Wednesday, December 25, 2024

25 Benefits of Guava Leaves


1. Rich in Antioxidants

Guava leaves are loaded with antioxidants, which help fight free radicals in the body, reducing oxidative stress and preventing cell damage.

2. Aids in Weight Loss

Drinking guava leaf tea can help suppress appetite, regulate blood sugar levels, and enhance fat-burning processes, making it a natural aid for weight management.

3. Promotes Heart Health

The leaves are known to lower LDL (bad cholesterol) while increasing HDL (good cholesterol), promoting overall heart health and reducing the risk of heart disease.

4. Improves Digestive Health

Guava leaves are effective in treating digestive issues like diarrhea, bloating, and indigestion due to their antimicrobial properties.

5. Helps Manage Diabetes

Guava leaves contain compounds that help regulate blood sugar levels, making them beneficial for people with diabetes or those at risk of developing the condition.

6. Reduces Inflammation

The anti-inflammatory properties in guava leaves can help reduce inflammation throughout the body, easing pain and discomfort from various conditions like arthritis.

7. Promotes Oral Health

Chewing guava leaves or using guava leaf extract as a mouthwash can help combat gum disease, toothaches, and bad breath.

8. Boosts Immune System

Guava leaves are packed with vitamin C and other immune-boosting compounds that help strengthen the body’s defense system.

9. Supports Liver Health

The leaves have been traditionally used to detoxify the liver and promote its optimal functioning by reducing the accumulation of toxins.

10. Fights Infections

Guava leaves possess antimicrobial properties that make them effective against bacterial infections like E. coli and Staphylococcus.

11. Reduces Acne and Skin Inflammation

Applying guava leaf extract to the skin can help reduce acne, soothe inflammation, and promote a clearer complexion due to its antibacterial properties.

12. Prevents Hair Loss

Guava leaves can strengthen hair roots and prevent hair loss when massaged into the scalp, thanks to their rich nutrient content.

13. Improves Skin Texture

Regular use of guava leaf extract or guava leaf powder can improve skin elasticity and reduce signs of aging, such as wrinkles and fine lines.

14. Eases Menstrual Pain

Drinking guava leaf tea can help reduce the intensity of menstrual cramps due to its ability to relax uterine muscles.

15. Helps Treat Respiratory Conditions

Guava leaf tea is beneficial for alleviating symptoms of bronchitis, asthma, and colds, as it helps clear mucus and opens airways.

16. Lowers Blood Pressure

The leaves contain potassium, which helps lower blood pressure by balancing electrolytes and reducing strain on the heart.

17. Relieves Stress

Consuming guava leaf tea can have a calming effect on the body, reducing stress and promoting relaxation.

18. Treats Diarrhea

Traditional medicine often uses guava leaves to treat diarrhea by reducing fluid loss and preventing further digestive issues.

19. Improves Vision

Guava leaves contain vitamin A, which promotes healthy vision and can help prevent age-related macular degeneration.

20. Aids in Wound Healing

The antibacterial and anti-inflammatory properties of guava leaves make them ideal for applying to wounds to accelerate healing.

21. Supports Weight Gain

For those looking to gain weight in a healthy way, guava leaves can help balance metabolism and improve nutrient absorption.

22. Fights Allergies

The anti-allergenic properties in guava leaves may help reduce the symptoms of allergic reactions such as itching and swelling.

23. Regulates Thyroid Function

Guava leaves are known to support healthy thyroid function, improving hormonal balance and metabolism.

24. Boosts Energy Levels

Drinking guava leaf tea can increase energy levels naturally by providing the body with essential nutrients and promoting better digestion.

25. Fights Cancer Cells

Some studies suggest that guava leaf extract may inhibit the growth of certain cancer cells, particularly in cases of breast, prostate, and colon cancers.



 శ్రీ మంత్ర పుష్పం

------------------------


ఓం… యోపాం పుష్పం వేదా పుష్పవాన్ ప్రజావాన్

పశుమాన్ భవతి చంద్రమావామపాం పుష్పం

పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి

య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (1)


అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి

యో''గ్నేరాయతనం వేదా ఆయతనవాన్ భవతి

ఆపోవా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి

య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (2)


వాయుర్వా అపామయతనం ఆయతనవాన్ భవతి

యో వాయోరాయతనం వేదా ఆయతనవాన్ భవతి

ఆపోవై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి

య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (3)


అసౌవై తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి

యోముష్యతపత ఆయతనం వేదా ఆయతనవాన్ భవతి

ఆపోవా అముష్యతపత ఆయతనం ఆయతనవాన్ భవతి

య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (4)


చంద్రమావా అపామాయతనం ఆయతనవాన్ భవతి

యః చంద్రమస ఆయతనం వేదా ఆయతనవాన్ భవతి

ఆపోవై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి

య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (5)


నక్ష్త్రత్రాణివా అపామాయతనం ఆయతనవాన్ భవతి

యో నక్ష్త్రత్రాణామాయతనం వేదా ఆయతనవాన్ భవతి

ఆపోవై నక్ష్త్తత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి

య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (6)


పర్జన్యోవాం అపామాయతనాం ఆయతనవాన్ భవతి

యః పర్జన్యస్యాయతనం వేదా ఆయతనవాన్ భవతి

ఆపోవై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి

య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (7)


సంవత్సరోవా అపామాయతనం ఆయతనవాన్ భవతి

యః సంవత్సరస్యాయతనం వేదా ఆయతనవాన్ భవతి

ఆపోవై సంవత్సరస్యాయతనం వేదా ఆయతనవాన్ భవతి

య ఏవం వేదా యో''ప్సు నావం ప్రతిష్ఠితాం వేదా ప్రత్యేవ తిష్ఠతి (8)


రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే''

నమో వయం వై'' శ్రవణాయ కుర్మహే

సమేకామాన్ కామ కామాయ మహ్యం''

కామేశ్వరో వైశ్రవణో దధాతు

కు॒బే॒రాయ॑ వైశ్రవ॒ణాయ॑ ।

మ॒హా॒రాజాయ॒ నమః॑ ॥


ఓం శాంతిః శాంతిః శాంతిః


Friday, April 22, 2022

List of High Vitamin Foods

1. Fish

Fish is a good source for 9 of 14 essential vitamins.

These include Vitamins A, B1, B2, B3, B5, B6, B12, D, and E. Among all fish Tuna and Trout provide the most vitamins but be sure to eat a wide variety of fish for a healthy diet.

2 Dark Leafy Greens

Dark Leafy Greens are a good source for 8 of 14 essential vitamins.

These include Vitamins A, B2, B3, B6, B9, C, E, K, and Beta-Carotene. While all dark leafy greens are great, extra nutrient-dense sources include spinach and kale.

3. Seeds (Sunflower Seeds)

Seeds are a good source for 6 of 14 essential vitamins.

These include Vitamins B1, B2, B3, B5, B5, B6, and E. Vitamin rich choices for seeds include sunflower and flax seeds.

4. Broccoli

Broccoli is a good source for 6 of 14 essential vitamins.

These include Vitamins A, B9, C, E, K, and Beta Carotene. Other nutritious cruciferous vegetables include brussels sprouts, cabbage, and cauliflower.

5. Pork

Pork is a good source for 6 of 14 essential vitamins.

These include Vitamins B1, B2, B3, B5, B6, and D. Good cuts of pork include pork chops (loin) and shoulder.

6. Beef and Lamb

Beef and lamb is a good source for 5 of 14 essential vitamins. These include Vitamins B2, B3, B5, B6, and B9. To reduce calories, leaner cuts of beef and lamb are recommended.

7. Mushrooms (White Button Mushrooms)

Mushrooms are a good source for 4 of 14 essential vitamins.

These include Vitamins B2, B3, B5, and D. Mushrooms are highly nutritious while being low in carbs and calories. Good choices include portobello, cremini (button), and shiitake mushrooms.

8. Nuts (Almonds)

Nuts are a good source for 4 of 14 essential vitamins.

These include Vitamins B1, B2, B6, and E. Nuts are a heart-healthy, cholesterol-lowering snack. Try not to have more than 1-2 handfuls a day. Good choices for nuts include almonds and walnuts.

9. Eggs

Eggs are a good source for 4 of 14 essential vitamins.

These include Vitamins B2, B5, B12, and D. While eggs are now considered heart healthy, they are still high in cholesterol, so try not to eat more than 2 a day.

10. Sweet Bell Peppers

Bell Peppers are a good source for 4 of 14 essential vitamins.

These include Vitamins A, and C, Beta-Carotene, and Lycopene. Bell Peppers are one of the foods highest in vitamin C. Colorful red and yellow peppers have higher amounts of beta-carotene and lycopene than green peppers.

11. Avocados

Avocados are a good source for 4 of 14 essential vitamins.

These include Vitamins B5, B6, B9, and E. Avocados are high in calories and fat, so try not to eat more than 1/2 a large avocado, or 1 small avocado, a day.

12. Green Peas

Peas are a good source for 4 of 14 essential vitamins.

These include Vitamins A, B1, E, and Beta Carotene. Green peas are also a good vegetarian source of protein.

13. Winter Squash (Butternut Squash)

Butternut Squash is a good source for 4 of 14 essential vitamins.

These include Vitamins A, B1, E, and Beta Carotene. Good choices for winter squash include butternut, acorn squash, and pumpkin.

14. Tropical Fruits (Papayas)

Tropical Fruits a good source for 4 of 14 essential vitamins.

These include Vitamins A, B1, E, and Lycopene. Fruits with red flesh, like Papayas, are the best choice for lycopene.

15. Dried Fruits (Dried Apricots)

Dried Fruits are a good source for 4 of 14 essential vitamins.

These include Vitamins A, B6, K, and Beta Carotene. Dried fruits are high in sugar, try not to eat more than 1 handful a day.

Friday, July 14, 2017

ఇలా చేస్తే రక్తంలో కొవ్వు చేరదు

వెల్లుల్లి నిమ్మరసం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాల కలవు .మనం చాలావరకు వీటిని వంటల్లో మసాలా కోసమో మంచి రుచి వచ్చేందుకో వాడుతాము కని ఈ రెండు కలిపితే శరీరానికి అనేక ప్రయోజనాల కలుగుతాయని మాత్రం చాలా మందికి తెలియదు, వీటివలన రక్తనాళాల్లో ఎక్కువగ పేరుకుపోయిన క్రొవ్వును కరిగించవచ్చు.ఫార్మా కంపెనీలు తయారు చేసె మందుల్లో వీటికి విరివిగ వాడుతారు .వీటిని వాడి రసాయనిక చర్య జరిపించి మందులు తయారు చేస్తారు ఆ మందులనే గుండె జేబులకు వాడుతారు .

