Tuesday, May 17, 2016

Lord Shiva



ఓంకార రహితమైన ‘నమఃశివాయ’ అనేది ‘పంచాక్షరీ’ మంత్రమనీ, ఓంకార సహితమైన ‘ఓంనమఃశివాయ’ అనేది ‘షడక్షరీ’ మంత్రమని చెప్పబడింది.
“ఓం నమః శివాయ” షడక్షరీమహామంత్రంలోని
‘ఓం’ – పరబ్రహ్మస్వరూపాన్ని,
‘న’ – పృథ్విని, బ్రహ్మను,
‘మ’ – జలాన్ని, విష్ణువును,
‘శి’ – తేజస్సును, మహేశ్వరుని,
‘వా’ – వాయువును, జీవుని (ఆత్మ),
‘య’ – ఆకాశాన్ని, పరమాత్మను…
ఈ విధంగా షడక్షరీమంత్రంలో మంత్రాక్షరాలు పంచభూతాలను, బ్రహ్మాదిదేవతలను సూచిస్తున్నాయి.
ఇక, ‘నమఃశివాయ’ అనే పంచాక్షరీమంత్రంలో,
‘నమః’ అను పదానికి జీవాత్మ అనీ,
‘శివా’ అనే పదానికి పరమాత్మ అనీ,
‘ఆయ’ అను పదానికి ఐక్యం అని
అర్థమవడం వలన జీవాత్మ పరమాత్మలో ఐక్యం చెందటం అని అర్థం. ఈవిధంగా పంచాక్షరీమహామంత్రం బ్రహ్మస్వరూపాన్ని తెలుపుతోంది.




లింగాష్టకం యొక్క అర్థం మీకు తెలుసా?
.......................................................
బ్రహ్మ మురారి సురార్చిత లింగం
బ్రహ్మ , విష్ణు , దేవతల చేత పూజింపబడ్డ లింగం
నిర్మల భాషిత శోభిత లింగం
నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డలింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
జన్మ వల్ల పుట్టినబాధలను నాశనం చేసే లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం
ఓ సదా శివ లింగం నీకు నమస్కారం !
దేవముని ప్రవరార్చిత లింగం
దేవమునులు , మహా ఋషులు పూజింపలింగం
కామదహన కరుణాకర లింగం
మన్మధుడిని దహనం చేసిన , అపారమైనకరుణను చూపే చేతులు గల
శివలింగం
రావణ దర్ప వినాశక లింగం
రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివ లింగం
తత్ ప్రణమామి సద శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివలింగమా ..!
సర్వ సుగంధ సులేపిత లింగం
అన్ని మంచి గంధాలు , మంచి గా పూసినశివ లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం
మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైనశివ లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం
సిద్ధులు , దేవతలు , రాక్షసుల చేతకీర్తింపబడ్డ శివ లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివలింగమా ..!
కనక మహామణి భూషిత లింగం
బంగారు , మహా మణుల చేతఅలంకరింప బడ్డ శివ లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగం
నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డశివ లింగం
దక్ష సుయజ్ఞ వినాశక లింగం
దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్నినాశనం చేసిన శివ లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివలింగమా ..!
కుంకుమ చందన లేపిత లింగం
కుంకుమ , గంధము పూయబడ్డ శివలింగం
పంకజ హార సుశోభిత లింగం
కలువల దండ చేత చక్కగాఅలంకరింప బడ్డ శివ లింగం
సంచిత పాప వినాశక లింగం
సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివలింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివలింగమా ..!
దేవగణార్చిత సేవిత లింగం
దేవ గణాల చేత పూజింప బడ్డ , సేవించబడ్డ శివ లింగం
భావైర్ భక్తీ భిరేవచ లింగం
చక్కటి భావం తో కూడిన భక్తీ చేతపూజింప బడ్డ శివ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం
కోటి సూర్యుల కాంతితో వెలిగే మరోసూర్య బింబం లాంటి శివ లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివలింగమా ..!
అష్ట దలోపరి వేష్టిత లింగం
ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండేశివ లింగం
సర్వ సముద్భవ కారణ లింగం
అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైనశివ లింగం
అష్ట దరిద్ర వినాశక లింగం
ఎనిమిది రకాల దరిద్రాలను (అష్టదరిద్రాలు) నాశనం చేసే శివ లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివలింగమా ..!
సురగురు సురవర పూజిత లింగం
దేవ గురువు (బృహస్పతి), దేవతలచేత పూజింప బడ్డ శివ లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
దేవతల తోటల్లో పూచేపువ్వులు (పారిజాతాలు) చేతఎప్పుడూ పూజింప బడే శివ లింగం
పరమపదం పరమాత్మక లింగం
ఓ శివ లింగమా, నీ సన్నిధి ఏ ఒకస్వర్గము
తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివలింగమా ..!
లింగాష్టక మిదం పుణ్యం యః పట్టేత్శివ సన్నిధౌ
ఎప్పుడైతే శివుడి సన్నిధిలోచదవబడుతుందో , వారికి చాలాపుణ్యం వస్తుంది.
శివ లోక మవాప్నోతి శివేన సహమోదతే
శివ లోకం లభిస్తుంది.

ద్వాదశ రాశుల జ్యోతిర్లింగాలు......!!


1 ) మేష రాశి :- ఓం హ్రీం శ్రీం లక్ష్మీనారాయణాయ నమః
2 ) వృషభరాశి :- ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయనమః
3) మిథున రాశి :- ఓం క్లీం కృష్ణాయ నమః
4) కర్కాటక రాశి :- ఓం క్లీం హిరణ్యగర్భాయ అవ్యక్త రూపిణే నమః
5) సింహరాశి :- ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః
6) కన్యారాశి :- ఓం నమో హ్రీం పీతాంబరాయ నమః
7) తులారాశి :- ఓం తత్వ నిరంజనాయ తారకారామాయ నమః
8) వృశ్చికరాశి :- ఓం నారాయణాయ నరసింహాయ నమః
9) ధనూరాశి :- ఓం శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః
10 ) మకరరాశి :- ఓం శ్రీ వత్సలాయ నమః
11 ) కుంభరాశి :- ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః
12 ) మీనరాశి :- ఓం క్లీం ఉధృతాయ ఉద్దారిణే నమః

