్రవిసర్జన, మలవిసర్జన, ఉమ్మటం, పళ్ళు తోవటం చేయరాదు. ఇవి పంచ మహాపాతకాలలోకి వస్తాయి.
స్నానం నగ్నంగా చేయరాదు. ఒక వస్త్రం చుట్టుకుని చేయాలి. దిగంబరంగ స్నానం చేస్తే అది వరుణిడి(జలాది దేవత) పట్ల అపచారం, శరీరం పిశాచగ్రస్తం అవుతుంది. ఈ పాపకర్మకి(దిగంబరంగ స్నానం చేస్తే) ప్రాయశ్చిత్తం ఏంటంటే.. ప్రతి రోజు సువర్ణం(బంగారం) దానం చేయాలి అలా 12 ఏళ్లు చేయాలి.
సూర్య చంద్ర గ్రహణకాలంలో భోజనంచేసేవారు. నిశ్చయతాంబూలాలిచ్చక ఇతరులకు కన్యాదానం చేసేవారు. పార్ధివలింగాన్ని భక్తితో అర్చించనివాడు, విప్రుని భయపెట్టి ధనం అపహరించేవాడు. దేవతర్చనాది సత్కర్మలకు అడ్డుతగిలినవాడు. న్యాయాధీశుని లేదా నగరరక్షకుని దిక్కరించినవాడు. తులసీదళం చేబూనికూడా మాటతప్పినవాడు, దైవప్రతిమ ఎదుటప్రమాణంచేసి తప్పినవాడు.. నరకానికి వెళ్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.
మిత్రులను మోసంచేసినా, చేసిన మేలు మరచినా, తప్పుడు సాక్ష్యాలు సమర్పించినా, దేవబ్రాహ్మణ పరిహాసకులు, దైవజ్ఞుడు, వైద్యుడు అయినవారు తమకు విహితమైన ధర్మాలను ఆచరించక లోహ-రసాది విక్రయాలు చేపట్టి ప్రజలను వంచిస్తే నరకప్రాప్తి.
బ్రాహ్మణ, దేవతార్చన, శంఖద్వని, తులసి, శివారాధన లేని చోట, విష్ణు భక్తులని నిందించిన చోట, సంధ్యావందన విహీనుడు ఉన్నచోట, ఆచార వర్జితుడి ఇంట, వాచాలుడైన వాడి ఇంట, తడికాళ్ళతో, నగ్నంగా నిదురించేవాడి ఇంట, తోడపై దరువువేసే వాడిఇంట, బ్రాహ్మణ ద్వేషి, జీవ హింస చేసేవాడి ఇంట, దయాశున్యుడి ఇంట, విప్రులని నిందించే వాడి ఇంట, లక్ష్మిదేవీ క్షణకాలం కూడా నిలువదని శాస్త్రాలు చెబుతున్నాయి.
రుద్రాక్షధరించి లేదా ఏదైనా పవిత్ర వస్తువుని స్పృశించి అసత్యం చెప్పరాదు. శుభ కార్యాలకి బయలుదేరేటప్పుడు భర్త ముందు భార్య వెనుక నడవాలి. అశుభకార్యాలకి బయలుదేరేటప్పుడు భార్య ముందు భర్త వెనుక నడవాలి.
నుదురు మీద బొట్టు, ఎడం భుజం మీద వస్త్రం లేకుండా ఇతరులకు బట్టలు పెట్టకూడదు. ఎవరికైతే వస్త్రం ఉండదో వారికీ ఆయుక్షీణం. నురుగు ఉన్న నీరు పూజకి పనికిరాదు, అలానే వెంట్రుక ఉన్న నీరు కూడా. పరస్త్రీలను కామించేవారు, పరద్రవ్యాలని ఆశించేవారు, పరులకు కీడు తలపెట్టాలి అనుకునేవారు మానసిక పాపులు.
