మనం ప్రతి రోజు ఉపయోగించే వాటిలో ముఖ్యమైనది ఉప్పు .ఉప్పు లేకపోతే కూరలు రుచికరంగా ఉండవు. మన శరీరానికి ఉప్పు లేకపోయినా ,అధికంగా ఉన్నా రెండు ఇబ్బందే కాని ఈ మధ్య చేసిన అధ్యయనాలు ఉప్పు నీరు తీస్కోవటం వల్ల ఉన్న లాభలు గురించి మరిన్నీ ఆశక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మనలో చాల మందికి ఉన్న ఆరోగ్య సమస్యలు సరిగ్గా నిద్ర రాకపోవటం , ఎక్కువగా బరువు ఉండటం , మధుమేహ వ్యాది ఈ ఇబ్బందులు ఎదుర్కుంటున్న వాళ్లకు ఊరట కలిగించే విషయాలు మీరే చూడండి.
- రోజు ఉదయాన్నే పరగడుపున ఉప్పు నీరు తీసుకోవడం వలన మన నోటిలో ఉండే లాలాజల గ్రంది సమర్దవంతముగా పనిచేస్తుంది. దీని వలన ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది.
- ఉప్పు నీరు లో కాల్షియం అత్యదికంగా ఉంటుంది .కాల్షియం మన ఎముకలను దృడంగా ఉంచుతుంది.
- ఉప్పు నీరు లో సల్ఫర్ మరియు క్రోమియం అత్యదికంగా ఉంటుంది. దీని వలన మన చర్మానికి మంచి నిగారింపు వస్తుంది. శరీరాన్నిశుబ్రంగ ఆరోగ్యంగా ఉంచుతుంది .
- ఉప్పు నీరు అత్యదిక ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది . ఒత్తిడిని కలిగించే కోర్టిసోల్, అడ్రెనలైన్ హార్మోన్స్ ని నియంత్రించి చక్కని నిద్ర వచ్చేలా చేస్తుంది.
- ఉప్పు నీరు లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియాను, మలినాలను బయటకు పంపడంలో చాల శక్తివంతంగా పనిచేస్తుంది .
- పరగడుపున ఉప్పు నీరు సేవించడం వలన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి . అంతే కాకుండా ఎక్కువ బరువు పెరగకుండా నియంత్రిస్తుంది.
- మన దినచర్యలో ప్రతి రోజు ఉప్పు నీరు తీస్కోవటం వలన ఎసిడిటీని నియంత్రిస్తుంది.
చిటికెడంత ఉప్పుతో ఎన్నో ఆరోగ్యకరమైన ఉపయోగాలు పొందవచ్చని తెలుసుకొని,దానిని అవలంబించి, నలుగురు ఆచరించేలా తెలియపరచండి.
No comments:
Post a Comment