శివుడికి అభిషేకం చేసేటపుడు చదివే మంత్రాలేమిటో తెలుసా?
.......................................................
నమక చమకాలంటే ఏమిటి??
అన్ని అభిషేకాలలో జలాభిషేకమే శివునకు ఎందుకు ప్రియం??
వేదాలు నాలుగు.. శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. మహారుద్రుడయిన శివుణ్ణి ప్రసన్నం చేసుకొనే మార్గాన్ని ఇందులో మనకు తెలిపారు... ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం. సృష్టి, స్థితి, లయలలో లయ కారుడైన శివుడిని ఆరాధించడమంటే... జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచించడమే.. . మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మే నని తెలియజేస్తుంది. శ్రీ రుద్రాన్ని రుద్రాప్రస్న అని కూడా అంటారు. వేద మంత్రాలలో ఏంటో ఉత్కృష్టమైనది. శ్రీ రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. "నమో" పదం వచ్చే మొదటి భాగం, యజుర్వేదంలో 16వ అధ్యాయంలో ఉంటుంది. దీనిని నమకం అంటారు. రెండవ భాగంలో "చమే" అన్న పదం మరల మరల రావటం వాళ్ళ దీనిని చమకం అంటారు. ఇది 18వ అధ్యాయంలోఉంది.
చమకం నమకం చైవ పురుష సూక్తం తథైవ చ |
నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||
నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతీ దినం చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.
శివుని ఝటాఝూటంలోకి గంగమ్మ ప్రవేశించడమే ఒక రకంగా అభిషేకం.. అదే అసలుసిసలైన శివునకు ప్రియమైన అభిషేకం... అభిషేకం చేయలేక పోయిన వారు నమక చమకాలను స్మరించుకున్నా అభిషేకం చేసిన ఫలితాన్ని పొంద వచ్చు..
ఈ రోజుల్లో అభిషేకం పేరుతో పదార్థాలను వృథా చేయవద్దు అని గొడవ పడుతున్న జనాన్ని చూస్తూనే ఉన్నాం.. అందుకేనేమో భోళాశంకరుడు ముందే తనను ప్రసన్నంచేసుకునేందుకు రెండు మారేడు దళాలు, కొంచెం చితాభస్మం.. గుక్కెడు నీళ్ళు చాలు అని చెప్పాడు..
అందరికీ శివానుగ్రహ ప్రాప్తిరస్తుః !!