ఇలా రసాయనిక చర్యతో తయారయిన మందులు వాడేకంటే సహజ సిద్ధంగా ఈ రెంటిని కలుపుకుని తాగితే రక్తనాళాలలో పేరుకుపోయింది కొలెస్ట్రాల్ ను ఈజీ గా కరిగించుకోవచ్చు దీంతో గుండెకు రక్తసరఫరా మెరుగుపడుతుంది తద్వరా హార్ట్ స్ట్రోక్ ప్రమాదం ను తగ్గించుకొని దీర్ఘాయువు పొందవచ్చు .ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు మందుల వాడుతూ ఈ మిశ్రమాన్ని త్రాగితే భవిష్యత్తులో మరింత తీవ్రమైన గుండె జబ్బుల ప్రభావం నుండి బయటపడవచ్చు .హార్ట్ ప్రాబ్లెమ్ లేని వారు తాగితే భవిష్యత్తులో ఇంకా గుండె సమస్యలు రావు .అధికబరువుతో బాధపడేవారు గుండె జబ్బులనుండి బయటపడడానికి ఈ మిశ్రమం రోజూ తీసుకొవడం మంచిదని ఆరోగ్య నిపుణుల సలహ.

ఈ మిశ్రమం తయారీకి 30 వెల్లులి రెబ్బలు ఆరు నిమ్మకాయలు తీసుకొవాలి .నిమ్మకాయలు కోసి రసం తీసుకొవాలి ,వెల్లులి పొట్టు తీసుకుని ముక్కలు ముక్కలుగా చేసుకొని ఈ రెండింటిని మిక్సీలో వేసి కొన్ని నీల్లు పొసి మిక్సి పట్టుకోవాలి .ఈ మిశ్రమానికి 2 లీటర్ల నీల్లు పోసి 5 నుంచి 10 నిమిషాలవరకు వేడి చేయాలి తరువాత దాన్ని వడపోసి ఒక గాజు సీసాలో పోసి ఫ్రిడ్జిలో భద్రపరచుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు 5ml చొప్పున పరగడుపున త్రాగాలి ఇలా మూడు వారాలు క్రమం తప్పకుండ త్రాగాలి .తిరిగి వారం రోజులు గ్యాప్ ఇవ్వాలి .తిరిగి మల్లి మూడు వారాలు తాగాలి ఇలా ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేస్తే చాలు గుండెకు రక్తాన్ని పంప్ చేసే నాళాల్లో క్రొవ్వు కరిగిపోయి ఫ్రీ అవుతాయి ఇంకా ఏ గుండె జాబులు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు

Thursday, July 13, 2017

“దిండు” కింద “వెల్లుల్లి” పెట్టుకొని పడుకుంది..!

వెల్లుల్లి… దీన్ని వాడ‌డం వ‌ల్ల క‌లిగే ఉపయోగాల గురించి ఇప్ప‌టికే ఎన్నో సార్లు చ‌దివాం. తెలుసుకున్నాం. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో ర‌కాల కీల‌క పోష‌కాలు ఇందులో ఉన్నాయి. స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ ల‌క్ష‌ణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా ఎన్నో ఉప‌యోగాలు వెల్లుల్లిని వాడ‌డం వల్ల మ‌న‌కు క‌లుగుతాయి. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా దానికి చెందిన మ‌రో ఉప‌యోగ‌మే. ఇక‌ ఇందులో విశేష‌మేమింటే వెల్లుల్లిని మీరు తినాల్సిన ప‌నిలేదు. అవును, దాన్ని తిన‌కుండానే, దాని వ‌ల్ల క‌లిగే లాభాల‌ను మీరు ఎంచ‌క్కా పొంద‌వ‌చ్చు. అదెలాగంటే…
ఒక వెల్లుల్లి రేకును తీసుకుని మీరు నిద్రించే దిండు కింద పెట్టుకోండి. అంతే చాలు. దాంతో కింద చెప్పిన ఉప‌యోగాలు క‌లుగుతాయి.

1. వెల్లుల్లి రేకును దిండు కింద పెట్టుకుని నిద్రించ‌డం వ‌ల్ల అందులో ఉండే వేడి, అరోమా గుణాలు మెద‌డులోని ప‌లు ప్రాంతాల‌ను ఉత్తేజితం చేస్తాయి. దీంతో నిద్ర‌లేమి దూర‌మ‌వుతుంది. రోజూ దిండు కింద ఓ వెల్లుల్లి రేకుని పెట్టుకుని ప‌డుకుంటే దాంతో మీకు నిద్ర బాగా వ‌స్తుంది. నిద్ర‌లేమి స‌మ‌స్య ఉండ‌దు.

2. జ‌లుబు, ద‌గ్గు వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు దిండు కింద ఓ వెల్లుల్లిని పెట్టుకుని నిద్రిస్తే చాలు. వెంట‌నే ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

3. గుండె సంబంధ వ్యాధులు దూర‌మ‌వుతాయి. ర‌క్త‌నాళాల్లో ఉన్న అడ్డంకులు తొల‌గిపోతాయి. ర‌క్తం శుభ్ర‌మ‌వుతుంది.

4. లివ‌ర్ చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. అన్ని ర‌కాల లివ‌ర్ వ్యాధులు పోతాయి.

5. వెంట్రుక‌ల‌కు పోష‌ణ స‌రిగ్గా అందుతుంది. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య తొల‌గిపోతుంది.

6. హార్మ‌న్ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. జీవ‌క్రియ‌లు స‌క్రమంగా జ‌రుగుతాయి.

రాత్రి వేడి నీళ్లలో ఈ పొడి కలుపుకుని తాగితే 3 నెలల్లో వేస్ట్ కొవ్వు మొత్తం కరిగి బరువు తగ్గిపోతారు

మీకు ఎటువంటి ఆరోగ్యసమస్యలు ఉన్నా వాటన్నిటికీ సర్వరోగ నివారిణి ఆయుర్వేదంలో ఉంటుంది .దీనిని మనమే స్వయంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు దానికి కావలసిన పదార్థాలు ఏమిటో చుద్దాం.  250 గ్రా మెంతులు, 100 గ్రా వాము, 50 గ్రా నల్ల జీలకర్ర ఈ మూడింటిని తీసుకుని వీటితో రాళ్లు, మట్టి, దుమ్ము లేకుండా శుభ్రం చేసుకోవాలి. తరువాత వోక్స్ బాన్ని తీసుకుని ఈ మూడింటికి వేరు వేరుగా వేయించుకోవాలి .ఇప్పుడు ఈ మూడింటికి కలిపి మిక్సి పట్టుకోవాలి. ఇలా చేసుకున్న పొడిని ఒక గాజు సీసాలో గాలి పోకుండా మూత గట్టిగ పెట్టి భద్రపరచుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు రాత్రి భోజనము తరువాత ఒకగ్లాస్ వేడినీళ్లల్లో ఒక స్పూన్ కలుపుకుని త్రాగాలి. ఇది తాగిన తరువాత ఎలాంటి ఆహారము తీసుకోకూడదు. రోజు కనుక ఇలా తాగితె శరీరములో పేరుకుపోయినా క్రొవ్వు కరిగి, విషపదార్థాలు మల మూత్ర చమటల రూపంలో బయటకి వెళ్ళిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా 40 నుంచి 50 రోజులు తీసుకుంటే శరీరంలొ గొప్ప మార్పులను చూడవచ్చు ఇల క్రమం తప్పకుండా మూడు నెలలు వాడితే మీ ఆరోగ్యానికి ఇక తిరుగు వుండదు. అయితే ఈ పొడి వాడిన తరువాత శరీరంలోని అదనపు కొవ్వు కరిగిపోయి రక్తం శుభ్రపడుతుంది. శరీరంలొ మంచి రక్తం ప్రవహిస్తుంది అంతేకాకుండా శరీరం యవ్వనంగా కనిపిస్తుంది. శరీరంలొ ముడుతలు పోయి బలంగా చురుగ్గా ప్రకాశవంతంగా అవుతుంది. ఇల చెయడం వలన కీళ్లు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి ఎముకలు బలంగా తయారవుతాయి. కంటిచూపు మెరుగుపడుతుంది.

మలబద్దకం ఉన్నవారు ఈ పాడిని రోజు తీసుకుంటె దానికి శాశ్వతంగా ఛెక్ పెట్టవచ్చు మోషన్ ఫ్రీగా అవుతుంది. దీర్గకాళికా దగ్గు అనేది పోతుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది.  మెదడు చూరుగ్గా పని చేస్తుంది. వినికిడి కుడా పెరుగుతుంది. రోజువారీ పనుల్లో చలాకీగా వుంటారు. గతంలో తీసుకున్న ఇంగ్లీష్ మెడిసిన్ సైడ్ ఎఫక్ట్స్ పూర్తిగా తగ్గుతాయి. పళ్లు చిగుళ్లు బలంగా తయారవుతాయి. షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. గ్యాప్ లేకుండా మూడు నెలలు ఈ చూర్ణం వాడిన వారు అద్భుత ఫలితాలకోసం మళ్ళీ వాడాలనుకుంటే 15 గ్యాప్ ఇచ్చి మళ్ళీ మూడు నెలలు వాడితే మంచి ఆరోగ్యకరమైన శరీరాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

Tuesday, June 13, 2017

రాముని వంశ వృక్షం

ఈ వంశ పరంపర విన్నా చదివినా , పుణ్యం
బ్రహ్మ కొడుకు మరీచి
మరీచి కొడుకు కాశ్యపుడు.
కాశ్యపుడు కొడుకు సూర్యుడు.
సూర్యుడు కొడుకు మనువు.
మనువు కొడుకు ఇక్ష్వాకువు.
ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.
కుక్షి కొడుకు వికుక్షి.
వికుక్షి కొడుకు బాణుడు.
బాణుడు కొడుకు అనరణ్యుడు.
అనరణ్యుడు కొడుకు పృధువు.
పృధువు కొడుకు త్రిశంఖుడు.
త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు.(లేదా యువనాశ్యుడు)
దుంధుమారుడు కొడుకు మాంధాత.
మాంధాత కొడుకు సుసంధి.
సుసంధి కొడుకు ధృవసంధి.
ధృవసంధి కొడుకు భరతుడు.
భరతుడు కొడుకు అశితుడు.
అశితుడు కొడుకు సగరుడు.
సగరుడు కొడుకు అసమంజసుడు.
అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.
అంశుమంతుడు కొడుకు దిలీపుడు.
దిలీపుడు కొడుకు భగీరధుడు.
భగీరధుడు కొడుకు కకుత్సుడు.
కకుత్సుడు కొడుకు రఘువు.
రఘువు కొడుకు ప్రవుర్ధుడు.
ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.
శంఖనుడు కొడుకు సుదర్శనుడు.
సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.
అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.
శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.
మరువు కొడుకు ప్రశిష్యకుడు.
ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.
అంబరీశుడు కొడుకు నహుషుడు.
నహుషుడు కొడుకు యయాతి.
యయాతి కొడుకు నాభాగుడు.
నాభాగుడు కొడుకు అజుడు.
అజుడు కొడుకు ధశరథుడు.
ధశరథుడు కొడుకు రాముడు.
రాముడి కొడుకులు లవ కుశలు . .
ఇది రాముడి వంశ వృక్షo ..

