మెంతులు…
ఒక టీస్పూన్ మెంతులను తీసుకుని వాటిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగాలి. దీంతో ఎలాంటి ఆర్థరైటిస్ నొప్పి అయినా ఇట్టే నయం అవుతుంది. అయితే ఈ విధానాన్ని కనీసం 3 నెలల వరకు పాటించాలి. నొప్పి కొంచెం తక్కువగా ఉన్నవారికైతే 30 నుంచి 40 రోజుల్లోనే చెప్పుకోదగిన ఫలితం లభిస్తుంది.

పారిజాత ఆకులు…
పారిజాత మొక్క తెలుసుగా. దీని పూలు తెలుపు రంగులో ఉంటాయి. రాత్రి పూట ఈ పూలు పూస్తాయి. చాలా దూరం వరకు ఈ పూల సువాసన వస్తుంది. దేవాలయాల్లో ఎక్కువగా ఈ మొక్కలు ఉంటాయి. వీటి ఆకులను 6,7 సంఖ్యలో తీసుకుని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించాలి. ఆ నీరు సగం అయ్యే వరకు కషాయం కాచుకోవాలి. అలా వచ్చిన కషాయాన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే చల్లగా ఉండగా తాగేయాలి.

పైన చెప్పిన పారిజాత ఆకుల కషాయం రుమటాయిడ్, ఆస్టియో ఆర్థరైటిస్ నొప్పులకు ఎంతో అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. దీన్ని నిత్యం ఏ రోజు కారోజు తయారుచేసుకుని తీసుకుంటే కేవలం 30 నుంచి 40 రోజుల్లోనే ఎలాంటి కీళ్లనొప్పులైనా దూరమవుతాయి. ఎముకల్లో అరిగిపోయిన కార్టిలేజ్ గుజ్జు తిరిగి ఉత్పత్తి అవుతుంది. అయితే ఈ ఔషధం డెంగీ జ్వరానికి కూడా బాగానే పనిచేస్తుంది. డెంగీ కారణంగా వచ్చే ఒళ్లు నొప్పులు తగ్గుముఖం పట్టాలంటే ఈ ఔషధాన్ని తాగాలి.
పైన సూచించిన రెండు పద్ధతుల్లో దేన్నో ఒకదాన్ని మాత్రమే ప్రయత్నించాలి. లేదంటే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.