రాశుల ననుసరించి పై మహామంత్రాల్ని జపిస్తే మానవుడు చాలా భాగం మాయ నుండి బయట పడతాడు. సృష్టి స్థితి లయలకు మాయ మూలస్థానం. దీనికి లోబడే జగత్తు కాలభ్రమణమవుతోంది . మయుడు మాయకే సూత్రధారి. అదే విష్ణుమాయ. త్రిమూర్తులు కూడా మాయ బద్దులే . మానవుడు జాగ్రత్తగా ఉంటూ , ధార్మిక నియమాలు పాటిస్తూ ఉంటే , సర్వశుభాలు సమకూరుటయేగాక , మరొక జన్మలేని పరమపదాన్ని చేరతాడు . లోకకళ్యాణం కోసం మానవుడు ఏ కార్యం ఆచరిస్తాడో అదే సత్యం . అదే ధర్మం . అదే సత్య ధర్మం .
ద్వాదశ రాశులు-- ద్వాదశ జ్యోతిర్లింగాలు
మేషరాశి: రామేశ్వరం :
శ్లోకం:- సుతామ్ర పర్ణీ జలరాశి యోగే, నిబధ్య సేతుం విశిఖైర సంఖై్య
శ్రీరామ చంద్రేన సమర్పితం తం, రామేశ్వరాఖ్యం నియతం నమామి.
ఈ రాశి కుజునికి స్వగృహం, చర రాశి వారికి పదకండవ ఇంటి అధిపతి అయిన శని బాధకుడు. గ్రహ పీడా నివారణార్థం రామేశ్వర తీర్థ యాత్ర,, పైన చెప్పిన శ్లోకం రోజు చదువుకొనుట చేయవలెను, శ్రీరామచంద్రుడు శని బాధ నివారణార్ధం ఈ లింగము ప్రతిష్టించెనని చెప్పబడినది. కుజునకు కందుల దానము, ఎర్ర వస్త్ర దానములు కుడా చేసిన మంచి ఫలితములు వచ్చును.
వృషభ రాశి: సోమనాధ జ్యోతిర్లింగము
శ్లోకం:- సౌ రాష్ట్ర దేశే విదేశే తిరమ్యే జ్యోతిర్మయం చంద్ద్ర కళావ సంతం,భక్తి ప్రాధానాయ క్రుపావతీర్ణం తం సోమనాధం శరణం ప్రపద్యే.
ఈ రాశి శుక్రునికి స్వగృహం, చంద్రునికి ఉచ్చ రాశి. సోమనాధ జ్యోతిర్లింగం శ్రీ క్రిష్ణుడుచే స్తాపించ బడింది. ఈ రాశికి శని నవామాదిపత్య బాధకుడు అయినందున శని దోషాలకు సోమనాధ దేవాలయ దర్శనం, పై శ్లోక ధ్యానము చేసిన సుభ ప్రదము. జన్మ నక్షత్రమందు రుదభ్రిషేకం చేయించుట వలన మంచి ఫలితములు పొందగలరు. బొబ్బర్ల దానము, బియ్యము దానము చేసిన మంచిది.
మిధున రాశి: నాగేశ్వర జ్యోతిర్లింగం:
శ్లోకం:-యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భొగై ,
సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీ నగనాధం శరణం ప్రపద్యే.
ఈ రాశి బుధునికి స్వగృహము. దోషాలకు నాగేశ్వర పుణ్య క్షేత్ర దర్శన, ప్రతి రోజు పై శ్లోకమును చదువుట, ఈ రాశి శని సంచరించు కాలమునందు జన్మ నక్షత్ర రోజున కైలాస యంత్ర ప్రస్తార మహా లింగార్చన జరిపించిన విశేషమైన ఫలితములు కలుగును.
కర్కాటకం: ఓంకార జ్యోతిర్లింగం:
శ్లోకం:-కావేరికా నర్మదాయో పవిత్రే , సమాగమే సజ్జన తారణాయ,
సదైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే
ఈ రాశి చంద్రునకు స్వగృహం , . ఓంకార జ్యోతిర్లింగ దర్శనం, రోజు పై శ్లోకం చదువుట , జన్మ నక్షత్రం రోజున ఓంకార బీజాక్షరం ఉచ్ఛరిస్తూ ఉండటం మంచి నివారణ ఉపాయములు.
సింహరాశి : శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం
శ్లోకం:-ఇలాపురే రమ్య విశాల కేస్మిన్‌ సముల్ల సంతం చ జగద్వ రేణ్యం,
వందే మహా దారాతర స్వభావం, ఘ్రుశ్నేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే.
సింహరాశి సూర్యునకు స్వగృహం. ఘ్రుష్నేస్వర జ్యోతిర్లింగ దర్శనం, పై శ్లోకమును రోజు చదువుట, జన్మ నక్షత్రం నాడు ఏక దశ రుదభ్రిషేకం ద్వారా దోషాలనుండి విముక్తి పొందవచ్చును.
కన్యా రాశి: శ్రీ శైల జ్యోతిర్లింగం
శ్లోకం:-శ్రీ శైల శ్రుంగే విభుధాతి సంగే తులాద్రి తుంగే పి ముదావసంతం,
తమర్జునం మల్లిక పూర్వమేకం, నమామి సంసార సముద్ర సేతుం.
ఈ రాశికి అధిపతి బుధుడు. బాధల నుండి ఉపశమనం పొందుటకు శ్రీ శైల మల్లిఖార్జున దర్శనం, భ్రమరాంబకి కుంకుమ అర్చన, జన్మ నక్షత్రం రోజున చండి హోమం చేసిన ఉపశమనం పొందగలరు. రోజు పైన చెప్పిన శ్లోకం చదువుట, జన్మ నక్షత్రం రోజున ఆవుకి ఆకు కూరలు, పచ్చ పెసలు తినిపించుట మంచిది.
తులారాశి: మహాకాళేశ్వరం
శ్లోకం:- అవన్తికాయాం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం
అకాల మౄఎత్యో : పరిరక్ష ణా ర్థం వందే మహాకాల మహాసురేశం
ఈ రాశికి శుక్రుడు అధిపతి, మహాకాళేశ్వర దర్శనము ద్వారా, , శుక్రవారము సూర్యోదయ సమయములో బొబ్బర్లు దానం చేయుట ద్వారా దోషములు, బాధలనుండి విముక్తి పొందవచ్చును.
వృశ్చిక రాశి: వైద్యనాదేశ్వరుడు
శ్లోకం:-పూర్వోత్తరె ప్రజ్వాలికానిధానే , సాదావసంతం గిరిజాసమేతం ,
నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్య నాదం తమహం నమామి.
ఈ రాశికి కుజుడు అధిపతి, వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్ర చికిత్సలకి కారణ భూతం. బాధలకు వైద్య నాదేశ్వరుని దర్శించి , పూజించుట ద్వారా, మంగళవారము జన్మ నక్షత్రము రోజున కందులు, ఎరన్రి వస్త్రములు దానము చేయుట మంచిది. ఋతు క్రమ దోషములున్న స్త్రీలు పెద్ద ముత్తైదువులకు యెరన్రి వస్త్రములు దానము చేయుట మంచిది.
ధనురాశి : విశ్వేశ్వర లింగం
శ్లోకం:- సానంద వనే వసంతం, ఆనందకందం హత పాప బృందం
వారణాసీనాధ మనాద నాదం, శ్రీ విశ్వ నాదం శరణం ప్రపద్యే.
ఈ రాశి వారికి గురుడు అధిపతి, స్వస్తానం. వేదాంత ధోరణి విపరీత ఆలోచనలు, సైంటిఫిక్‌ ఆలోచనలు, వీరి లక్షణం. అద్దిశంకరుల వారికి మోక్షం ప్రసాదించిన కాశీ క్షేత్రం, , అన్నపూర్ణ వద్ద శివుడు భిక్ష అడుగుట, అర్ధరాత్రి గంగకి ఆవలి ఒడ్డున నారాయణ మంత్రంతొ శివుడు జీవులకి మోక్షము ప్రసాదిస్తాడని పురాణాలలో చెప్పబడింది. పై శ్లోక పారాయణ, పూజ చేయుట, కాశి క్షేత్ర దర్శనము , గురువారము రోజున, జన్మ నక్షత్రము రోజున శనగల దానము ఇచ్చుట ద్వారా శని, గురు గ్రహ దోషాల నుండి విముక్తి పొందవచ్చును.
మకరము: భీమ శంకరం
శ్లోకం:- యం డాకినీ శాకినికాసమాజై : నిషేవ్యమాణం పిశితా శనైశ్చ ,
సదైవ భీమాది పద ప్రసిధం, తం శంకరం భూత హితం నమామి.
ఈ రాశి అధిపతి శని. గురునికి నీచ, కుజునికి ఉచ్చ,గురుడు అంటే జీవుడు , అహంకారపూరితమైన గజరాజు మొసలిచే పీడించబడి గజేంద్ర మోక్షము అనే ఆర్తి పూరితమైన ఘట్టం పురాణాలలో చెప్పబడింది. దోషాలకి భీమ శంకరం దర్శనం,,పూజ చేయుట, పై శ్లోక పారాయణము నిత్య పారాయణము, శని వారము నల్ల నువ్వుల దానము, నల్లని వస్త్రాలు దానము ఇచ్చుట, అవిటివారికి, ముసలి వారికి వస్త్ర దానము చేయుట మంచిది
కుంభం:కేదారేశ్వరుడు
శ్లోకం:-మహాద్రి పార్శే్వ చ రమంతం, సంపూజ్య మానం సతతం మునీన్రై్ద :
సురాసురై ర్యక్ష మహోర గాదై్య : కేదారమీశం శివమేక మీడే .
ఈ రాశికి శని అధిపతి, దోషాలకి కేదాద్రేశ్వర దర్శనము, పూజించుట, నిత్యమూ పై శ్లోక పారాయణము, శని వారము నువ్వుల దానము, అభిషేకం, మహన్యాస పూర్వక రుద్రాభి షేకం చేసిన మంచిది.
మీన రాశి: త్రయంబకేశ్వరుడు
శ్లోకం:-సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే, యద్దర్శనాథ్‌ పాతక మాశు నాశం, , ప్రయాతి తం త్రయంబక మీశ మీడే .
ఈ రాశి అధిపతి గురుడు. త్రయంబకేశ్వరుడు ఎప్పుడు నీటి మధ్యలో ఉంటాడు. అధిక ఫలితాలని ఇస్తాడని పురాణ ప్రసిద్ది. దోషాలకు త్రయంబకేశ్వర దర్శనము, చిత్రపటము పూజ మందిరమునందు ఉంచి నిత్యమూ పై శ్లోకము పారాయణము చేయుట మంచిది.
ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ
పంచభూత లింగాలు.....!!
పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.
1. పృథ్విలింగం:
ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.
2. ఆకాశలింగం:
ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.
3. జలలింగం:-
ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడు లోని తిరుచునాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.
4. తేజోలింగం:-
తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రం పై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.
5. వాయులింగం:-
ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం.