Thursday, November 3, 2016

చద్ది అన్న౦ గురించి ఒకసారి గుర్తు చేసుకోండి ఈసడి౦చక౦డి తెలివి తేటలు, జ్ఞాపకశక్తీ పెరుగుతాయి.

పిల్లలకు చద్ది అన్న౦ పెట్టట౦ మానేశాక ఈ తర౦ పిల్లలు బల౦గా ఎదుగుతున్నారని ఎవరైనా అనుకొ౦టూ వు౦టే వాళ్ళు పెద్ద భ్రమలో ఉన్నట్టే లెక్క. చద్దన్న౦ అనగానే ముఖ౦ అదోలా పెట్టేసేది ముఖ్య౦గా మన పెద్దావాళ్ళే. కొత్తతర౦ నాగరీకులైన తల్లిద౦డ్రులకు చద్దన్న౦ అ౦టే, కూలి నాలి చేసుకొనేవాళ్ళు తినేదనే
ఒక ఆభిజాత్య౦తో కూడిన అపనమ్మక౦ బల౦గా ఉ౦ది. తెలుగు నిఘ౦టువుల్లో కూడా చల్ది అన్న౦ అ౦టే పర్యుషితాన్న౦ (stale food) – రాత్రి మిగిల్చి ఉదయాన్నే తినే పాచిన అన్న౦ అనే అర్థమే ఇచ్చారు. ఈ అర్థ౦ రాసిన నిఘ౦టు కర్తలు కూడా ఇప్పుడు మన౦ చెప్పుకున్న నాగరీకుల కోవకు చె౦దిన వారే! రె౦డిడ్లీ సా౦బారు తిని కడుపుని౦పుకొ౦టున్నా౦ అనే భ్రమలో జీవిస్తున్నఈ తరాన్ని ఏ అన్న౦ రక్షి౦చగలదు….?
వీళ్ళకి అన్న౦ అ౦టేనే నామోషీ! పొద్దున్నపూట టిఫిన్లు, మధ్యాన్న౦ పూట పలావులూ, బిరియానీలు, రాత్రిపూట నాన్లో. పొరోటీలూ తప్ప అన్న్౦ధ్యాస లేకు౦డా జీవిస్తున్నారు. అన్న౦ తినే వాళ్ళ౦టే వీళ్ళలో చాలామ౦దికి చిన్నచూపు. తాగుబోతులకు మ౦దుకొట్టని అమాయకపు జీవుల౦టే పాసె౦జరు క్లాసు గాళ్ళని ఒక అభిప్రాయ౦ ఉన్నట్టే అన్నాన్ని ద్వేషి౦చే ఈ కొత్తతర౦ ధనిక వర్గానికి కూడా చద్దన్న౦ తినే వాళ్ళ౦టే అలా౦టి చిన్న చూపే ఉ౦ది.

గోపాల కృష్ణుని చుట్టూ పద్మంలో రేకుల లాగ కూర్చుని గోపబాలురు చద్దన్న౦ తిన్నారని పోతన గారు వర్ణి౦చాడు. ఆ చద్దన్న౦ ఎలా౦టిద౦టే, “మీఁగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద / డాపలి చేత మొనయ నునిచి./చెల రేగి కొసరి తెచ్చిన యూరుఁగాయలు / వ్రేళ్ళ సందులను దా వెలయ నిఱికి…” ఇ౦ట్లో నానా అల్లరీ చేసి తెచ్చుకున్న ఊరుగాయ ముక్కల్ని వేళ్ళతో పట్టుకొని మీగడ పెరుగు వేసి మేళవి౦చిన చల్ది ముద్దలో న౦జుకొ౦టూ తిన్నారనే అన్నారు పోతన గారు. దీన్నిబట్టి చల్ది అ౦టే పెరుగన్నమేనని స్పష్టమౌతో౦ది. ఇక్కడ చలిది అనేది ‘చల్ల’కు స౦బ౦ధి౦చినదనేగాని, పాచిపోయి౦దని కాదు. చలి బోన౦ లేక చల్ది బోన౦ అ౦టే పెరుగన్నమే!

గ్రామ దేవతలకూ, అలాగే, దసరా నవరాత్రులలో అమ్మవారికీ చద్ది నివేదన పెట్టే అలవాటు ఇప్పటికీ కొనసాగుతో౦ది. చద్ది నివేదన అ౦టే, పెరుగు అన్నాన్ని నైవేద్య౦ పెట్టట౦. ఇది శా౦తిని ఆశిస్తూ చేసే నివేదన. గ్రామ అదేవతలు ఉగ్ర దేవతలు అ౦దుకని గ్రామ దేవతలకు ఉగ్రత్వ౦ శా౦తి౦చట౦ కోస౦ చద్ది నివేదన పెడతారు. దధ్యోదన౦ అ౦టే పెరుగన్న౦లో మిరియాలు, అల్ల౦, మిర్చి వగైరా కలిపి తాలి౦పు పెట్టి తయారు చేసినది. దద్ధోజనానికీ పెరుగన్నానికీ తేడా, ఈ తాలి౦పు దట్టి౦చట౦లో ఉ౦ది.

చల్ల అనే పద౦ అత్య౦త ప్రాచీన౦ మనకి. పూర్వ ద్రావిడ పద౦ ‘సల్’, పూర్వ తెలుగు భాషలో ‘చల్ల్’ గానూ, పూర్వ దక్షిణ ద్రావిడ భాషలో ‘అల్-అయ్’ గానూ మారినట్టు ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘ౦టువులో పేర్కొన్నారు. పూర్వ ద్రావిడ ‘సల్’ లో౦చి వచ్చిన చల్ల (మజ్జిగ-Buttermilk), పూర్వద్రావిడ ‘చల్’ లొ౦చి ఏర్పడిన చల్ల (చల్లనైన-cold, cold morning ) వేర్వేరు అర్థాల్లో వాడుకలోకి వచ్చాయి. ఈ తేడాని గమని౦చాలి.

చలి ప౦దిరి, చలివ౦దిరి, చలివ౦ద్రి, చలివె౦దర, చలివే౦ద్రము, చలివే౦దల, చలివే౦ద్ర… ఈ పదాలన్ని౦టికీ త్రాగటానికి నీళ్ళు అ౦ది౦చే ప౦దిరి అనే అర్థాన్నే మన నిఘ౦టువులు ఇచ్చాయి. కానీ, మజ్జిగ ఇచ్చి దప్పిక తీర్చట౦ మన పూర్వాచార౦. ఒకప్పుడు చలివే౦ద్రాలు చల్లనిచ్చిన కే౦ద్రాలే కాబట్టి, ఆ పేరు వచ్చి ఉ౦డాలి.

“అయ్యా! మీరు చల్దివణ్న౦ తి౦చారా…?” అనే ప్రశ్న వినగానే కన్యాశుల్క౦లో బుచ్చమ్మ ఎవరికైనా గుర్తుకు వస్తు౦ది. చల్దివణ్ణ౦ అ౦టే, పెరుగన్న౦! ఇ౦ట్లో పెద్దవాళ్ళు కూడా అనుష్ఠానాలు చేసుకున్నాక ఉదయ౦ పూట ఉపాహార౦గా హాయిగా చల్ది తినేవారు. స్టీలు కంచాలు. స్టీలు క్యారేజీలు వచ్చాక చద్దన్న౦ స్థాన౦లో రె౦డిడ్లీ బక్కెట్ సా౦బారు టిఫిన్లు, కాఫీ, టీలు ఆక్రమి౦చాయి.

యోగరత్నాకర౦ అనే వైద్య గ్ర౦థ౦లో అతి వేడిగా పొగలు గక్కుతున్న అన్న౦ బలాన్ని హరిస్తు౦దనీ ఎ౦డిపోయిన అన్న౦ అజీర్తిని కలిగిస్తు౦దనీ, అతిగా ఉడికినదీ, అతిగా వేగినదీ, నల్లగా మాడినదీ అపకార౦ చేస్తాయనీ, సరిగా ఉడకనిది జీర్ణకోశానికి హాని కలిగిస్తు౦దనీ, అతి ద్రవ౦గా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకొ౦టే దగ్గు జలుబు, ఆయాస౦ వస్తాయనీ, దేహ కా౦తిని, బలాన్ని హరిస్తాయని మలబద్ధత కలిగిస్తాయనీ ఉ౦ది. వీటికి భిన్న౦గా, చల్ది అ౦టే, మజ్జిగ అన్న౦ అమీబియాసిస్(గ్రహణీ వ్యాధి), పేగుపూత, కామెర్లు, మొలలు, వాతవ్యాధు లన్ని౦టినీ తగ్గి౦చగలిగేదిగా ఉ౦టు౦దనీ, బలకర౦ అనీ. రక్తాన్ని, జీర్ణ శక్తినీ పె౦చుతు౦దనీ ఈ గ్ర౦థ౦ పేర్కొ౦టో౦ది. బియ్యాన్ని వేయి౦చి వ౦డితే, జ్వర౦తో సహా అన్ని వ్యాధుల్లోనూ పెట్టదగినదిగా ఉ౦టు౦దని కూడా అ౦దులో ఉ౦ది. ఈ చల్లన్నాన్ని మూడు రకాలుగా చేసుకోవచ్చు.

1. ఆ పూట వ౦డిన అన్న౦లో మజ్జిగ పోసుకొని తినవచ్చు.
2. రాత్రి వ౦డిన అన్నాన్ని తెల్లవార్లూ మజ్జిగలో నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు.
3. రాత్ర్రి వ౦డిన అన్నాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని అది మునిగే వరకూ పాలు పోసి, నాలుగు మజ్జిగ చుక్కలు వేస్తే, తెల్లవారేసరికి ఆ అన్న౦ మొత్త౦ తోడుకొని పెరుగులాగా అవుతు౦ది. ఈ తోడన్న౦ లేదా పెరుగన్నానికి తాలి౦పు పెట్టుకోవట౦, ఉల్లి ముక్కలు, టొమాటో, కేరట్ లా౦టివి కలుపుకోవట౦ చేయవచ్చు.
అన్న౦ కూడా పెరుగులాగా తోడుకు౦టో౦ది కాబట్టి, ఈ తోడన్న౦ తి౦టే, లాక్టో బాసిల్లై అనే ఉపయోగకారక సూక్ష్మజీవుల ప్రయోజన౦ ఎక్కువ కలుగుతు౦ది…! అయితే, మజ్జిగలో నానబెట్టినది దానికన్నా చాలా తేలికగా అరిగేదిగా ఉ౦టు౦ది. అప్పటికప్పుడు అన్న౦లో మజ్జిగ కలుపుకున్న దానికన్నా రాత్ర౦తా మజ్జిగలో నానిన అన్న౦లో సుగుణాలు ఎక్కువగా ఉ౦టాయి.
ధనియాలూ, జీలకర్ర, శొ౦ఠి ఈ మూడి౦టినీ సమాన౦గా తీసుకొని మెత్తగా ద౦చి, తగిన౦త ఉప్పు కలుపుకొని ఒక సీసాలో భద్ర పరచుకో౦డి. ఒకటి లేక రె౦డు చె౦చాల పొడిని తీసుకొని తోడన్న౦ లేదా చల్లన్న౦ న౦జుకొని తి౦టే, దోషాలు లేకు౦డా ఉ౦టాయి.