పాడ్యమి, షష్టి, అష్టమి, ఏకాదశి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య, రవి సంక్రమణలయందు, వ్రత, శ్రాద్ధ దినముల యందు శరీరమునకు తైలమును పట్టించుకూడదని విష్ణు పురాణం చెబుతోంది.
భోజనం చేసేటపుడు నిషిద్ధ కర్మలు
ఉత్తరాభిముఖంగా కూర్చుని భోజనం చేయరాదు. శ్రాద్ధకర్మ చేసే రోజు మాత్రమే ఉత్తరాభిముఖంగా కూర్చుని భోజనం చేయాలి. బొట్టు లేకుండా భోజనం చేయరాదు. భోజనంలోవెంట్రుక వస్తే ఆ భోజనం త్యజించవలెను. కనీసం నేతితో(ఆవు నెయ్యి శ్రేష్టం) అభికరించిన(శుద్ధి) తరువాత తినాలి.
నిదురించేటపుడు.. ఉత్తరం వైపు తలవుంచి నిద్రపోకూడదు. తడికాళ్ళతోకానీ, నగ్నంగా కానీ నిద్రపోకూడదు.
దేవాలయ దర్శనంలో నిషిద్ధకర్మలు
దేవాలయ ముఖ ద్వారం పాదరక్షలు వేసుకుని దాట కూడదు. దేవాలయం గడపని తొక్కరాదు. ఈ రెండు చేసిన వారికి రాబోవు జన్మలో వికలాంగులుగా జీవించే అవకాశం ఉంది. ఈశ్వరుడికి కాళ్ళుపెట్టరాదు, గుడిలో సాష్టాంగనమస్కారం చేసేటపుడు అన్ని వైపులా గమనించుకుని ఈశ్వరుడి వైపు కాళ్ళు రాకుండా చూసుకుని సాష్టాంగనమస్కారం చేయవలెను. ఒకవేళ అలా కుదరకపోతే నుంచుని నమస్కారం చేస్తే సరి పోతుంది.
పెళ్లి విషయంలో నిషిద్ధకర్మలు
ఇంటిలో ఆరోగ్యంగా ఉన్న పెద్ద కుమారుడుకి పెళ్లి చేయకుండా చిన్నవాళ్ళకి చేయరాదు, అలాచేస్తే పెళ్లికొడుకు, అతని తల్లిదండ్రులు, పెళ్లి జరిపించిన పురోహితుడు అందరూ నరకానికి వెళతారు. ఇది ఆడపిల్లలకి కూడా వర్తిస్తుంది. పెళ్లికాని అన్నగారిని పరివిత్తి అంటారు. పరివిత్తితో కూడిన యజ్ఞాదులు కూడా పాపాలే అవుతాయి. పరివిత్తికి కన్యాదానంచేయడం అపాత్రదానం అవుతుంది.
వారము - క్షారకర్మ ఫలితాలు (వారాహీసంహిత - గర్గాది మహర్షులు)
వారము ఫలితము
ఆదివారము ఒక మాసము ఆయువు తగ్గిపోతుంది
సోమవారముము ఏడు మాసములు ఆయువు వృద్ధి చెందును. పుత్రులు కోరుకునే గృహస్థులు, ఒకే ఒక పుత్రుడు గలవారు సోమవారంనాడు క్షారము చేయించుకోనగూడదు.
మంగళవారముము ఏనిమిది మాసములు ఆయువు తగ్గిపోతుంది
బుధవారముము ఐదు మాసములు ఆయువు వృద్ధి చెందును
గురువారముము పది మాసములు ఆయువు వృద్ధి చెందును. లక్ష్మిని కోరుకునేవారు గురువారమునాడు క్షారము చేయించుకోనగూడదు
శుక్రవారముము పదకొండు మాసములు ఆయువు వృద్ధి చెందును
శనివారముము ఏడు మాసములు ఆయువు తగ్గిపోతుంది
పూజా ప్రక్రియలో నిషిద్ధకర్మలు
గృహంలో దేవతా విగ్రహాలు బొటనవేలు కన్నా పెద్దగా ఉండరాదు. మంత్ర పుష్పం, సుప్రభాతం కుర్చుని చదవరాదు. ఈశ్వరుడుకి పవళింపు సేవ నిలబడి చేయరాదు. బొట్టు, విభూతి లేదా కనీసం బొట్టు అయిన లేకుండా పూజ చేయకూడదు. ఈశ్వరుడికి, గురువుకి ఒక చేతితో నమస్కారం చేయరాదు అలా చేస్తే పైజన్మలో చేతులు లేకుండా జన్మించటం కానీ, మధ్యలో చేతులు పోవటం కానీ జరుగుతాయి.