బిల్వాష్టోత్తర శతనామస్తోత్రం.....!!
1. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్
త్రిజన్మ పాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్
2. త్రిశాఖైః బిల్వ పత్రైశ్చ అశ్ఛిద్రైః కోమలైః శుభైః
తవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణమ్
3. సర్వత్రైలోక్య కర్తారం సర్వత్రైలోక్య పాలనమ్
సర్వత్రైలోక్య హర్తారమ్ ఏక బిల్వం శివార్పణమ్
4. నాగాధిరాజవలయం నాగహారేణభూషితమ్
నాగకుండలసంయుక్తమ్ ఏక బిల్వం శివార్పణమ్
5. అక్షమాలాధరం రుద్రం పార్వతీ ప్రియవల్లభమ్
చన్ద్రశేఖరమీశానమ్ ఏక బిల్వం శివార్పణమ్
6. త్రిలోచనం దశభుజం దుర్గాదేహార్ధధారిణమ్
విభూత్యభ్యర్చితం దేవం ఏక బిల్వం శివార్పణమ్
7. త్రిశూలధారిణం దేవం నాగాభరణసున్దరమ్
చన్ద్రశేఖరమీశానమ్ ఏక బిల్వం శివార్పణమ్
8. గఙ్గాధరామ్బికానాథం ఫణికుణ్డలమణ్డితమ్
కాలకాలం గిరీశం చ ఏక బిల్వం శివార్పణమ్
9. శుద్ధస్ఫటిక సంకాశం శితికంఠం కృపానిధిమ్
సర్వేశ్వరం సదాశాన్తమ్ ఏక బిల్వం శివార్పణమ్
10. సచ్చిదానన్దరూపం చ పరానన్దమయం శివమ్
వాగీశ్వరం చిదాకాశం ఏక బిల్వం శివార్పణమ్
11. శిపివిష్టం సహస్రాక్షం కైలాసాచలవాసినమ్
హిరణ్యబాహుం సేనాన్యమ్ ఏక బిల్వం శివార్పణమ్
12. అరుణం వామనం తారం వాస్తవ్యం చైవ వాస్తవమ్
జ్యేష్టం కనిష్ఠం గౌరీశమ్ ఏక బిల్వం శివార్పణమ్
13. హరికేశం సనన్దీశమ్ ఉచ్ఛైర్ఘోషం సనాతనమ్
అఘోరరూపకం కుంభమ్ ఏక బిల్వం శివార్పణమ్
14. పూర్వజావరజం యామ్యం సూక్ష్మ తస్కరనాయకమ్
నీలకంఠం జఘంన్యంచ ఏక బిల్వం శివార్పణమ్
15. సురాశ్రయం విషహరం వర్మిణం చ వరూధినమ్
మహాసేనం మహావీరమ్ ఏక బిల్వం శివార్పణమ్
16. కుమారం కుశలం కూప్యం వదాన్యఞ్చ మహారధమ్
తౌర్యాతౌర్యం చ దేవ్యం చ ఏక బిల్వం శివార్పణమ్
17. దశకర్ణం లలాటాక్షం పఞ్చవక్త్రం సదాశివమ్
అశేషపాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్
18. నీలకణ్ఠం జగద్వంద్యం దీననాథం మహేశ్వరమ్
మహాపాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్
19. చూడామణీకృతవిభుం వలయీకృతవాసుకిమ్
కైలాసవాసినం భీమమ్ ఏక బిల్వం శివార్పణమ్
20. కర్పూరకుందధవలం నరకార్ణవతారకమ్
కరుణామృతసింధుం చ ఏక బిల్వం శివార్పణమ్
శివాభిషేక ఫలములు......!!
1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.