ఎదిగే పిల్లలకు ఇది గొప్ప పౌష్టికాహార౦. బక్క చిక్కి పోతున్నవారు తోడన్నాన్ని . స్థూలకాయులు చల్లలో నానిన అన్నాన్ని తినడ౦ మ౦చిది. రక్త పుష్టికి ఇ౦తకన్నా మెరుగైన ఆహార పదార్థ౦లేదు. రాత్రి బాగా ప్రొద్దుపోయిన తర్వాత తోడేసి, ప్రొద్దున్నే సాధ్యమైన౦త పె౦దరాళే తినాలి. ప్రొద్దెక్కేకొద్దీ పులిసి కొత్త సమస్యలు తెచ్చిపెడుతు౦ది.

చద్ది కథ ఇది! చద్దన్న౦ అని ఈసడి౦చక౦డి. అలా ఈసడి౦చట౦ మన అమాయకత్వానికి మాత్రమే సఒకేత౦ అని గమని౦చాలి. ఏమాత్ర౦ పోషక విలువలు లేని టిఫిన్లు పెట్టి పిల్లలను బలహీనులుగా పె౦చక౦డి. చద్ది పెట్ట౦డి. బల స౦పన్నులౌతారు, శారీరిక౦గానూ, మానసిక౦గా కూడా! తెలివి తేటలు, జ్ఞాపకశక్తీ పెరుగుతాయి.

భగవద్గీతలో ఈ శ్లోకాలు డీకోడ్ చేసుకుంటే చాలు.. మీ బిజినెస్ బిందాస్..!!

మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం ప్రతిఫలం అందుకుంటున్నాం? అందుకు ప్రతిగా ఏం చేయాలి? కన్ ఫ్యూజన్ లేకుండా భగవద్గీతను మూడు ముక్కల్లో చెప్పాలంటే- ఇంతకంటే పెద్ద సెంటెన్సులు లేవు. కొందరు అనుకున్నట్టుగా, భగవద్గీత ఎట్టిపరిస్థితుల్లో మతగ్రంథం కానే కాదు. కురుక్షేత్ర సంగ్రామంలో అందరినీ చంపడం అధర్మం అనే చింత. అందరూ చచ్చిపోతారనే బాధ. ఈ రెండింటి గురించి మథనపడే అర్జునుడికి- శ్రీకృష్ణుడు విడమరిచి చెప్పిన సారాంశమే భగవద్గీత.

బేసిగ్గా ఒక సినిమా పాట-మూడు నెలలకు పాతదైపోతుంది. ఒక కథ-ఆర్నెల్లకు పాచిపోతుంది. ఒక నవల-ఏడాది తర్వాత కనుమరుగైపోతుంది. కానీ వేల ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా నిత్య చైతన్య ప్రవాహమై, దారిమరిచిన బాటసారికి కరదీపికై, సమస్త భూమండలాన్ని దివ్యశక్తితో ముందుకు నడిపిస్తున్న ఏకైక గ్రంథం – ఇగిరిపోని గంధం- భగవద్గీత. ఇదేదో మతోద్బోధ అనుకునే వాళ్ల మైండ్ సెట్ మార్చలేం.

ఆధ్యాత్మిక ప్రవచనమైనా, వ్యాపార సూక్తులైనా, మేనేజ్మెంట్ కోర్సులైనా, వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులైనా, ఆటలో గెలవాలన్నా, పరీక్షలో పాస్ కావాలన్నా, జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్నా, ఎక్కడో చోట ఏదో సందర్భంలో గీతను కోట్ చేస్తాం. గీత గురించి చర్చిస్తాం. ఆది శంకరాచార్య దగ్గర్నుంచి స్వామీ వివేకానంద, మాక్స్ ముల్లర్ దాకా భగవద్గీత గొప్పదనాన్ని వేనోళ్లా చాటినవారే.

సపోజ్- వ్యాపారమే తీసుకుందాం. అందులో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? బిజినెస్ గురించి దిగ్గజాలంతా చెప్పిన సూత్రాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం అర్జెంటుగా గూగుల్ లో వెతకుతాం. అంతేగానీ మనకు ఇన్ బిల్ట్ ఉన్న మేథోవారసత్వాన్ని పట్టించుకోం.

ఇక్కడ సమస్య అదే. ఒక మంచిమాట తెలుసుకోడానికి టెక్నాలజీ మీద ఆధారపడతాం కానీ- వారసత్వ మూలల్లోకి ఎందుకు వెళ్లం? సార్వజనీన సత్యాలను సెర్చింజన్ లో దేవులాడుతాం కానీ- పుస్తకాల్లోంచి ఎందుకు కోట్ చేసుకోం? మనకు ఎన్నో గొప్పగొప్ప గ్రంధాలున్నాయి. (మతపరమైనవి కావొచ్చు, కాకపోవచ్చు) వాటిద్వారా నాలెడ్జ్ ఎందుకు సమపార్జించుకోం?

ఇందాక, పైన పేర్కొన్నట్టు భగవద్గీత ఉంది. అది ఒక్క మనకే కాదు. యావత్ ప్రపంచానికీ ఆ బుక్ యాక్సెస్ అవుతుంది. ఎన్నటికీ తరగని మేథో నిధి ఆ గ్రంథం. వందల శ్లోకాలు ఔపోసన పట్టాల్సిన పనిలేదు. బట్టీ పట్టి కంఠశోష తెచ్చుకోమనడం లేదు. ఒక నాలుగైదు శ్లోకాలు చాలు. అవి డీకోడ్ చేసుకుంటే బస్. వ్యాపారం మూడు పువ్వులు – ముప్పై ఆరు కాయలవుతుంది. నమ్మబుద్ది కావడం లేదు కదా. అయితే ఒక్కసారి అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మ ఫలహేతుర్భూ: మాతే సంగోఅస్త్వకర్మణి ||
అంటే, నువ్వు కర్మలు చేయడానికి మాత్రమే. ఆ కర్మఫలాలకు అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో ఎట్టిపరిస్థితుల్లో కర్మలు చేయకు. అలాగని చేయడం మానకు అని అర్ధం.

ప్రతీ ఆంట్రప్రెన్యూర్ కు ఈ శ్లోకం వర్తిస్తుంది. చేయాల్సిన పని గురించి రెండే రెండు ముక్కల్లో నిక్షిప్తమైన సార్వజనీన సత్యం ఇది. ప్రతీ వ్యాపారి ఇదే సూత్రం మీద పనిచేయాలి. ప్రతిఫలం గురించి ఆశించకుండా చేసుకుంటూ పోవడమే. ప్రాసెస్ ఎంజాయ్ చేసుకుంటూ తీరం చేరుకోవాలే తప్ప.. ఎంతసేపూ ఫైనల్ ఔట్ పుట్ మీదనే ఏకాగ్రత చేయొద్దు. అలా అని పూర్తిగా ఆశావాదం లేకుండా పనిచేయమని కాదు. ఆశ పడటం తప్పు కూడా కాదు. కానీ ఎలాంటి చర్యా లేకుండా- గాల్లో దీపం పెట్టే దేవుడా నీవే దిక్కు అంటే మాత్రం కష్టం. చేయాల్సింది చేయాలి. ఫలితం సంగతి తర్వాత. ముందు ధైర్యంగా అడుగేయాలి. అంతేకానీ అమ్మో అని భయపడి మధ్యలోనే జారుకుంటే ఎన్నటికీ గమ్యం ముద్దాడలేం.

వాసంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహీ ||
అంటే,”చిరిగిపోయిన బట్టలను పడేసి, మనం కొత్తబట్టలు ఎలా కట్టుకుంటామో, జీర్ణమైన శరీరాన్ని వదిలిన ఆత్మ కూడా- మరోకొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది” అని అర్ధం.

ఆంట్రప్రెన్యూర్లు కూడా అంతే. వెర్సటాలిటీ చూపించాలి. దేన్నయినా స్వీకరించేలా ఉండాలి. అవే సక్సెస్ రుచి చూపిస్తాయి. ముఖ్యంగా మార్పును ఎప్పటికప్పుడూ గమనించాలి. కొత్త ట్రెండ్ ఫాలో అవ్వాలి. నా ఇష్టం- నాకు ఇదే ఇష్టం అంటే- వాళ్లు అక్కడే ఉండి పోతారు. అలా కాకుండా కొత్తదాని కోసం అన్వేషించాలి. కొత్తదనాన్ని చదివేయాలి. కొత్త అవకాశాల కోసం ఎదురుచూడాలి. అదే నిజమైన ఆంట్రప్రెన్యూర్ లక్షణం. బిజినెస్ అంటేనే నిరంతర ప్రయాణం. వ్యాపారి నిరంతర పథికుడు. నాలుగు గోడల మధ్యనే ఉంటే ప్రపంచం ఏనాటికీ అర్ధం కాదు. మొండిగా ఉండొద్దు. ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలి. సంకుచిత భావాలు వదిలేయాలి. స్పాంజి నీళ్లను పీల్చుకున్నట్టు అనుభవాల్ని పాఠాలుగా మలుచుకోవాలి. అప్పుడే గమనం వేగం అందుకుంటుంది.

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమ
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్దినాశాత్‌ప్రణశ్యతి
అంటే, కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మతిమరుపు, మరుపుతో బుద్ధినాశనం, బుద్ధినాశనంతో మనిషే నాశనం.

ఇదొక యాంగర్ మేనేజ్‌మెంట్ లాంటిది. ఆంట్రప్రెన్యూర్లకు మస్టుగా ఉండాల్సిన లక్షణం. లేకుంటే చెప్పుడు మాటలు విని, వాస్తవాలతో పనిలేకుండా ఆలోచించి బుర్రపాడు చేసుకుంటారు. మైండ్ లో ఒకరకమైన కన్ ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. దాంతో సహజంగానే మతిమరుపు వస్తుంది. ఆటోమేటిగ్గా లక్ష్యం నుంచి తప్పుకుంటాం. అందరిముందు నవ్వుల పాలవుతాం. అందుకే కోపాన్ని జయించాలి. టెంపర్ ని అదుపులో ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోవద్దు.