ఈశ్వరుడికి వీపు చూపరాదు. ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు. ఈశ్వరుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం. ఆ దీపారాధనతో పుల్లలు కానీ, సాంబ్రాణికడ్డికానీ, హారతికర్పూరంకానీ మరి ఏదైనా కానీ వెలిగించకూడదు. పూజ సమయమున ఈశ్వరుడు మన కంటే ఎత్తులోవుండాలి, అలానే పూజా వస్తువులు కుడి వైపు నుంచి తీసుకోవాలి. వెడం చేయి పూజా విధులలో నిషేధం. ఇక ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు.
ఈశ్వర నిర్మాల్యం కాలితో తొక్కరాదు. అలాచేస్తే ఈ జన్మలో చేసుకున్న పుణ్యంతో పాటు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం కూడా నశించును. రుద్రాక్షలు ధరించేవారు మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి, మునగ, శ్లేషాత్మక పదార్ధాలు తినకూడదు.
స్త్రీలకి నిషిద్ధకర్మలు
స్త్రీలు తులసీదళాలు తుంచ రాదు. పురుషులు మాత్రమే తుంచ వలెను. పౌర్ణమి, అమావాస్యనాడు, రవి సంక్రమణ, తైలాభ్యంగనస్నానం చేసిననాడు. త్రిసంధ్యలకాలంలో, మైలరోజులలో, రాత్రి ధరించి ఉన్న దుస్తులతోను, స్నానం చేసి శుభ్రమైన వస్త్రం ధరించకుండా, తులసిని తుంచడం మహాపాపం. అలా చేయడం అంటే సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు శిరస్సునే తుంచినట్లే.
స్త్రీలు జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగరాదు. ఇలా స్త్రీలు చేస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అశుభం. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. స్త్రీలు జుట్టు విరబోసుకుని భర్తకి కనపడరాదు. అలాకనపడితే భర్తకి గండం. బయటకి వెళుతున్నపుడు స్త్రీ జుట్టు విరబోసుకుని కనపడితే వెనక్కి ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కుని కొంచం సేపు కుర్చుని వెళ్ళాలి. స్త్రీలు తాటంకాలు (చెవి దిద్దులు) లేకుండా భర్తకి కనపడరాదు. అలాకనపడితే భర్తకి గండం.
పురుషులకి నిషిద్ధకర్మలు
ధర్మపత్ని జీవించి ఉండగా పురుషుడు పరస్త్రీ సంగమం చేయరాదు అలాచేస్తే, సంవత్సరం పాటు వెళ్ళిన ఇంటికి వెళ్ళకుండా వెళ్లి తను చేసిన తప్పు చెప్పి ఆ ఇంట్లో వాళ్ళు వేసిన భిక్షమాత్రమేస్వీకరిస్తూ జీవించాలి. పూర్తిగా శిరోముండనం చేసుకోకూడదు కనీసం శిఖ ఉంచుకోవాలి. అలా చేసుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పూర్తిగా శిరోముండనం చేసుకుంటే వైదిక క్రియలకి పనికిరాదు. ఏకాదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమా, సంక్రాంతి, వ్యతిపాతము, విష్టి, ఇత్యాదులయందు, వ్రత దినములయందు, శ్రాద్ధ దినముల యందు, మంగళ, శనివారముల యందు క్షారకర్మ పనికిరాదు.

దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు....?
............................................,..........
ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుండి, దాని ఉత్పత్తి, పెంపు, లయములకు ఎవరు కారణమవు తున్నారో..., అతనినే ‘దేవుడు’ అని అన్నారు మన ఋషులు. మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు...అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు. నిజాన్ని పరిశీలిస్తే... పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు వున్న శక్తి చాలా పరిమితం. ఉదాహరణకు...
- మన కాళ్ళు...ఈ విశ్వాన్ని మొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు.
- మన చేతులు..కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు.
- మన కళ్ళు...అతి విసృతమైన పదార్ధాన్నిగానీ.. అతి సూ‌క్ష్మమైన పదార్ధాన్నిగానీ... చూడలేవు. వాటికి అంత శక్తి లేదు.
ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన ‘అమీబా’ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనే... మనం సూక్ష్మదర్శినిని ఆశ్రయించవలసి వస్తుంది.
మరి ఈ కళ్ళతో ‘దేవుని’ చూచిన ఋషులు వున్నారుకదా..అని మీరు అడగవచ్చు.
- కళ్ళు భౌతికమైన పదార్ధాలను మాత్రమే చూడగలవు.
- మనోనేత్రం అభౌతికమైన పదార్ధాలను దర్శిస్తాయి.
‘దేవుడు’ మనోనేత్రానికి దర్శనమిస్తాడు. తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమౌతాడు. చూడడానికి, దర్శించడానికి ఉన్న తేడా అది.
మరి మనోనేత్రంతో ‘దేవుని’ దర్శించడం ఎలా? అన్నదే ఈనాటి మన ప్రశ్న.
పంచభూతాల శక్తుల సమ్మిళితమే...భూలోక జీవుల శరీర నిర్మాణం. అందుకే... ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ...,వాటికి అతీతంగా ఉండే ‘పరమాత్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు. ఆ దేవదేవుని దర్శించాలంటే...పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ, త్యజించాలి. ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు...అంటే....
- ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం...శబ్దం.
- వాయువుకు ఉన్నగుణాలు రెండు...శబ్దము, స్పర్శ.
- అగ్నికి ఉన్న గుణాలు మూడు...శబ్ద, స్పర్శ, రూపములు.
- జలముకు ఉన్న గుణాలు నాలుగు...శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.
- భూమికి ఉన్న గుణాలు ఐదు...శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.
ఈ ఐదు గుణాలూ...పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.
- జలము...‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.
- అగ్ని...‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.
- వాయువు...‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.
- ఆకాశం...‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.
కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు..., ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే..., పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా...ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే. ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే.



మానవ నిత్య జీవితంలో ఆచరించాల్సిన, ఆచరించని కర్మల గురించి తెలుసుకోవడం మంచిది....!!
వారము - క్షారకర్మ ఫలితాలు (వారాహీసంహిత - గర్గాది మహర్షులు)

వారము ఫలితము
ఆదివారము ఒక మాసము ఆయువు తగ్గిపోతుంది
సోమవారముము ఏడు మాసములు ఆయువు వృద్ధి చెందును. పుత్రులు కోరుకునే గృహస్థులు, ఒకే ఒక పుత్రుడు గలవారు సోమవారంనాడు క్షారము చేయించుకోనగూడదు.
మంగళవారముము ఏనిమిది మాసములు ఆయువు తగ్గిపోతుంది
బుధవారముము ఐదు మాసములు ఆయువు వృద్ధి చెందును
గురువారముము పది మాసములు ఆయువు వృద్ధి చెందును. లక్ష్మిని కోరుకునేవారు గురువారమునాడు క్షారము చేయించుకోనగూడదు
శుక్రవారముము పదకొండు మాసములు ఆయువు వృద్ధి చెందును
శనివారముము ఏడు మాసములు ఆయువు తగ్గిపోతుంది.
పూజా ప్రక్రియలో నిషిద్ధకర్మలు.......