శివుడి పుష్పార్చన ఎలా చేయాలి.... ? ఫలితం ఏమిటి....?
నిత్యం మనం భగవంతునికి చేస్తున్న పూజలలో పుష్పాలదే అగ్రస్థానం. ఏ స్వామి పూజ అయినప్పటికీ, ఏ తల్లి పూజ అయినప్పటికీ, వారి వారి పూజలలో పుష్పాలకే ప్రాముఖ్యత. ఎన్నో పూజా ద్రవ్యాలుండగా, పుష్పాలకే ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని అనిపించవచ్చు. పుష్పం యొక్క ముఖ్యత్వాన్ని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి.
పుష్పామూలే వసేద్బ్రహ్మ మధ్యేచ కేశవః
పుష్పాగ్రేచ మహాదేవః సర్వదేవాః స్థితాదలే
పుష్పం మొదట్లో బ్రహ్మ, పుష్పమధ్యమంలో కేశవుడు, పుష్పపు కొనలో మహాదేవుడు నివశిస్తుంటారు. పుష్ప దళాలలో సర్వదేవతలుంటారని ప్రతీతి.
పరంజ్యోతిః పుష్పగతం పుష్పేణైవ ప్రసీదతి
త్రివర్గ సాధనం పుష్పం పుష్టిశ్రీ స్వర్గమోక్షదమ్
పువ్వులలో ఉన్న పరమాత్మ పువ్వులతోనే ప్రసన్నుడవుతుంటాడు. కాబట్టి పుష్పం త్రివర్గ సాధనం. అంటే సంపదలను, స్వర్గాన్ని, మోక్షాన్ని కలిగిస్తుంది.
పుష్పైర్దేవాః ప్రసీదంతి పుష్పేదేవాశ్చ సంస్థితాః
కించాతి బహునోక్తెన పుష్పస్యోక్తి మత్రంద్రికామ్.
పుష్పాలతో దేవతలు ప్రసన్నులవుతుంటారు. ఎందుకంటే వారు పుష్పాలలో నివశిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే పుష్పాలలో చైతన్యం ఉంటుంది.
ఇక, మన పురాణాలలో ఒక్కొక్క దేవతకు ఇష్టమైన పువ్వులను గురించి కూడ ప్రస్తావించబడింది. విష్ణువుకు, దుర్గాదేవికి, వినాయకుని రకరకాల పుష్పాలతో పూజించ వచ్చని పేర్కొనబడగా, శివునికి మాత్రం మారేడు ప్రతిచాలన్నట్లుగా చదువుతుంటాం. ఈ విషయాన్నే శ్రీనాథ మహాకవి వర్ణించాడు.
శివుని శిరమున కాసిన్ని నీళ్ళుజల్లి
పత్తిరిసుమంత నెవ్వాడు పారవైచు
కామధేను వతడింట గాడిపసర
మల్ల సురశాఖి వానింట మల్లెచెట్టు
శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు ప్రతిని శివలింగంపై పడవేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటిపశువుగా ఉంటుంది. ఆ భక్తుని ఇంట కల్పతరువు మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయాసముద్రుడు శివుడు. మరి, అంతటి బోళాశంకరునికి మారేడు దళాలు తప్ప మరే పుష్పాలతో పూజించే అవకాశం లేదా?!
ఈ ప్రశ్నకు సమాధానం శివధర్మసంగ్రాహం, శివరహస్యఖండం, లింగపురాణం, కార్తీకమాహాత్మ్యం గ్రంథాలు చెబుతున్నాయి. శివునికి ఇష్టమైన పువ్వుల గురించి ఆ గ్రంథాలు ఇలా చెబుతున్నాయి.
శివుని పుష్పాలతో పూజిస్తే, పది అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుంది. ఎవరైతే కనీసం ఎనిమిది పుష్పాలతో శివుని పూజిస్తారో వారికి కైలాసప్రాప్తి కలుగుతుంది. శివుని పూజకు ఉపయోగించే పువ్వులు వాదిపోయినవిగా ఉండ కూడదు. కీటకాడులతో కొరకబదినవిగా ఉండేవి శివ పూజకు పనికిరావు. అలాగే ఇతరుల పూదోటలో పూచిన పువ్వులను దొంగతనంగా తీసుకువచ్చి పూజిస్తే ఫలితం కనిపించదు. ఇంకా పాపం కలుగుతుంది.
శివపూజకు అరణ్యంలో పూచిన పువ్వులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. గన్నేరు, పొగడ, జిల్లేడు, ఉమ్మెత్త, కలిగొట్టు, పెద్దములక, తెల్లదింటెన, కట్లతీగ పువ్వులు, అశోకపువ్వు, మందారం, విష్ణుక్రాంత, జమ్మి, గులాబి, నెమ్మిపూలు, ఉత్తరేణి, తామర, జాజి, చెంగలువ, సంపెంగ, వట్టివేరు పూలు, నందివర్థనం, నాగకేసరం, పొన్న, పచగోరింట, తుమ్మి, మేడి, జయంతి, మల్లె, మోదుగ, మారేడు దళాలు, కుసుమపూవు, కుంకుమపూవు, ఎర్రకలువలు, నీలిపూలు శివపూజకు ప్రశస్తమైనవి. ఈ పుష్పాలతో ఏ పుష్పాన్ని సమర్పించినప్పటికీ శివ పరమాత్మ ఆనందంతో స్వీకరిస్తాడు. ఈ విషయాన్ని స్వామివారే ఉమాదేవికి చెప్పినట్లు
పురాణవాక్కు.
అదేవిధంగా శివుని ఏయే మాసాలలో ఏయే పూలతో పూజిస్తే ఏయే ఫలితం ఉంటుందన్న విషయాన్ని గురించి కూడ చెప్పబడింది. చైత్రమాసంలో శంకరుని నృత్యగీతాలతో సేవిస్తూ, దర్భ పువ్వులతో పూజిస్తే బంగారం వృద్ధి చెందుతుంది. వైశాఖమాసంలో శివుని నేతితో అభిషేకిస్తూ తెల్లని మందారాలతో పూజిస్తే వారికి అశ్వమేధఫలం కలుగుతుంది.
జ్యేష్ఠ మాసంలో పెరుగుతో అభిషేకిస్తూ తామరపువ్వులతో పూజించిన వారికి పరమగతి కలుగుతుంది. ఆషాఢమాసంలో కృష్ణ చతుర్ధశినాడు స్నానం చేసి శివునికి గుగ్గిలంతో ధూపం వేసి తొడిమల తోడిమాలతో కూడిన పుష్పాలతో అర్చించినవారికి బ్రహ్మలోకాన్ని పరమపదం లభిస్తుంది. శ్రావణమాసంలో ఒంటి పూట భోజనం చేస్తూ గన్నేరుపూలతో శివుని పూజించినవారికి వేయిగోదానముల ఫలం లభిస్తుంది. భాద్రపద మాసంలో శివుని ఉత్తరేణి పూలతో పూజించిన వారు హంసధ్వజంతో కూడిన విమానంలో పుణ్యపదానికి చేరుకుంటారు. ఆశ్వయుజమాసంలో పరమశివుని జిల్లేడుపూలతో పూజించినవారు మయూర ధ్వజంతో కూడిన విమానంలో దివ్యపదాన్ని చేరుతారు.
కార్తీకమాసంలో శివుని పాలతో అభిషేకించి జాజిపూలతో పూజించినవారు శివపదాన్ని దర్శించుకుంటారు. మార్గశిర మాసంలో శివుని పొగడపూలతో పూజించినవారు, ముల్లోకాలను దాటి తామున్నచోటికే తిరిగిరాగలరు.
పుష్యమాసంలో శివుని ఉమ్మెత్త పూలతో పూజించినవారు పరమ పదాన్ని పొందగలరు. మాఘ మాసంలో శివదేవుని బిల్వదళాలతో అర్చించినవారు, లేత సూర్యుడు, చంద్రుడులున్న విమాన,లో పరమపదానికి వెళతారు. ఫాల్గుణమాసంలో శివుని సుగంధజలంతో అభిషేకించి తుమ్మిపూలతో పూజించినవారికి ఇంద్రుని సింహాసనంలో అర్ధభాగం దక్కుతుంది.
ఇక, శివపూజలో ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే, ఒక్కొక్క ఫలితం కలుగుతుంటుంది. శివుని రోజూ జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసిననంత ఫలితాన్ని పొందుతారు.
శివపూజకు సంబంధించినంత వరకు వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.
వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.
వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం.
వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.
వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మేత్తుపువ్వు ఉత్తమం.
వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పూవు ఉత్తమం.
వేయి ములక పూవుల కంటే ఒక తుమ్మిపూవు ఉత్తమం.
వేయి తుమ్మిపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.
వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపూవు ఉత్తమం.
వేయి దర్భపూల కంటే ఒక జమ్మిపూవు శ్రేష్ఠం.
వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు. శివపూజకు పువ్వులన్నింటిలోకి నల్లకలువపువ్వు ఉత్తమోత్తమమైనది. శివునికి వేయినల్ల కలువలతో మాలను అల్లి సమర్పించినవారు, శివునితో సమమయిన పరాక్రమంగలవారై వందల, వేలకోట్ల కల్పాలు నిత్యకైలాసంలో నివశిస్తారు. ఈ పుష్పమాలతో కాక మిగతా పుష్పాలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందుతారు.
పరమశివునికి పొగడపూలంటే అమితమైన ఇష్టం. ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడపువ్వుతో అర్చించే భక్తుడు వేయిగోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు.
ఒక నెలపాటు పొగడపూలతో పూజించినవారు స్వర్గ సుఖాలను పొందుతారు. రెండునెలలపాటు పూజించిన వారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు. మూడు నెలల పాటు పొగడపూలతో అర్చించినవారికి బ్రహ్మలోక ప్రాప్తి. నాలుగు నెలలు పూజించినవారికి కార్య సిద్ధి. ఐదు నెలలు పూజించినవారికి యోగసిద్ధి. ఆరు నెలలు పూజించినవారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది.
సాధారణంగా శివునికి బిల్వపత్రాలే ప్రీతిపాత్రమైనవి. మిగతా పత్రాలు ప్రీతికరం కావని అనుకుంటుంటాం. లింగపురాణం ఆ స్వామికి ఇషామైన మరిన్ని పత్రాలను గురించిన వివరాలను అందిస్తోంది. మారేడు, జమ్మి, గుంట గలగర, అడ్డరసము, అశోకపత్రాలు, తమాలము, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచీపత్రి, నల్ల ఉమ్మెత్త, తామరాకు, నీతికలువ, మెట్టకలువ ఆకులు, సంపెంగ పత్రి, తుమ్మి, ఉత్తరేణి ఆకులను పత్రాలను పూజలో ఉపయోగించవచ్చు. అంటే, ఆయా పుష్పాలు లభించనపుడు, ఆయా పత్రిని ఉపయోగించవచ్చు.
ఇక పుష్పదానానికి సంబంధించినంతవరకు, పుష్పాన్ని గాని, ఫలాన్నిగాని దైవానికి నివేదిస్తున్నప్పుడు ఆ పుష్పం ముఖం బోరగిలబడకూడదు. అలా చేయడంవల్ల దుఃఖం కలుగుతుంది. అయితే ఆ పుష్పాలను లేక పత్రిని దోసిట్లో పెట్టుకుని నివేదించేటప్పుడు బోర్లాపడినప్పటికీ దోషం కాదు. ఉమ్మెత్త, కడిమిపువ్వులను శివునికి రాత్రివేళ సమర్పించాలి. మిగిలిన పూలతో పగిటిపూట. మల్లెలతో రాత్రివేళ, జాజి పూలతో మూడవజామున, గన్నేరుతో అన్నివేళలా పూజించవచ్చు.
ఇప్పటివరకు మనం ఏయే పూలతో శివుని పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం. అయితే మన మనసులోని కోరికననుసరించి కూడ శివునికి పువ్వులను సమర్పించవచ్చు. ఉదాహరణకు ధనం కావాలను కున్నవారు శివుని గన్నేరుపూలతో, మోక్షం కావాలంటే ఉమ్మెత్తపూలతో, సుఖశాంతుల కోసం నల్లకాలువతో, చక్రవర్తిత్వం కోసం తెల్లతామరలతో, రాజ్యప్రాప్తి కోసం ఎర్రతామరలతో, నాగకేసరం, కేసరీపుష్పాలతో అనుకున్న కోరికలు నెరవేరుతాయట. గన్నేరు, అశోకం, ఊడుగు, తెల్లజిల్లేడులతో పూజించిన వారికి మంత్రసిద్ధి, రోజాపుష్పాలతో లాభాసిద్ధి, దంతి ప్రత్తి పూలతో సౌభాగ్యం కలుగుతుంది. కోరుకున్న కన్యను పొందాలంటే శివుని సన్నజాజి పూలతో పూజించాలి. సంతానం కావాలనుకునేవారు శివుని మొల్లపువ్వులతో పూజించాలి. దర్భపూలతో ఆరోగ్యం, రేలపూలతో ధనం, తుమ్మిపూలతో వశీకరణం, కడిమిపూలతో శత్రుజయం కలుగుతుంది. బిల్వదళ పూజ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. శివుని మరువంతో పూజిస్తే సుఖం, లోద్దుగపూలతో పూజిస్తే గోసంపద కలుగుతుంది. మోదుగ, బూరుగు పూలతో పూజిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది.
ఇక, శివపూజకు పనికిరాని పువ్వుల గురించి మన పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి.
మొగిలి, మాధవి, అడవిమల్లి, దిరిసెన, సాల, మంకెన పువ్వులు శివార్చనకు పనికిరావు. బావంచి ఆకులు, పువ్వులు, కానుగపూలు, తాండ్ర ఆకులు, దాసాని, ఎర్రమద్ది, మందార, విషముష్టి, అడవిమొల్ల, తెల్ల విష్ణుక్రాంత, ఎర్ర, తెల్ల గులాబీలు, దిరిసెన పువ్వులు శివపూజకు పనికిరావు. వేప, వెలగ, గురివింద పూలు కూడా శివపూజకు అర్హం కావు.
దశసౌగంధికం పుష్పం నిర్గంధియది భామిని
శాతసాహస్రి కామాలా అనంతం లింగపూజసే
పది సుగంధపుష్పాలతో (ఒకవేళ పరిమళం లేకపోయిన వైనప్పటికీ) శివలింగాన్ని పూజిస్తే, శతసహస్రమాలలతో పూజించిన అనంత పుణ్యఫలం లభిస్తుందని శివధర్మ సంగ్రహం చెబుతోంది.