తస్మాదసక్త స్సతతం కార్యం కర్మ సమాచార |
ఆసక్తో హ్యాచరన్ కర్మ పర మాప్నోతి పూరుష: ||
కాబట్టి, చేసే పని, దాని ఫలితము మీద అదే పనిగా ఆసక్తి ఉండొద్దు. కర్మ ప్రకారం చేసుకుంటూ పోవాలంతే అంటాడు శ్రీకృష్ణ భ‌గ‌వానుడు

వ్యాపారమూ అంతే. ఓపెన్ మైండెడ్ గా ఉండాలి. అవసరమైతే జత కలవాలి. బలం పెంచుకోవాలి. అత్యాశకు పోవద్దు. వీలైనంత క్రియేటవివ్ గా ఉండాలి. ఇన్నవేటివ్ గా ఆలోచించాలి. మార్కెట్ మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనించాలి. అంతేగానీ బైనాక్యులర్ పట్టుకుని ఎలుకను వేటాడినట్టుగా ఉండొద్దు.

ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ|
యథోల్యేనావఈతో గర్భస్తథా తేనేదమావృతమూ ||
అంటే- పొగ చేత నిప్పు, ధూళి చేత అద్దం, మావి చేత గర్భస్త పిండం కప్పబడినట్లే, కోరికల చేత జ్ఞానం కూడా కప్పబడి వుంటుంది అని అర్ధం.

ఆంట్రప్రెన్యూర్లు వెతుక్కోవాలే గానీ ఇందులో బోలెడంత నిగూఢార్ధం దాగివుంది. కప్పేసే ప్రతీదీ మనల్ని మిస్ లీడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్.. ఒకచోట మంట అంటుకుంది అనుకుందాం. వెంటనే పొగ దాన్ని కప్పేస్తుంది. ఎదురుగా వుండే అద్దం మీద ధూళి- నిప్పును, పొగను రెండింటినీ దాచేస్తుంది. అంతులేని కోరికలు నాలెడ్జ్ ని కిల్ చేస్తాయి. అంతేకదా మరి.

ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలి. విచక్షణా జ్ఞాన‌మే వ్యాపారం.

తెలుగు నెలలు వాటి విశిస్టత

తెలుగు నెలలు (తెలుగు మాసములు) :తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.
ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:

1. శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం).

2. కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).

తెలుగు నెలలు

1. చైత్రము
2. వైశాఖము
3. జ్యేష్ఠము
4. ఆషాఢము
5. శ్రావణము
6. భాద్రపదము
7. ఆశ్వయుజము
8. కార్తీకము
9. మార్గశిరము
10. పుష్యము
11. మాఘము
12. ఫాల్గుణము

ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు.

* పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల చైత్రము .
* పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల వైశాఖము.
* పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల జ్యేష్ఠము .
* పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాషాఢా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఆషాఢము.
* పౌర్ణమి రోజున శ్రవణం నక్షత్రం (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల శ్రావణము .
* పౌర్ణమి రోజున పూర్వాభాద్ర్హ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాభాద్రా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల భాద్రపదము.
* పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రం (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఆశ్వయుజము.
* పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల కార్తీకము.
* పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం (అనగా చంద్రుడు మృగశిరా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల మార్గశిరము .
* పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం (అనగా చంద్రుడు పుష్యమీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల పుష్యము.
* పౌర్ణమి రోజున మఖ నక్షత్రం (అనగా చంద్రుడు మఖా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల మాఘము.
* పౌర్ణమి రోజున ఉత్తరఫల్గుణి (ఉత్తర) నక్షత్రం (అనగా చంద్రుడు ఉత్తరఫల్గుణీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఫాల్గుణము.

పై విలువని సూచించే పద్యం

క్రీ.శ. 950 ప్రాంతానికి చెందిన రెండవ ఆర్యభట్టు గణితంలో, జ్యోతిషంలో ఆరితేరినవాడు. ఖగోళ, గణిత శాస్త్రాల మీద ఇతడు ’మహాఆర్య సిద్ధాంతం’ అనే పుస్తకం రచించాడు. ఇందులో అక్షరాలతో, పద్యాలలో సంఖ్యలని వ్యక్తం చెయ్యడానికి ఇతడు ఓ చక్కని పద్ధతి సూచించాడు. దానికి “కటపయాది” పద్ధతి అని పేరు. ఈ పద్ధతిలో ప్రతీ హల్లుకి ఒక సంఖ్య విలువ ఈ విధంగా ఇవ్వబడుతుంది.

క, ట, ప, య = 1 ; ఖ, ఠ, ఫ, ర = 2
గ, డ, బ, ల = 3; ఘ, ఢ, భ, వ = 4
జ, ణ, మ, శ = 5; చ, త, ష = 6
ఛ, థ, స = 7; జ, ద, హ = 8
ఝ, ధ = 9; ఞ్, న = 0హల్లుకి, అచ్చు ఏది చేరినా హల్లు విలువ మారదు.
ఉదాహరణకి క, కా, కి, కీ, మొదలైన వాటన్నిటి విలువ 1 మాత్రమే.

ఈ పద్ధతి ప్రకారం ’పై’ విలువ ఈ కింది సంస్కృత పద్యంలో పొందుపరచబడి ఉంది.

గోపీ భాగ్య మధువ్రాత శృఞ్గి శోదరి సంధిగ
ఖల జీవిత ఖాతావగల హాలార సంధర ||

ఈ పద్యాన్ని కృష్ణుడి పరంగాను, శివుడి పరంగాను కూడా చెప్పుకోవచ్చట. సంస్కృతం తెలిసిన వారు కొంచెం ఈ పద్యం అర్థం (అర్థాలు) చెప్పగలరు.

కటపయాది పద్ధతిలో హల్లుల విలువలని పై పద్యంలో అక్షరాలకి వర్తింపజేస్తే వచ్చే సంఖ్య…

3141592653589793 (మొదటి పాదం)
2384626433832792 (రెండవ పాదం)(ఆధునిక ’పై’ విలువ (31 దశాంశ స్థానాల వరకు) =
3.1415926535897932384626433832795
http://ja0hxv.calico.jp/pai/epivalue.html
31 వ దశాంశ స్థానం లో మాత్రమే ఆధునిక విలువకి, ఆర్యభట్టు ఇచ్చిన విలువకి మధ్య తేడా ఉందని గమనించగలరు.)

వెయ్యేళ్ల క్రితం ’పై’ విలువని అన్ని దశాంశ స్థానాల వరకు లెక్కించగలడమే ఒక అద్భుతం! దానికి తోడు ఆ విలువని రెండు అర్థాలు వచ్చే పద్యంలో నిక్షిప్తం చెయ్యడం ఇంకా విచిత్రం!

ఆ పుస్తకంలో ఇలాంటి విశేషాలు ఎన్నో ఉన్నాయట.

మూలం:
ప్రఖ్యా సత్యనారాయణ శర్మ, “గణితభారతి: పరిశోధనాత్మక గ్రంథము” గోల్డెన్ పబ్లిషర్స్, హైదరాబాద్, 1991.

(మేం చిన్నప్పుడు ’పై’ విలువని గుర్తుంచుకోవడానికి ఓ mnemonic ని వాడేవాళ్లం.
May I have a large container of coffee.
(3. 1 4 1 5 9 2 6)

కాని పై పద్యం ముందు ఈ ’పై’ వాక్యం ఆటబొమ్మలా అనిపిస్తుంది.)

Thursday, October 20, 2016

కీళ్ల నొప్పులనైనా (ఆర్థరైటీస్) త‌గ్గించే అద్భుత‌మైన ఔష‌ధం.!

మెంతులు… 
ఒక టీస్పూన్ మెంతుల‌ను తీసుకుని వాటిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఆ నీటిని తాగాలి. దీంతో ఎలాంటి ఆర్థ‌రైటిస్ నొప్పి అయినా ఇట్టే న‌యం అవుతుంది. అయితే ఈ విధానాన్ని క‌నీసం 3 నెల‌ల వ‌ర‌కు పాటించాలి. నొప్పి కొంచెం తక్కువ‌గా ఉన్న‌వారికైతే 30 నుంచి 40 రోజుల్లోనే చెప్పుకోద‌గిన ఫ‌లితం ల‌భిస్తుంది.


పారిజాత ఆకులు… 
పారిజాత మొక్క తెలుసుగా. దీని పూలు తెలుపు రంగులో ఉంటాయి. రాత్రి పూట ఈ పూలు పూస్తాయి. చాలా దూరం వ‌ర‌కు ఈ పూల సువాసన వ‌స్తుంది. దేవాల‌యాల్లో ఎక్కువ‌గా ఈ మొక్క‌లు ఉంటాయి. వీటి ఆకుల‌ను 6,7 సంఖ్య‌లో తీసుకుని మెత్త‌ని పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ఒక గ్లాస్ నీటిలో వేసి మ‌రిగించాలి. ఆ నీరు స‌గం అయ్యే వ‌ర‌కు క‌షాయం కాచుకోవాలి. అలా వ‌చ్చిన కషాయాన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే చ‌ల్ల‌గా ఉండగా తాగేయాలి.
పైన చెప్పిన పారిజాత ఆకుల క‌షాయం రుమ‌టాయిడ్‌, ఆస్టియో ఆర్థ‌రైటిస్ నొప్పుల‌కు ఎంతో అద్భుత‌మైన ఔష‌ధంగా పనిచేస్తుంది. దీన్ని నిత్యం ఏ రోజు కారోజు త‌యారుచేసుకుని తీసుకుంటే కేవ‌లం 30 నుంచి 40 రోజుల్లోనే ఎలాంటి కీళ్ల‌నొప్పులైనా దూర‌మ‌వుతాయి. ఎముక‌ల్లో అరిగిపోయిన కార్టిలేజ్ గుజ్జు తిరిగి ఉత్ప‌త్తి అవుతుంది. అయితే ఈ ఔష‌ధం డెంగీ జ్వ‌రానికి కూడా బాగానే ప‌నిచేస్తుంది. డెంగీ కార‌ణంగా వ‌చ్చే ఒళ్లు నొప్పులు త‌గ్గుముఖం ప‌ట్టాలంటే ఈ ఔష‌ధాన్ని తాగాలి.
పైన సూచించిన రెండు ప‌ద్ధ‌తుల్లో దేన్నో ఒక‌దాన్ని మాత్ర‌మే ప్ర‌య‌త్నించాలి. లేదంటే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఎప్సం సాల్ట్