గృహంలో దేవతా విగ్రహాలు బొటనవేలు కన్నా పెద్దగా ఉండరాదు. మంత్ర పుష్పం, సుప్రభాతం కుర్చుని చదవరాదు. ఈశ్వరుడుకి పవళింపు సేవ నిలబడి చేయరాదు. బొట్టు, విభూతి లేదా కనీసం బొట్టు అయిన లేకుండా పూజ చేయకూడదు. ఈశ్వరుడికి, గురువుకి ఒక చేతితో నమస్కారం చేయరాదు అలా చేస్తే పైజన్మలో చేతులు లేకుండా జన్మించటం కానీ, మధ్యలో చేతులు పోవటం కానీ జరుగుతాయి.
ఈశ్వరుడికి వీపు చూపరాదు. ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు. ఈశ్వరుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం. ఆ దీపారాధనతో పుల్లలు కానీ, సాంబ్రాణికడ్డికానీ, హారతికర్పూరంకానీ మరి ఏదైనా కానీ వెలిగించకూడదు. పూజ సమయమున ఈశ్వరుడు మన కంటే ఎత్తులోవుండాలి, అలానే పూజా వస్తువులు కుడి వైపు నుంచి తీసుకోవాలి. వెడం చేయి పూజా విధులలో నిషేధం. ఇక ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు.
ఈశ్వర నిర్మాల్యం కాలితో తొక్కరాదు. అలాచేస్తే ఈ జన్మలో చేసుకున్న పుణ్యంతో పాటు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం కూడా నశించును. రుద్రాక్షలు ధరించేవారు మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి, మునగ, శ్లేషాత్మక పదార్ధాలు తినకూడదు.
స్త్రీలకి నిషిద్ధకర్మలు....
స్త్రీలు తులసీదళాలు తుంచ రాదు.
పురుషులు మాత్రమే తుంచ వలెను. పౌర్ణమి, అమావాస్యనాడు, రవి సంక్రమణ, తైలాభ్యంగనస్నానం చేసిననాడు. త్రిసంధ్యలకాలంలో, మైలరోజులలో, రాత్రి ధరించి ఉన్న దుస్తులతోను, స్నానం చేసి శుభ్రమైన వస్త్రం ధరించకుండా, తులసిని తుంచడం మహాపాపం. అలా చేయడం అంటే సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు శిరస్సునే తుంచినట్లే.
స్త్రీలు జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగరాదు. ఇలా స్త్రీలు చేస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అశుభం. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. స్త్రీలు జుట్టు విరబోసుకుని భర్తకి కనపడరాదు. అలాకనపడితే భర్తకి గండం. బయటకి వెళుతున్నపుడు స్త్రీ జుట్టు విరబోసుకుని కనపడితే వెనక్కి ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కుని కొంచం సేపు కుర్చుని వెళ్ళాలి. స్త్రీలు తాటంకాలు (చెవి దిద్దులు) లేకుండా భర్తకి కనపడరాదు. అలాకనపడితే భర్తకి గండం.
పురుషులకి నిషిద్ధకర్మలు.....
ధర్మపత్ని జీవించి ఉండగా పురుషుడు పరస్త్రీ సంగమం చేయరాదు అలాచేస్తే, సంవత్సరం పాటు వెళ్ళిన ఇంటికి వెళ్ళకుండా వెళ్లి తను చేసిన తప్పు చెప్పి ఆ ఇంట్లో వాళ్ళు వేసిన భిక్షమాత్రమేస్వీకరిస్తూ జీవించాలి. పూర్తిగా శిరోముండనం చేసుకోకూడదు కనీసం శిఖ ఉంచుకోవాలి. అలా చేసుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పూర్తిగా శిరోముండనం చేసుకుంటే వైదిక క్రియలకి పనికిరాదు. ఏకాదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమా, సంక్రాంతి, వ్యతిపాతము, విష్టి, ఇత్యాదులయందు, వ్రత దినములయందు, శ్రాద్ధ దినముల యందు, మంగళ, శనివారముల యందు క్షారకర్మ పనికిరాదు.