గరుడపురాణంలో అనేక ద్రవ్యాలతో చేసి పూజిస్తే ఏయే ఫలాలు పొందవచ్చో చెప్పబడినది.....!!
రెండుపాళ్ళు కస్తూరి, నాలుగు పాళ్ళు చందనం,మూడుపాళ్ళు కుంకుమ కలిపి శివలింగాన్ని చేసి పూజిస్తే శివసాయుజ్యం లభిస్తుంది.వాసన గల పుష్పాలతో లింగం తయారుచేసి పూజిస్తే భూమినీ,రాజ్యాన్ని పొందవచ్చు.
స్వచ్ఛమైన ప్రదేశంలో కపిల గోవుల పేడతో శివలింగం చేసి పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. దీనిని గోశకలింగం అంటారు.
నాలుకా లింగం అనగా ఇసుకతో లింగం చేసి పూజిస్తే విద్యాధరత్వం తదుపరి శివసాయుజ్యం కలుగుతుంది.
యవగోదూమశాలిజలింగం అనగా జొన్నలు,గోధుమలు,బియ్యం కలిపి పిండి పట్టించి ఆ పిండితో లింగాన్ని చేసి పూజిస్తే పుత్రలాభం కలుగుతుంది,ధనం వర్ధిల్లుతుంది.
సీతాఖండలింగం- పటిక బెల్లం తో లింగం చేసి పూజిస్తే ఆరోగ్యం కలుగుతుంది.
తిలపిష్టలింగం- నువ్వులను రుబ్బి ముద్దతో లింగం చేసి పూజిస్తే కోరికలు నెరవేరుతాయి.
భస్మలింగం- భస్మలింగ పూజ సర్వ ఫలప్రదం.
గుడలింగం- బెల్లముతో కాని,చక్కెరతో కాని చేసి పూజిస్తే సుఖాలన్ని కలుగుతాయి.
వంశాంకురలింగం- వెదురు చిగుళ్ళతో లింగం చేసి పూజిస్తే వంశం నిలుస్తుంది.
పిష్ఠలింగం- పిండిలింగం విద్యాప్రదం.
దధిదుగ్ధలింగం-పెరుగులో నీళ్ళు వత్తి లింగం చేసి పూజిస్తే సంపద,సుఖం వస్తాయి.
ధాన్యలింగం-ధాన్యప్రదం.
ధాత్రీలింగం-ఉసిరికాయలతో లింగం చేసి పూజిస్తే మక్తిప్రదం.
ఫలలింగం-ఫలప్రదం.
నవనీత(వెన్న)లింగం-కీర్తి,సౌభాగ్యకరం.
దూర్వాకుండజ(గరిక)లింగం-అపమృత్యునివారకం.
కర్పూరలింగం- ముక్తిప్రదం.
అయస్కాంతలింగం-అయస్కంతాన్ని లింగాకారంగా చేసి పూజిస్తే సిద్ధిని కలిగిస్తుంది.
మౌకికలింగం-ముత్యాల భస్మంతో చేసిన లింగం సౌభాగ్యాన్నిస్తుంది.
సువర్ణలింగం-బంగారు లింగం మహాముక్తిప్రదం.
రజతలింగం- వెండిలింగం సంపత్కరం.
పిత్తలలింగం- కాంస్యలింగం(ఇత్తడి,కంచు లింగాలు)ముక్తినిస్తాయి.
త్రపులింగం- ఆయసలింగం,
సీసలింగం(తగరం,తుత్తం,ఇనుము) శతృనాశకాలు.
అష్టధాతులింగం- సర్వసిద్ధిప్రదం.
అష్టలోహలింగం- కుష్ఠు వ్యాధిహరం.
వైఢూర్యలింగం- శతృగర్వ నివారకం.
స్ఫటికలింగం-సర్వకామప్రదం.
పాదరసలింగం- మహైశ్వర్యప్రదం.
రాగి,సీసం,శంఖం,ఇనుము,గాజు మన్నగువాటితో తయారు చేసిన లింగాలు కలియుగంలో వాడరాదు.
లింగపూజ పార్వతీపరమేశ్వరుల పూజ.