స్నానానికి వేడి నీళ్లు రెడీ చేసుకున్నారా? అయితే అందులో రెండు స్పూన్ల ఎప్సం సాల్ట్ ను వేసి ఓ రెండు నిమిషాల తర్వాత స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే….ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. ఎప్సం సాల్ట్ లో అధిక మొత్తంలో ఉండే మెగ్నీషియం అణువులు.. వేడి నీళ్లలో త్వరగా కరిగిపోతాయి. ఇలా కరిగిన మెగ్నీషియం ఐయాన్స్  శరీరంలోని కొన్ని ప్రాంతాలపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఎప్సం సాల్ట్ కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల ..అలసిన మీ దేహం ఒక్కసారిగా తేలికవుతుంది. కీళ్లనొప్పులు, నరాల బెణుకులు ఉంటే ఇట్టే తగ్గిపోతాయి .చర్మంపై మృత కణాలను తొలగించి, మీ చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది.
ఉదయం సాయంత్రం గోరువెచ్చటి నీటిలో రెండు టీ-స్పూన్ల ఎప్సం సాల్ట్ ను కలుపుకొని తాగితే ఏమవుతుందంటే:
కీళ్ల నొప్పులు మటుమాయం: 
ఎముకలకు కాల్షియం, పాస్పరస్ తగిన రీతిలో అందకుంటే….అవి బలహీనంగా మారి నొప్పులకు దారి తీస్తాయి. కాల్షియం, పాస్పరస్ లు అందాలంటే ఖచ్చితంగా మెగ్నీషియం ఉండాలి. కాబట్టి ఎప్సం సాల్ట్ నుండి మెగ్నీషియాన్ని పొందిన ఎముకలు…ఇతర పదార్థాల నుండి అందే కాల్షియం, పాస్పరస్ లను వెంటనే గ్రహించి…బలంగా తయారవుతాయి. ఎముకలు బలంగా ఉంటే కీళ్ల నొప్పులకు ఆస్కారం ఉండదు. కాబట్టి ఉదయం సాయంత్రం గోరువెచ్చని నీటిలో రెండు టీ స్పూన్ల ఎప్సం సాల్ట్ ను కలిపి తాగడం వల్ల…ఆర్థరైటీస్ సమస్య ఉండదు.
మలబద్ధకం మాటే ఉండదు:
గోరువెచ్చని నీటిలో రెండు టీ స్పూన్ల ఎప్సం సాల్ట్ ను కలిపి తాగడం వల్ల..దీనిలో అధిక మొత్తంలో ఉండే మెగ్నీషియం… మల ప్రవాహంలో చుట్టూ ఉండే ప్రదేశాల నుంచి నీటిని పీల్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మలాన్ని బయటకి వెళ్లేలా చేస్తుంది.
  • అంతేకాక…గోరువెచ్చని నీటిలో కలిపిన ఎప్సం సాల్ట్ ను హ్యాండ్ వాష్ గా, టైల్స్, ఫ్లోర్ ను శుభ్రపరిచేందుకు సైతం ఉపయోగించవచ్చు.
  • ఎప్సం సాల్ట్ …..ఏ  జనరల్ స్టోర్స్ లో అయినా దొరుకుతుంది.

Wednesday, August 17, 2016

ఉదయాన్నే ఉప్పు నీరు తాగడంవలన కలిగే గొప్ప ప్రయోజనాలు

మనం ప్రతి రోజు ఉపయోగించే వాటిలో ముఖ్యమైనది ఉప్పు .ఉప్పు లేకపోతే కూరలు రుచికరంగా ఉండవు. మన శరీరానికి ఉప్పు లేకపోయినా ,అధికంగా ఉన్నా రెండు ఇబ్బందే కాని ఈ మధ్య చేసిన అధ్యయనాలు ఉప్పు నీరు తీస్కోవటం వల్ల ఉన్న లాభలు గురించి మరిన్నీ ఆశక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మనలో చాల మందికి ఉన్న ఆరోగ్య సమస్యలు సరిగ్గా నిద్ర రాకపోవటం , ఎక్కువగా బరువు ఉండటం , మధుమేహ వ్యాది ఈ  ఇబ్బందులు ఎదుర్కుంటున్న వాళ్లకు ఊరట కలిగించే విషయాలు మీరే చూడండి.
  1. రోజు ఉదయాన్నే పరగడుపున ఉప్పు నీరు తీసుకోవడం వలన మన నోటిలో ఉండే లాలాజల గ్రంది సమర్దవంతముగా పనిచేస్తుంది. దీని వలన ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది.
  2. ఉప్పు నీరు లో కాల్షియం అత్యదికంగా ఉంటుంది .కాల్షియం మన ఎముకలను దృడంగా ఉంచుతుంది.
  3. ఉప్పు నీరు లో సల్ఫర్ మరియు క్రోమియం అత్యదికంగా ఉంటుంది. దీని వలన మన చర్మానికి మంచి నిగారింపు వస్తుంది. శరీరాన్నిశుబ్రంగ ఆరోగ్యంగా ఉంచుతుంది .
  4. ఉప్పు నీరు అత్యదిక ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది . ఒత్తిడిని కలిగించే కోర్టిసోల్, అడ్రెనలైన్ హార్మోన్స్ ని నియంత్రించి చక్కని నిద్ర వచ్చేలా చేస్తుంది.
  5. ఉప్పు నీరు లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియాను, మలినాలను బయటకు పంపడంలో చాల శక్తివంతంగా పనిచేస్తుంది .
  6. పరగడుపున ఉప్పు నీరు సేవించడం వలన శరీరానికి అవసరమయ్యే  ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి . అంతే కాకుండా ఎక్కువ బరువు పెరగకుండా నియంత్రిస్తుంది.
  7. మన దినచర్యలో ప్రతి రోజు ఉప్పు నీరు తీస్కోవటం వలన ఎసిడిటీని నియంత్రిస్తుంది.
చిటికెడంత ఉప్పుతో ఎన్నో ఆరోగ్యకరమైన ఉపయోగాలు పొందవచ్చని తెలుసుకొని,దానిని అవలంబించి, నలుగురు ఆచరించేలా తెలియపరచండి.

Wednesday, June 22, 2016

Create JDK folder from Installation EXE

Steps 

  • Download JDK from Oracle
  • Download and Install 7-zip from here
  • Open installition exe using 7-Zip
  • Extract the tools.zip
  • Extract the content of tools.zip to a folder (e.g. c:\jdk).
  • Open the extracted folder in cmd prompt.
  • Execute for /r %x in (*.pack) do .\bin\unpack200 -r "%x" "%~dx%~px%~nx.jar" command
  • Set JAVA_HOME to the jdk (e.g c:\jdk) folder.
  • Add %JAVA_HOME%/bin to the PATH env variable.

Testing 

  • Run the following command to check the installation, it will print the version of JDK.


c:> javac -version
javac 1.7.0_51

Wednesday, May 25, 2016

కోరి వండేద్దాం..కొర్రలు!

కోరి వండేద్దాం..కొర్రలు!
కొర్రలు.. చిరుధాన్యాల్లో ఒక రకం.. చాలామందికి దీంతో అన్నం వండుకోవడమే తెలుసు..అయితే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వీటిని మరెన్నో రకాలుగా కూడా వండవచ్చు. పీచుతోపాటూ, యాంటీఆక్సిడెంట్లను సమృద్ధిగా అందించి.. రక్తంలో చక్కెరస్థాయుల్ని సమతూకంలో ఉంచే కొర్రలతో.. ఇంకేమేం చేసుకోవచ్చో చూద్దాం.

పులిహోర
 కావల్సినవి: కొర్రల అన్నం - పది కప్పులు, ఆవాలు - పావుచెంచా, జీలకర్ర - అరచెంచా, సెనగపప్పు - ఒకటిన్నర చెంచా, ఎండుమిర్చి - తొమ్మిది, పచ్చిమిర్చి - ఆరు, కరివేపాకు - రెండు రెబ్బలు, నూనె - అరకప్పు, పసుపు - పావుచెంచా, ఉప్పు - తగినంత, జీడిపప్పు పల్లీలు - రెండూ కలిపి పావుకప్పు, నిమ్మరసం - పావుకప్పు.
తయారీ: పొడిగా వండిన కొర్ర అన్నాన్ని ఓ పళ్లెంలోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి. అందులో ఉప్పూ, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఆవాలూ, జీలకర్రా, సెనగపప్పూ, ఎండుమిర్చీ, పల్లీలూ, జీడిపప్పు వేయించుకోవాలి. అవి వేగాక పసుపూ, కరివేపాకూ, పచ్చిమిర్చి ముక్కలూ వేయించుకుని పొయ్యి కట్టేయాలి. ఈ తాలింపు కొద్దిగా చల్లగా అయ్యాక కొర్ర అన్నంలో వేసి కలిపితే సరిపోతుంది. కొర్ర పులిహోర సిద్ధం.
టొమాటో రైస్‌
కావల్సినవి: కొర్రల అన్నం - పది కప్పులు (హోటళ్లలో సాంబారు వడ్డించే చిన్న కప్పుతో కొలుచుకోవాలి), నూనె, నెయ్యి - పావు కప్పు చొప్పున, లవంగాలు - మూడు, దాల్చినచెక్క - అంగుళం చొప్పున మూడు ముక్కలు, ఉల్లిపాయముక్కలు - ముప్పావు కప్పు, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు - రెండున్నర కప్పులు, పచ్చిమిర్చి - నాలుగు, ఉప్పు -తగినంత, అల్లంవెల్లుల్లి మిశ్రమం ముద్ద - అరచెంచా, కారం - చెంచా, నీళ్లు - రెండు కప్పులు.
తయారీ: బాణలిలో నెయ్యి, నూనె వేసి పొయ్యిమీద పెట్టాలి. అవి వేడయ్యాక లవంగాలూ, దాల్చినచెక్క ముక్కలూ వేయాలి. నిమిషం తరవాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలూ, కొంత ఉప్పూ, కారం వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయముక్కలు వేగాక అల్లంవెల్లుల్లి మిశ్రమాన్ని వేయించాలి. అందులో టొమాటో ముక్కలు వేసి మంట తగ్గిస్తే.. కాసేపటికి అవి మగ్గుతాయి.అప్పుడు నీళ్లూ, మిగిలిన ఉప్పు చేర్చి మంట తగ్గించాలి. అవి ఒక్క పొంగు వచ్చాక ముందుగా వండి పెట్టుకున్న కొర్ర అన్నం వేసి మూత పెట్టేయాలి. ఒకటిన్నర నుంచి రెండునిమిషాలయ్యాక దింపేస్తే చాలు.
కొబ్బరి పాలతో...
 కావల్సినవి: వండిన కొర్రల అన్నం - పది కప్పులు, నూనె, నెయ్యి - పావు కప్పు చొప్పున, లవంగాలు - మూడు, దాల్చినచెక్క - అంగుళం చొప్పున మూడు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు - ముప్పావు కప్పు, క్యారెట్‌ ముక్కలు - అరకప్పు, పచ్చిబఠాణీ - కప్పు, పచ్చిమిర్చి - ఐదు, ఉప్పు - తగినంత, కొబ్బరిపాలు - రెండున్నర కప్పులు, అల్లంవెల్లుల్లి ముద్ద - అర చెంచా.
తయారీ: బాణలిలో నెయ్యి, నూనె వేసి పొయ్యిమీద పెట్టాలి. అవి వేడయ్యాక లవంగాలూ, దాల్చినచెక్క ముక్కలూ వేయాలి. నిమిషం తరవాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలూ, పావుచెంచా ఉప్పూ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయముక్కలు వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద చేర్చి వేయించాలి. అందులో పచ్చిబఠాణీ, క్యారెట్‌ ముక్కలు వేసి మంట తగ్గిస్తే.. కాసేపటికి అవి మగ్గుతాయి. అప్పుడు కొబ్బరిపాలూ, మరికొంచెం ఉప్పూ వేసి మంట తగ్గించాలి. ఒక్క పొంగు వచ్చాక ముందుగా వండి పెట్టుకున్న కొర్ర అన్నం వేసి మూత పెట్టేయాలి. ఒకటిన్నర నుంచి రెండు నిమిషాలయ్యాక దింపేస్తే చాలు. అయితే మూడు నిమిషాల తరవాత మూత తీసి వడ్డించాలి.
పకోడి

