Wednesday, May 18, 2016

సరస్వతీ - యంత్రం

మేథా శక్తికి బుద్ధి కుశలతకు పరీక్ష జయమునకు పిల్లలు, పెద్దలు పూజించే అమ్మవారు సరస్వతి దేవి. సరస్వతీదేవి తెల్లని వస్త్రాలు సాత్వికతను సూచిస్తాయి. విద్యాభ్యాసం చక్కగా సాగాలంటే ఆహారంలో, ప్రవర్తనలో, మొత్తం జీవితంలో సాత్వికత ఉండాలి. సత్వగుణమే ప్రధానమని సూచిస్తున్నది అమ్మ వస్త్రధారణ. సరస్వతి దేవి ఒక చేతిలో జపమాలను, మరొక చేతిలో వేదాలను ధరించి కనిపిస్తుంది. వేదం అనంతమైన జ్ఞానానికి సంకేతం. వేదం నశించనిది. ఎప్పటికీ నిలిచే ఉంటుంది. జపమాల జపానికి సంకేతం. జపమాలతో సరస్వతి దేవి నిరంతరం జపిస్తూ ఉంటుంది.
చదువు రావాలి, జ్ఞానం పొందాలంటే నేర్చుకున్న విషయాన్ని పలుమార్లు మననం చేసుకోవాలి. మనసులో ధారణ చేసుకోవాలి. అప్పుడే మనకు సారం అర్ధమవుతుంది. సరస్వతి దేవి ఒక చేతిలో జపమాలను, మరొక చేతిలో వేదాలను ధరించి కనిపిస్తుంది. మిగతా దేవీదేవతలందరూ పువ్వుల్లో కూర్చుంటే చదువుల తల్లి సరస్వతి మాత్రం రాయి మీద కూర్చోని ఉంటుంది. ఏ పువ్వైనా కొంత సమయం మాత్రమే వికసించి ఉంటుంది. కాని రాయి మాత్రం పదిలంగా నిలిచి ఉంటుంది. ఈ లోకంలో విద్య, జ్ఞానం మాత్రమే శాశ్వతమైనవి, సంపదలు కొంతకాలం మాత్రమే ఉంటాయి అని చదువులమ్మ సందేశం ఇస్తూ ఎప్పటికీ తరిగిపోని విద్యనే అనుగ్రహిస్తానంటోంది.
సరస్వతీ యంత్రం
మేరుతంత్ర గ్రంధమును అనుసరించి ౭(7) విధములైన సరస్వతీ యంత్రములు ఉన్నాయి. ౧. చింతమణి సరస్వతి, ౨. జ్ఞాన సరస్వతి, ౩. నీల సరస్వతి, ౪. ఘట సరస్వతి, ౫. కిణి సరస్వతి, ౬. అంతరిక్ష సరస్వతి, ౭.మహా సరస్వతి.. అను రూపములను పొంది ఉన్నది.
మూల మంత్రం: ఓం హ్రీం హ్ర్సైం హ్రీం ఓం ఐం ధీం క్లీం సౌః సరస్వత్య్తే స్వాహా
ఈ యంత్ర ప్రయోజనముల విషయానికి వస్తే.. మేథా శక్తి బుద్ధి కుశలత , పరీక్షలయందు విజయము సాధించగలరు. శ్రీమహసరస్వతీ యంత్రంను అర్చించు వారు యంత్రమును రాగి రేకుపై గాని కాగితముపై గాని రాసి పటం కట్టించి యథా శక్తిగా ఉదయాస్తమయములందు షోడశోపచార పూజలు చేస్తే.. మేథా శక్తి బుద్ధి కుశలత, పరీక్షలయందు విజయము కలుగును.
శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య, ప్రాణామాయ, గోత్ర దేశ కాల మాన సంకీర్తణాధికముగా త్రిన్యాస పూర్వకముగా , పంచ పూజలొనర్చిన విశేష ఫలము కలుగును. మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్ గాయిత్రిని కూడా జపదశాంశము గావించిన మహోత్కృష్ట ఫలితములు తప్పక కలుగును.
ధ్యానము, మూల మంత్రము, ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు సాధకుడు పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి మంత్ర యంత్రములు పని సాధనలందు అనంత ఫల సాధకములగును.

No comments:

Post a Comment