ఓం నమో భగవతే మృత్యుంజయాయ నమః
దేవాసుర గురుర్ధేవో దేవాసుర నమస్కృతః
దేవాసుర మహామిత్రో దేవాసుర మహేశ్వర
దేవా సురేశ్వరో దివ్యో దేవాసుర మహాశ్రయః
దేవదేవమయో -చింత్యో దేవదేవాత్మ సంభవః
సద్యోనిరసురవ్యాఘ్రో దేవసింహో దివాకరః
విభుదాగ్రచరశ్రేష్ట్ఠః సర్వదేవోత్తమొత్తమః
శివజ్ఞానరతః శ్రీమాచ్ఛిఖీ శ్రీపర్వతప్రియః
వజ్రహస్తః సిద్దఖడ్గో నరసింహ నిపాతనః
బ్రహ్మచారీ లోకచారీ ధర్మచారి ధనాధిపః
నందీ నందీశ్వరో-నంతో నన్థొ నగ్నవ్రతధరః శుచిః
లింగాధ్యక్షః సురాధ్యక్షో యోగాద్యక్షో యుగావహః
స్వధర్మా స్వర్గతః స్వర్గస్వర్గ స్వరమయస్వనః
బాణాధ్యక్షో బీజకర్తా ధర్మక్రుద్దర్మ సంబవః
దంభో-లోభో-ర్థవిచ్ఛంభుః సర్వభూత మహేశ్వరః
స్మశాన నిలయస్త్య క్ష్యః సేతురప్రతి మాకృతిః
లోకోత్తరస్పుటాలోక స్త్రంబకో నాగభూక్షణః
అంధకారిర్మఖద్వేషీ విష్ణు కంధర పాతనః
హీనదోషో-క్షయగుణో దక్షారిః పూషదంతభిత్
ధూర్జటిః ఖండపరశుః సకలో నిష్కలో-నఘ
అకాలః సకలాధారః పాండురాభో మృడోనటః!
నమః పార్వతీ పరమేశ్వరాయ నమః

అష్టభైరవులు అంటే ఎవరు........?

భైరవులు ఎనిమిది మంది. 1. అసితాంగభైరవుడు 2. రురుభైరవుడు 3. చండబైరవుడు 4. క్రోధబైరవుడు 5.ఉన్మత్తభైరవుడు 6. కపాలభైరవుడు 7. భీషణభైరవుడు 8. సంహారభైరవుడు. ఈ ఎనిమిది మంచి శ్యామలా, ఛండీ యంత్రాలలో కూడా పూజింపబడే దేవతలు. వీరు రక్షక స్వరూపాలు. తీవ్రమైన నాదశక్తి, తేజశ్శక్తి కలిగినవారు భైరవులు. మార్తాండభైరవుడు - ఆదిత్య స్వరూపుడు. కాలభైరవుడు - శివస్వరూపం. ఆ భైరవులు అంశలుగా వీరిని భావించవచ్చు.


నందికి ఎందుకంత ప్రత్యేకత......!!

శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకొంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యతా? కాదంటోంది ఆయన చరిత్ర! ఈ కార్తీకమాసం సందర్భాన ఒకసారి ఆ నందీశ్వరుని తల్చుకుందాం…
పూర్వం శిలాదుడనే రుషి ఉండేవారు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా… పిల్లలు లేకపోవడం ఆయనకు లోటుగా ఉండేది. ఎలాగైనా సరే తనకు సంతానభాగ్యం కలిగేందుకు పరమశివుని కోసం తపస్సు చేయసాగాడు శిలాదుడు. ఏళ్లూ ఊళ్లూ గడిచిపోయాయి, ఎండావానా వచ్చిపోయాయి… కానీ శిలాదుని తపస్సు ఆగలేదు. ఆతని ఒంటినిండా చెదలు పట్టినా సరే నిష్ఠ తగ్గలేదు. ఎట్టకేళకు శిలాదుని ఎదుట ప్రత్యక్షం అయ్యాడు పరమశివుడు. `నాకు అయోనిజుడయిన ఒక కుమారుడిని కలుగచేయి` అని కోరుకున్నాడు శిలాదుడు. అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు `తథాస్తు` అంటూ వరాన్ని అనుగ్రహించాడు.
శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా, ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు. ఆ బాలుడికి `నంది` అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థమట! బాలుని జననంలాగానే అతని మేథ కూడా అసాధారణంగా ఉండేది. పసివాడకుండానే సకలవేదాలన్నీ ఔపోసన పట్టేశాడు. ఇలా ఉండగా ఓనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు. అతను తమకి చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు. వెళ్తూ వెళ్తూ `దీర్ఘాయుష్మాన్భవ` అని అశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోయారు!
నంది వంక దీక్షగా చూసి మిత్రావరుణులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు. ఎంతగానో ప్రాథేయపడిన తరువాత నంది ఆయుష్షు త్వరలోనే తీరిపోనుందని తెలుసుకున్నాడు శిలాదుడు. భివిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు. కానీ నంది మాత్రం తొణకలేదు, బెణకలేదు. `శివుని అనుగ్రహంతో పుట్టినవాడిని కాబట్టి, దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు` అంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది. నంది తపస్సుకి మెచ్చిన శివుడు అచిరకాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడు. శివయ్యని చూసిన నందికి నోట మాట రాలేదు. ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుండో కదా అనుకున్నాడు. అందుకే తన ఆయుష్షు గురించో, ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా `అచిరకాలం నీ చెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ` అని శివుని వేడుకున్నాడు నంది. అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా! అందుకే నందిని వృషభరూపంలో తన వాహనంగా ఉండిపొమ్మంటూ అనుగ్రహించాడు.
ఆనాటి నుంచీ శివుని ద్వారాపాలకునిగా ఆయనను కాచుకుని ఉంటూ, ఆయన ప్రమథగణాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణను అందిస్తూ, తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది. శివునికి సంబంధించిన చాలా గాథలలో నంది ప్రసక్తి ఉంటుంది. వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామిభక్తి, దీక్ష కనిపిస్తూ ఉంటాయి. ఉదా॥ క్షీరసాగరమథనంలో హాలాహలం అనే విషం వెలువడినప్పుడు, దాని నుంచి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరళకంఠునిగా మారాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందకి ఒలికిందట. అప్పుడు శివుని చెంతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్నీ ఆరగించేశాడు. మహామహాదేవతలే హాలాహలానికి భయపడి పారిపోతుండగా, నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిశ్చింతగా నిల్చున్నాడు.
నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే, ఆయనను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్యభక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు. తమిళనాట ఆయనను అష్టసిద్ధులు కలిగినవానిగా, జ్ఞానిగా, ప్రథమగురువులో ఒకనిగా భావిస్తారు. శైవమత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోని బసవనగుడి, మైసూర్‌ వంటి ప్రదేశాలలో నందికి ప్రత్యేకించిన ఆలయాలు ఉన్నాయి. ఇక తెలుగునాట కూడా లేపాక్షి (అనంతపురం), మహానంది (కర్నూలు) వంటి క్షేత్రాల్లో నందీశ్వరుని ప్రాధాన్యత కనిపిస్తుంది. శివుడు ఉన్నంతకాలమూ, ఆయన భక్తుడైన బసవన్నకి కూడా ఏ లోటూ ఉండదు!