కావల్సినవి: పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - కప్పు, జీలకర్ర - పావుచెంచా, అల్లంపచ్చిమిర్చి పేస్టు - పావుచెంచా, కొర్రపిండి, సెనగపిండి - అరకప్పు చొప్పున, ఉప్పు - తగినంత, నూనె - వేయించేందుకు సరిపడా.
తయారీ: ఉల్లిపాయముక్కల్లో అల్లంపచ్చిమిర్చి పేస్టు వేసి కలపాలి. తరవాత వీటిపై నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పకోడీ గట్టిగా కావాలనుకుంటే.. పావు నుంచి అరకప్పు నీళ్లు చేరిస్తేచాలు. కాస్త మెత్తగా కావాలనుకుంటే కప్పు నీళ్లు పోసుకుని పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఈ పిండిని పకోడీల్లా వేసుకుని ఎర్రగా వేగాక తీస్తే చాలు.
పాయసం

కావల్సినవి: పచ్చి కొర్రలు - రెండున్నర కప్పులు, బెల్లం - ఐదు కప్పులు, నీళ్లు - పదిహేను కప్పులు, నెయ్యి - కప్పు, జీడిపప్పు - అరకప్పు, కిస్‌మిస్‌ - పావుకప్పు, యాలకులపొడి - పావుచెంచా.
తయారీ: కొర్రల్ని అరగంటసేపు నానబెట్టుకోవాలి. తరవాత పొయ్యిమీదపెట్టి నీరుపోసి ఉడికించుకోవాలి. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు బెల్లం వేసేయాలి. పది నుంచి పన్నెండు నిమిషాలకు బెల్లం కరిగి.. పాయసం కొద్దిగా చిక్కగా అయి, రంగు మారుతుంది. అప్పుడు నాలుగు చెంచాల నెయ్యి వేయాలి. పాయసం ఇంకాస్త ఉడికి.. దగ్గరవుతున్నప్పుడు మరో పొయ్యిమీద మిగిలిన నెయ్యి కరిగించి జీడిపప్పూ, కిస్‌మిస్‌ పలుకులు వేయించుకోవాలి. తరవాత దీన్ని పాయసంలో వేసి, యాలకులపొడి చేర్చి దింపేయాలి.

Wednesday, May 18, 2016

రుద్రాక్షలను శివునిప్రతిరూపాలుగా కొలుస్తాము....!



రుద్రాక్షలు పవిత్రమైనవి,శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి.రుద్రాక్షలు ధరించడంవల్లఅనుకున్న పనులు నెరవేరతాయి.  ఎలాంటి కష్టనష్టాలు రావు.అడ్డంకులు తొలగిపోయి,సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించినదివ్యమైన కానుక రుద్రాక్ష.ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికిరుద్రాక్ష అసలైన మార్గంచూపుతుంది. రుద్రాక్షనుఋషులు భూమికీ, స్వర్గానికీ మధ్యవారధిగా భావిస్తారు. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు. అనారోగ్యసమస్యలతో జారిపోతున్నవారురుద్రాక్షలను ధరిస్తే వారిసమస్యలుమటుమాయమవుతాయి.అంతేకాదు, ఏవైనా వ్యసనాలకులోనయినవారు తమ అలవాటుమంచిది కాదని తెలిసి, అందులోంచిబయట పడలేకపోతున్నట్లయితేరుద్రాక్షమాలను ధరిస్తే చాలా
మంచి ఫలితముంటుంది. నొసటనవిభూతి, కంఠాన రుద్రాక్షమాలధరించి శివనామ జపం చేస్తున్నవ్యక్తిని దర్శించుకుంటేత్రివేణీ సంగమ స్నానం చేసినంతపుణ్యం కలుగుతుంది.రుద్రాక్షలను సర్వపాపములనూనశింపచేసే సరస్వతీ నదితోపోల్చారు మునులు. మెడ,చేతులు, చెవులకు, రుద్రాక్షలనుధరించినవారు ఏ అపజయాలులేకుండా తిరుగులేనివారిగాభాసిస్తారు. ఎవరి మెడలో రుద్రాక్ష ఉంటుందో వారుఈశ్వరానుగ్రహానికిపాత్రులవుతారని పురాణాలుచెబుతున్నాయి. రుద్రాక్షలపైఉండే ముఖాల ఆధారంగారుద్రాక్షలను ఇరవయ్యొక్కరకాలుగా విభజించారు.రుద్రాక్షలను ధరించిన వారుతప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి,
1. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు.
2. రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు.
3. కుటుంబసభ్యులు అయినప్పటికీ ఒకరి
రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు.
4. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు.
5. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు.
6. రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు.
7. స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు.

రుద్రాక్షమాల ధారణవిధి:
సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభసమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివపూజ చేయాలి. ఆ తర్వాతే రుద్రాక్షను ధరించాలి. రుద్రాక్షను ధరించిన వెంటనే ఏదో అద్భుతం జరిగిపోతుంది అని ఎదురుతెన్నులు చూస్తే ఫలితం ఉండదు. సత్వర ఫలితాన్ని ఆశించేవారు, రుద్రాక్షల పూర్తి సమాచారాన్ని సేకరించి, సిసలైన పద్ధతి ప్రకారం, గురువు సమక్షంలో ధరించి, సాధన చేయాలి.
రుద్రాక్షమాలను ధరించవలసిన తిథులు:
పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి  నాడు ఈశ్వరుని రుద్రాక్షలతో పూజించడం మహాశ్రేష్టం.
రుద్రాక్షలను ధరిస్తే సర్వదుఃఖాలు తొలగిపోతాయి. సకల సంపదలూ ఒనగూడుతాయని స్కాందపూరాణం చెబుతోంది. జావా, సమత్రా, ఇండోనేషియా, నేపాల్
మొదలైన చోట్ల, ఇండియాలో చాలా కొద్ది ప్రదేశాల్లో రుద్రాక్ష చెట్లు పెరుగుతాయి.
జన్మనక్షత్ర రీత్యా ధరించవలసిన రుద్రాక్షలు:
నక్షత్రము ధరించవలసిన రుద్రాక్ష
అశ్వని     
    నవముఖి
భరణి           షణ్ముఖి
కృత్తిక          ఏకముఖి, ద్వాదశముఖి
రోహిణి         ద్విముఖి
మృగశిర       త్రిముఖి
ఆరుద్ర          అష్టముఖి
పునర్వసు     పంచముఖి
పుష్యమి        సప్తముఖి
ఆశ్లేష            చతుర్ముఖి
మఖ            నవముఖి
పుబ్బ           షణ్ముఖి
ఉత్తర            ఏకముఖి, ద్వాదశముఖి
హస్త             ద్విముఖి
చిత్త              త్రిముఖి
స్వాతి           అష్టముఖి
విశాఖ          పంచముఖి
అనురాధ      సప్తముఖి
జ్యేష్ఠ             చతుర్ముఖి
మూల          నవముఖి
పూర్వాషాఢ   షణ్ముఖి
ఉత్తరాషాఢ    ఏకముఖి లేదా ద్వాదశముఖి
శ్రవణం          ద్విముఖి
ధనిష్ట            త్రిముఖి
శతభిషం       అష్టముఖి
పూర్వాభాద్ర   పంచముఖి
ఉత్తరాభాద్ర    సప్తముఖి
రేవతి            చతుర్ముఖి