ఈ ప్రపంచములో సృష్టిస్థితిలయములకు సకలచరాచర జీవకోటిని సంరక్షించుటకు కైలాసములో పార్వతీ పరమేశ్వరులుగా, శ్రీశైలములో భ్రమరాంబ మల్లిఖార్జునులుగా, కాశీలో విశాలాక్షి విశ్వనాధలింగేశ్వరులుగా, సోమేశ్వర, మల్లిఖార్జున, మహాకాళేశ్వర, అమరేశ్వర, వైద్యనాథేశ్వర, భీమేశ్వర, రామేశ్వర, నాగేశ్వర, విశ్వేశ్వర, త్రయంబకేశ్వర, కేదరేశ్వర, ఘృశ్వేశ్వర అను ద్వాదశ జ్యోతిర్లింగములుగా వివిధ పుణ్యక్షేత్రములలో ప్రసిద్ధి చెందినారు. ఆ జగద్రక్షకుడైన జగదీశ్వరుని ఎంత పొగిడినా తనివితీరదు. ఓం నమః శ్శివాయ అను పంచాక్షరి మంత్రమును నియమ నిష్ఠలతో పఠించిన శివకోటి భక్త జనులకు సర్వపాపములు పటాపంచలు అయి ముక్తి మోక్షఫల ప్రదంబుల నొసంగి జన్మ తరింపజేయును. శివదీక్షను, నిష్ఠ నియమాలతో ఆచరించిన, దేహపీడలు అకస్మాత్ కలహములు తొలగి ఆయురారోగ్యములు, అష్ట్యైశ్వర్యములతో శుభ ప్రదముగా జీవించునట్లు ఆశీర్వదించును. దేవతలందరిలో శివుడు దయారస హృదయుడు. భక్తుల మొరలాలించి వరాలిచ్చే బోళాశంకరుడు. శివ అంటే శుభము అని అర్థము. ఇతర దేవతలవలె శివుడు అవతారము లెత్తుటకై మహా శివుడు ఎవరి గర్భమున జన్మింపలేదు. అవతారము, అవతార సమాప్తి, అన్నియు లీలలే, శివుడు నిర్మలుడు, నిర్గుణుడు, నిష్కలంకుడు, నిటాలాక్షుడు, నిరంజనుడు. అట్టి ఆదిదేవుడు శివుని ఆలంబనముగా జేసుకొని ఆచరించబడేదే శివదీక్ష జగన్మాతయైన పార్వతీదేవి కఠోరమైన శివదీక్ష చేసి, ఆ పరమశివుని అనుగ్రహము వలన నిజమైన అర్థాంగియైనది. శివుని శరీర మందు అర్థభాగము స్వీకరించుటచే పరమేశ్వరుడు కూడా అర్థనారీశ్వరుడైనాడు. శ్రీరామచంద్రుడు శ్రీరామలింగేశ్వరుని, శ్రీకృష్ణుడు శివదీక్షను, అర్జునుడు పాశువత దివ్య దీక్షను స్వీకరించి తరించునట్లు చెప్పబడుచున్నది. మనకు తెలిసినంత వరకు శివదీక్ష పట్టిన వారిలో మొట్టమొదటి భక్తురాలు పార్వతీదేవి. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలు శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, భక్త కన్నప్ప నుండీ, పర్వతుడు, భక్త సిరియాలుడు మొదలైనవారు శివదీక్షను పాటించినట్లు విక్రమాదిత్యుని తామ్రశాసనం వలన తెలుస్తుంది. కార్తికేయుడు కూడా శివదీక్షను పూని దేవతాసిన్యాలకు అధిపతి అయినాడు. ఇంతటి దివ్య మహిమగల శివదీక్ష ఎంతో ప్రాచీనమైనది. మాఘమాసంలోని మహాశివరాత్రితో మండలకాలం అనగా 40 రోజుల్లో ముగియునట్లుగా ఆచరించుట మంచిది. 40 రోజులు పూర్తయి 41వ రోజున దీక్ష విరమించవలెను. మాఘమాసములోని మహాశివరాత్రితో గాని, కార్తీక మాసములోని మహాశివరాత్రితో గాని, కార్తీక మాసములోని మాస శివరాత్రితోకాని దీక్ష పూర్తి అయ్యే విధముగా ఆచరించవచ్చును. మండలకాలం పూర్తి అయిన తరువాత జ్యోతిర్ముడితో శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి మల్లిఖార్జున స్వామికి నమస్కరించి శ్రీశైల మహాక్షేత్రము నందు గల త్రిఫల వృక్షము క్రింద ఈ దీక్షా విరమణ చేయుట మిక్కిలి శ్రేష్ఠము. ఇది చేయలేని వారు అర్థ మండలం అనగా 20 రోజులు శివ దీక్షవహించిన 21 వ రోజులో దీక్షావిరమణ చేయవలెను. ఈ శివదీక్షను స్థానిక శివాలయములోని శివార్చకునితో కాని ఇంతకు పూర్వము శివదీక్షను స్వీకరించిన వారితోకాని మూలాధారణను చేయించుకొనవలెను. ఇట్టి మహత్తరమైన శివదీక్షను నియమానుసారము ఆచరించిన వారికి భూత, ప్రేత, పిశాచ, శత్రు బాధలు, గ్రహారిష్టములు తొలగిపోవును. సర్వ సంపదలు కలిగి ఐహికాముషిక సుఖబీమమీలు పొందెదరు. శంకరాచార్యుల వారు తన శివానందలూ ఓ పరమేశ్వరా ! ఈ జగత్తులో సహస్రార్థిలో దేవతలు ఉన్ననూ శాశ్వత మోక్ష ఫలమును ప్రసాదించువాడవు నీవే సుమా ! కనుక నీ పాదద్మములే నాకు శరణ్యము. శివదీక్ష - మాలాధారణ మంత్రం 108 రుద్రాక్షలు, దానికి చివర పరమేశ్వరుని ముద్రగల మాలను తీసుకొనవలెను. ఈ శ్లోకములను చెప్పుచూ మాలను శివ ముద్రకు నమస్కారం చేయవలెను. శ్లో!! ఓంకార శక్తి సంయుక్తాం సచ్చిదానంద రూపిణీం ! శ్రీశైలేశ దయాపూర్ణాం శివముద్రాం నమామ్యహం !! అంటూ రుద్రాక్షమాలకు గల స్వామి వారి నమస్కారం చేయాలి.

No comments:

Post a Comment