నవనందులు

ఎవరు సదాశివ నామస్మరణ చేస్తారో అలాంటి వారి వెంటే శివుడుంటాడు. అలాంటి తన నిజమైన భక్తుల్నే శివుడు వెన్నంటి కాపాడుతాడు. ఆ స్వామి తన భక్తులకోసం వెలసిన క్షేత్రాలు మన దేశంలో అనేకం ఉన్నాయి. ఆ పరంపరలోని మరో విశిష్ఠ శైవ క్షేత్రమే నంది మండలం.
ఇది కర్నూలు జిల్లాలో ఉంది. నంద్యాల చుట్టూ నవ నందులుండడంవల్ల ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది. నంద్యాల కర్నూలు జిల్లాలో ఉన్న ఒక విశిష్టమైన పట్టణం. చారిత్రక విశేష గాథలతో ముడిపడి ఉన్న ఈ పట్టణానికి ఆ పేరు రావడానికి కూడా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కుందూ నదీ తీరాన ఉన్న ఈ పట్టణాన్ని పూర్వం నందియాల అని పిలిచేవారు.
14వ శతాబ్దంలో నందన మహారాజు ఈ మండలం చుట్టూ నవ నందులను నిర్మించడంవల్ల దీనికి నంది మండలమని పేర్కొచ్చిందని చెబుతారు. ఇదే కాలాంతరంలో నంద్యాలగా రూపాంతరం చెందింది. మంచి వాణిజ్య కేంద్రంగా ఉన్న నంద్యాల ప్రముఖ శైవ క్షేత్రంగా కూడా పేర్గాంచింది. మండలంలో ఉన్న నవ నందులలో మూడు నందులు ఇక్కడే ఉండడం విశేషం.
ప్రథమ నంది:- నవ నందులలో ప్రథమమైన ప్రథమ నందీశ్వరాలయం ఇక్కడే ఈ పట్టణంలోనే ఉంది. నంద్యాల పట్టణంలో శ్యామ్ కాల్వ గట్టున ఈ ఆలయం అలరారుతోంది. విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ప్రథమ నందీశ్వరాలయం అనంతర కాలంలో ఆదరణ లేక జీర్ణావస్థకు చేరుకుంది. అయితే ఇటీవల కాలంలో భక్తులు, వధాన్యుల సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలు ఈ ఆలయం సొంతం.
విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ దివ్యాలయానికి చేరుకోగానే అక్కడి ప్రశాంత వాతావరణం మైమరపిస్తుంది. గర్భాలయంలో ప్రథమ నందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న కేదారేశ్వర లింగం భక్తులకు దర్శనమిస్తుంది. తేజో విరాజమానమవుతున్న కేదారేశ్వర లింగ దర్శనం, కేదారనాథ్‌లో కేదారేశ్వర లింగ దర్శన ఫలాన్నిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడే మరోపక్క కేదారేశ్వరి మాత కొలువుతీరి ఉంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం.
నాగనంది:- నంద్యాల పట్టణంలో ఆర్టీసీ బస్టాండుకు సమీపంలోఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు కొలువుదీరాడు. కోదండ రామాలయంగా ఖ్యాతికెక్కిన ఈ ఆలయం కూడా అతి పురాతనమైనదే.ఈ ఆలయం కొన్ని ఆలయాల కూడికగా కానవస్తుంది. ఈ మందిరంలో భారీ ఆకారంలో ఉన్న ఆంజనేయస్వామి మూర్తి చూపరులను విపరీతంగా ఆకర్షిస్తుంది. విశాల శిల్ప మూర్తిగా ఉన్న ఈ ఆంజనేయస్వామి దర్శనం సర్వ మంగళకరం. ఆంజనేయస్వామి గర్భాలయానికి సమీపంలో ఉన్న చిన్న మండపంలో నాగ నందీశ్వరుడు కొలువుదీరాడు. నవ నందులలో నాగ నందీశ్వరుడు రెండవ వాడు.
సోమనంది:- నంద్యాల పట్టణంలోనే ఆత్మకూరు బస్టాండుకు సమీపంలో ఉన్న మరో ఆలయం శ్రీ సోమ నందీశ్వరాలయం. చంద్రుడు ఇక్కడ మహేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించడంవల్ల ఈ లింగానికి సోమ నందీశ్వర లింగమనే పేరొచ్చింది. ఈ ఆలయం ప్రాంగణం చిన్నదే అయినప్పటికీ ప్రాశస్త్యం రీత్యా ఇక్కడ స్వామివారి మహిమ గొప్పది. గర్భాలయంలో సోమ నందీశ్వరుడు దర్శనమిస్తాడు.
శివనంది:- నంద్యాలకు సుమారు 15 కిలోమీటర్లు దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే శివనందీశ్వరాలయం. శివనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రం నవ నందులలో విశేషమైన నందిగా ఖ్యాతి గాంచింది. ఈ ఆలయం బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామంలో ఉంది. అతి పురాతన ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి నంద్యాల వరకు బస్సు లేదా రైలులో చేరుకోవాలి. అనంతరం అక్కడనుంచి ఏదైనా వాహనంలో గాని, బస్సులో గాని ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి దృశ్యాలు ఆభరణాలుగా అలరారుతున్న ఈ ఆలయ శోభ అనన్య సామాన్యం... విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలోనో కట్టడాలన్నీ చాళుక్యుల కాలం నాటివిగా ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది.
14వ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ శివనందిని ప్రతిష్టించినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరం విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆలయం అనంతర కాలంలో ఆదరణ లేక జీర్ణావస్థకు చేరుకుంది. అయితే ఇటీవల కాలంలో భక్తులు, వధాన్యుల సహకారంతో ఈ ఆలయాన్ని పనర్నిర్మించారు. గర్భాలయంలో శివనందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న మహాదేవ లింగం భక్తులకు దర్శనమిస్తుంది.
తేజో విరాజమానమవుతున్న పరమేశ్వర లింగ దర్శనం, అమోఘమైన పుణ్యఫలాన్నిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ముఖ మండపంలో మరోపక్క పార్వతి మాత కొలువుదీరి ఉంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వ మంగళకరం. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో వైపు భాగంలో వీరభద్రస్వామి కూడా కొలువుదీరాడు. విష్ణునంది లేక కృష్ణ నంది, శివనందీశ్వరస్వామి ఆలయానికి మూడు కిలోమీటర్లు దూరంలో తెలుగు గంగ కాల్వకు సమీపంలో విష్ణు నందీశ్వరుడు కొలువుదీరాడు. దట్టమైన నల్లమల అడవుల మధ్యలో ఉన్న ఈ ఆలయ శోభ వర్ణనాతీతం..
ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు ఇక్కడి ప్రకృతి అందాలకు మైమరచిపోతారు. చుట్టూ పరచుకున్న నల్లమల అడవీ ప్రాంతం, ఇంకో పక్క కొండలు, గుట్టలు ఈ క్షేత్రానికి వచ్చిన భక్తుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విష్ణునంది లేక కృష్ణనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు విష్ణుమూర్తి ఇక్కడ భవ్య లింగాన్ని ప్రతిష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా చెబుతున్నాయ. ఆ కారణంగానే ఈ నందికి విష్ణునంది అనే పేరొచ్చింది. గర్భాలయంలో విష్ణునందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. లింగ రూపంలో ఉన్న విష్ణు నీదంశ్వరుడి దర్శనం పూర్వజన్మల పుణ్య ఫలంగా భక్తులు భావిస్తారు. ఓ ప్రత్యేకమైన లోకాలకు తోడ్కొనిపోయే ఈ దివ్యాలయం చుట్టూ పురాతన కాలంనాటి కోనేరు, నవగ్రహాలు, వినాయక, విష్ణు, లక్ష్మి మందిరాలున్నాయి. ఆలయానికి సమీపంలో సెలయేరు నిత్యం పారుతూ ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ సెలయేటిలోనే భక్తితో స్నానాలు చేసి విష్ణునందీశ్వరుడ్ని దర్శించుకుంటారు.
సూర్యనంది:- నంద్యాలకు సుమారు 8 కిలోమీటర్లు దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే సూర్య నందీశ్వరాలయం. సూర్యనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రం నవనందులలో విశేషమైన నందిగా ఖ్యాతిగాంచింది. సూర్యుడు ఇక్కడ శివుడి గురించి తపస్సు చేసి ఆ స్వామి లింగాన్ని ప్రతిష్టించాడు. ఆ కారణంగా ఇది సూర్యనంది అయ్యింది. పూర్వకాలం నాటి ఆనవాళ్ళతో అలరారుతున్న ఈ ఆలయాన్ని అనంతరం భక్తులు, వధాన్యుల సహకారంతో నిర్మించారు. ఈ ఆలయం యు.బొల్లవరం గ్రామానికి సమీపంలో తమ్మడపల్లె గ్రామంలో ఉంది.
అతి పురాతన ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి నంద్యాల వరకు బస్సు లేదా రైలులో చేరుకోవాలి. అనంతరం నంద్యాలనుంచి మహానంది మార్గంలో ఏడు కిలోమీటర్లు ప్రయాణించి యు.బొల్లవరం గ్రామానికి చేరుకోవాలి. అక్కడనుంచి కుడి చేతివైపుగా కిలోమీటరు దూరం ప్రయాణిస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. తమ్మడపల్లె ఓ చిన్ని గ్రామం. ఇక్కడ ఉన్న సూర్య నందీశ్వరాలయంవల్ల ఈ గ్రామ ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ సూర్యనంది ఆలయాన్ని కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో సూర్య నందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న ఆలయంలో మరో పక్క పార్వతి మాత కొలువుదీరి ఉంది.
గరుడ నంది:- సూర్య నందీశ్వరస్వామి ఆలయానికి సుమారు పది కిలోమీటర్లు దూరంలో మహానంది దివ్య క్షేత్ర నడిబొడ్డున గరుడ నందీశ్వరుడు కొలువుదీరాడు. మహానంది క్షేతానికి ప్రారంభంలో ఉన్న ఈ గరుడ నందీశ్వరాలయం అతి పురాతనమైనది. ఆ కారణంగా ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో దీనిని తిరిగి పునరుద్ధరిస్తున్నారు. గరుడ నందిగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు గరుత్మంతుడు ఇక్కడ మహాదేవుని గురించి తపస్సు చేసి ఇక్కడో భవ్య లింగాన్ని ప్రతిష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగానే ఈ నందికి గరుడ నంది అనే పేరొచ్చింది. గర్భాలయంలో గరుడ నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.
వినాయక నంది:- మహానందిలో ఉన్న మరో విశిష్ట నంది వినాయక నంది. మహానందీశ్వరస్వామి వారి ఆలయానికి ఈశాన్య దిశలో ఉన్న ఈ దివ్యాలయం లో పరమేశ్వర లింగాన్ని సాక్షాత్తు వినాయకుడు ప్రతిష్టించడానికి ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యాలయంలో వినాయక నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. నాగ ఫణాఫణి ఛత్రంగా ఇక్కడ స్వామివారు అలరారుతున్నారు. వినాయక నందీశ్వరస్వామి వారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం.
మహానంది:- నవ నందులలో విశేషమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్న క్షేత్రం మహానంది. ఇది కర్నూలు జిల్లాలో నంద్యాలకు 14 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఆహ్లాదకరమైన యాత్రా స్థలం. గుడి చుట్టు ప్రవహించే నీటి బుగ్గల చల్లదనం, చుట్టు అల్లుకున్న నల్లమల అరణ్యపు ప్రకృతి సౌందర్యం, అన్ని కాలాల్లోను భక్తులను ఆకర్షిస్తూనే ఉంటుంది. పూర్వం శాలంకాయనుడు రాళ్ళను తింటూ అతి విచిత్రమైన తపస్సు చేసి శంకరుని మెప్పించి శిలాదునిగా పిలువబడుతూ, శివభక్తుడై, జీవించసాగాడు. అతడొక రోజున పొలాన్ని దున్నుకుంటుంటే, ఓ బాలుడు దొరికాడు. వృషభ రూపంలోనున్న ధర్ముడే ఇలా పుట్టాడని, అతనికి ‘‘నంది’’ అని పేరు పెట్టి పెంచాడు. అతడు పరమశివుని దర్శనం కోరి ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శంకరుడు నందిని వరం కోరుకొమ్మన్నాడు.
సదాశివ ధ్యానమే తనకు కలుగునట్లు వరం కోరుకున్నాడు నంది. శివుడు అనుగ్రహించి అతనిని పుత్రుడుగా స్వీకరించాడు. ఎన్నో సిద్ధులను ప్రసాదించి తనంతటి వాణ్ణి చేసి, వాహనంగా తన చెంతనే ఉండమన్నాడు. ‘‘సుయశ’’ అనే కాంతనిచ్చి వివాహం చేశాడు. తన ద్వారపాలకునిగా నియమించుకున్నాడు. ఈ విధంగా నందిని శంకరుడు అనుగ్రహించిన ప్రదేశమే మహానంది క్షేత్రం. ఇక్కడ ఉన్న ఈశ్వరుని నంది ప్రతిష్టించాడని, అందువల్లనే ఇది నందీశ్వరాలయమైందని స్థల పురాణం. ఈ క్షేత్రంలో వెలసిన మహానందీశ్వర స్వామి లింగం స్వయంభూలింగంగా ఖ్యాతికెక్కింది.
గర్భాలయంలో ఉన్న శివలింగంపై భాగాన ఆవు పాదం ముద్రలు కనిపిస్తాయి. శ్రీ మహానందీశ్వర స్వామి రజత కవచాలంకృతుడై నయన మనోహరంగా దర్శనమిస్తారు. పార్వతీదేవి కామేశ్వరిగా కొలువులందుకుంటోంది. కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవ నందుల దర్శనంవల్ల జన్మ జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. నవ నందుల దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం...