Wednesday, May 18, 2016

శివలింగాలు


"ఓం" అనే ఏకాక్షర మంత్రం ఎంత శక్తివంతమైందో తెలుసా?
.......................................................
"ఓం" అనే ఏకాక్షర మంత్రం... చాలా శక్తివంతమైంది. దీనినే ప్రణవమని అంటారు. ఓం, ఓమ్, లేదా ఓంకారము త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఓంకారం ఏర్పడింది. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. పరమాత్మకు శబ్దరూప ప్రతీక.
మంత్రోచారణం అనేది జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే సాధనం. ఇందులో ఓంకారానికి అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. ఓం కారము పరబ్రహ్మ స్వరూపము. ఆ ఓంకారము నుంచే యావత్తు జగము ఉద్భవించింది. వేదముల యొక్క సారము ఓంకారము.
`ఓం' అంటే ప్రారంభాన్ని తెలుపునది. ఓకాక్షర మంత్రము, భగవంతుని ముఖ్యనామమైన `ఓం'కు అనేక అర్థాలు కలవు. బ్రహ్మనాదము ఓంకారము. ఆత్మ ఓంకార మంత్ర స్వరూపము ప్రణవ నాదమే ప్రాణము. ప్రధమ నాదము ఓంకారము. అకార, ఉకార, మకారములను మూడు అక్షరముల కలయిక వలన ఓంకారము ఉద్భవించినదని పండితులు చెబుతున్నారు


శివలింగాలలోని ప్రత్యేకత...!
.......................................................
పరమశివుడికి సంబంధించిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత వుంటుంది. కొంతమంది వీటిలో తమకిష్టమైన వాటిని ఎంచుకుని నిరంతరం వాటినే పూజిస్తుంటారు. అలాగే ప్రతిఒక్కరూ రకరకాలుగా తమకు అనుగుణంగా వుండే విధంగా, తమకు నచ్చిన సమయంలో పూజించుకుంటుంటారు.
అయితే ఏ లింగాన్ని, ఎప్పుడు, ఎలా పూజించాలి...? వాటివల్ల వచ్చే నష్టాలేంటి, లాభాలేంటి దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం....
01. లింగపురాణాల ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్నీ, శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణలింగాన్నీ, వాణిజ్య ప్రధానలైన వైశ్యులు స్వర్ణలింగాన్నీ పూజించుకోవాలి. అయితే స్ఫటికలింగాన్ని మాత్రం ఎవరైనా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా పూజించుకోవచ్చు.
02. ఏ లింగాన్ని పూజిస్తే ఏ ఫలితం లభిస్తుందోనన్న విషయాలు లింగపురాణంలో వివరించి వున్నాయి. అందులో రత్నాజ శివలింగాన్ని పూజించడం వల్ల ఐశ్వర్యంతోపాటు వైభవం సిద్ధించి పరిపూర్ణత కలుగుతుంది. అలాగే ధాతుజలింగం భోగ విలాసాలను అందిస్తుంది. మృత్తికాలింగం కూడా శిలా లింగంలాగానే పరిపూర్ణతనునిస్తుంది.
03. శివునికి సంబంధించిన లింగాలలో అత్యంత పవిత్రమైన లింగం బాణలింగం. ఇవి తెల్లగా, చిన్న అండాకారలంలో నదీప్రవాహం వల్ల సహజంగా నునుపుదేలి వుంటాయి. ఇది నర్మదా నదిలో ఎక్కువగా లభిస్తుంది.
04. వైశాఖంలో వజ్రలింగాన్ని, జ్యేష్ట౦లోమరకత లింగాన్ని, శ్రావణంలో నిలపు లింగాన్ని, భాద్రపదంలో పద్మరాగ లింగాన్ని, ఆశ్వయుజంలో గోమేధికలింగాన్ని, కార్తికంలో ప్రవాళలింగాన్ని, మార్గశిరంలో వైడూర్య లింగాన్ని, పుష్యమాసంలో పుష్పరాగ లింగాన్ని, మాఘమాసంలో సూర్యకాంత లింగాన్ని, ఫాల్గుణ౦లో స్పటిక లింగాన్ని పూజించాలి. వీటికి ప్రత్యామ్నాయంగా వెండి, రాగి లింగాలను కూడా పూజించవచ్చు.
05. చివరగా.... లింగపూజ చేసుకునేవారు ఉత్తరముఖంగా కూర్చొని వుండాలి. అలాగే రుద్రాక్ష, భస్మం, మారేడు అనే మూడువస్తువులు తమతోపాటు తప్పనిసరిగా పూజలో వుంచుకోవాలని శివపురాణంలో చెప్పబడింది.


పాపాలు తొలగించు పాలాభిషేకం...!.....................................................

మానవుల కోరికలు, పాపాలు, అసంతృప్తులో వారి దుఃఖానికి కారణం. దీని వలనే మనం అశాంతి పాలవుతుంటాం. అలాంటప్పుడు పరమేశ్వరుడిని అభిషేకిస్తే పాప విముక్తులయి, దుఃఖం దూరమవుతుంది. ఆనందం ఆదిదేవుని ఆశ్వీర్వాదంగా లభిస్తుంది.
శివుడు అభిషేక ప్రియుడని భక్తులందరికీ తెలుసు. ఆ మహాదేవునికి అభిషేకానిసి నీళ్లు, పాలు, కొబ్బరినీళ్లు, చెరుకురసం, పండ్ల రసాలు లాంటి ద్రవ్యాలు వాడుతుంటారు. ఇలా ఒక్కో అభిషేక ద్రవ్యంతో అభిషేకం చేయడం వలన ఒక్కో ఫలితాన్ని పొందవచ్చని చెబుతుంటారు. పరమశివుడిని ఆవుపాలతో అభిషేకించడం వలన, దుఖాల నుంచి విముక్తి లభిస్తుంది.
జీవితంలో ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన వ్యథ. ముఖ్యమైన కార్యాలలో విజయం లభించకపోవడం, అనుకున్న పనులు నెరవేరక పోవడం, ఆటంకాలు ఏర్పడటం, అయినవాళ్లు ఆపదలు, అనారోగ్యం పాలవడం లాంటివి ఎన్నో. అన్ని రకాల దుఃఖ బాధల నుంచి విముక్తికి పరమశివుడి అనుగ్రహమే మార్గం. ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ఆవుపాలతో అభిషేకం చేయాలి. తద్వారా పాపవిముక్తి, భగవత్ అనుగ్రం కలుగుతాయి.


శివ నామ మహిమ....!.......................................................

శివుని ఉపాసి౦చు వారు ధన్యులు. కృత కృత్యులు. వారి జన్మ సఫలమగును. వారి కులము ఉద్ధరి౦పబడును. సదాశివ, శివ అ౦టూ శివనామమును జపి౦చు వానిని చెదలు నిప్పును వలె, పాపములు స్పృశి౦చజాలవు. ఓ శివా! నీకు నమస్కారము అని పలికే నోరు పాపములనన్నిటినీ పోగొట్టే పవిత్ర తీర్థము. ఎవనియ౦దు అత్య౦త శుభకరములగు శివనామము, విభూతి, రుద్రాక్షలు అనే మూడు ఉ౦డునో, అట్టివాని దర్శన మాత్రముచేత త్రివేణీ స౦గమములో స్నానము చేసిన ఫలము లభి౦చును. వాని దర్శనము పాపములను పోగొట్టును. ఎవని లలాటముపై విభూతి లేదో, ఎవని శరీరమున౦దు రుద్రాక్ష ధరి౦పబడదో, ఎవని పలుకులు శివనామ భరితములు కావో అట్టి వానిని అధముని వలె త్యజి౦చవలెను. శివనామము గ౦గ వ౦టిది. విభూతి యమున వ౦టిది. రుద్రాక్ష సర్వపాపములను పోగొట్టే సరస్వతీ నది వ౦టిది.
ఈమూడు ఎవని శరీరమున౦దు గలవో, వాని పుణ్యమును ఒకవైపు, త్రివేణీ స౦గమ స్నానము వలన లభి౦చు పుణ్యమును మరియొకవైపు ఉ౦చి విద్వా౦సులే కాక పూర్వము బ్రహ్మ కూడా లోకహితమును కోరి పోల్చి చూసెను. రె౦డి౦టి ఫలము సమానముగను౦డెను. కావున విద్వా౦సులు అన్నివేళలా ధరి౦చవలెను. ఆనాటి ను౦డియూ బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు మూడి౦టినీ ధరి౦చుచు౦డిరి. వీటి దర్శనము పాపములను పోగొట్టును.
శివనామమనే దావాగ్ని యెదుట మహాపాపములనే పర్వతములు తేలికగా బూడిదయగునను మాట ముమ్మాటికీ సత్యము. స౦సరమునకు మూలమైన పాపములు శివనామము అనే గొడ్డలితో నిశ్చయముగా నాశమును పొ౦దును. శివనామమున౦దు భక్తి కలిగిన మహాత్ములకు ముక్తి శీఘ్రముగా లభి౦చును. అనేక జన్మములు తపస్సు చేసిన వానికి పాపములన్నిటినీ పోగొట్టే శివనామమున౦దు భక్తి కుదురును. ఎవనికి శివనామము న౦దు అతిశయి౦చిన నిర౦తర భక్తి కుదురునో వానికి మాత్రమే మోక్షము సులభమగుననియు, ఇతరులము దుర్లభమనియు శివపురాణమున౦దు చెప్పబడినది.

ఈ ప్రపంచములో సృష్టిస్థితిలయములకు సకలచరాచర జీవకోటిని సంరక్షించుటకు 
కైలాసములో పార్వతీ పరమేశ్వరులుగా, 
శ్రీశైలములో భ్రమరాంబ మల్లిఖార్జునులుగా, 
కాశీలో విశాలాక్షి విశ్వనాధలింగేశ్వరులుగా, 
సోమేశ్వర, మల్లిఖార్జున, మహాకాళేశ్వర, అమరేశ్వర, వైద్యనాథేశ్వర, భీమేశ్వర, రామేశ్వర, నాగేశ్వర, విశ్వేశ్వర, త్రయంబకేశ్వర, కేదరేశ్వర, ఘృశ్వేశ్వర అను ద్వాదశ జ్యోతిర్లింగములుగా వివిధ పుణ్యక్షేత్రములలో ప్రసిద్ధి చెందినారు. 

ఆ జగద్రక్షకుడైన జగదీశ్వరుని ఎంత పొగిడినా తనివితీరదు. ఓం నమః శ్శివాయ అను పంచాక్షరి మంత్రమును నియమ నిష్ఠలతో పఠించిన శివకోటి భక్త జనులకు సర్వపాపములు పటాపంచలు అయి ముక్తి మోక్షఫల ప్రదంబుల నొసంగి జన్మ తరింపజేయును. శివదీక్షను, నిష్ఠ నియమాలతో ఆచరించిన, దేహపీడలు అకస్మాత్ కలహములు తొలగి ఆయురారోగ్యములు, అష్ట్యైశ్వర్యములతో శుభ ప్రదముగా జీవించునట్లు ఆశీర్వదించును. దేవతలందరిలో శివుడు దయారస హృదయుడు. భక్తుల మొరలాలించి వరాలిచ్చే బోళాశంకరుడు. శివ అంటే శుభము అని అర్థము. ఇతర దేవతలవలె శివుడు అవతారము లెత్తుటకై మహా శివుడు ఎవరి గర్భమున జన్మింపలేదు. అవతారము, అవతార సమాప్తి, అన్నియు లీలలే, శివుడు నిర్మలుడు, నిర్గుణుడు, నిష్కలంకుడు, నిటాలాక్షుడు, నిరంజనుడు. అట్టి ఆదిదేవుడు శివుని ఆలంబనముగా జేసుకొని ఆచరించబడేదే శివదీక్ష జగన్మాతయైన పార్వతీదేవి కఠోరమైన శివదీక్ష చేసి, ఆ పరమశివుని అనుగ్రహము వలన నిజమైన అర్థాంగియైనది. శివుని శరీర మందు అర్థభాగము స్వీకరించుటచే పరమేశ్వరుడు కూడా అర్థనారీశ్వరుడైనాడు. 
శ్రీరామచంద్రుడు శ్రీరామలింగేశ్వరుని, శ్రీకృష్ణుడు శివదీక్షను, అర్జునుడు పాశువత దివ్య దీక్షను స్వీకరించి తరించునట్లు చెప్పబడుచున్నది. మనకు తెలిసినంత వరకు శివదీక్ష పట్టిన వారిలో మొట్టమొదటి భక్తురాలు పార్వతీదేవి. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలు శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, భక్త కన్నప్ప నుండీ, పర్వతుడు, భక్త సిరియాలుడు మొదలైనవారు శివదీక్షను పాటించినట్లు విక్రమాదిత్యుని తామ్రశాసనం వలన తెలుస్తుంది. కార్తికేయుడు కూడా శివదీక్షను పూని దేవతాసిన్యాలకు అధిపతి అయినాడు. ఇంతటి దివ్య మహిమగల శివదీక్ష ఎంతో ప్రాచీనమైనది. మాఘమాసంలోని మహాశివరాత్రితో మండలకాలం అనగా 40 రోజుల్లో ముగియునట్లుగా ఆచరించుట మంచిది. 40 రోజులు పూర్తయి 41వ రోజున దీక్ష విరమించవలెను. మాఘమాసములోని మహాశివరాత్రితో గాని, కార్తీక మాసములోని మహాశివరాత్రితో గాని, కార్తీక మాసములోని మాస శివరాత్రితోకాని దీక్ష పూర్తి అయ్యే విధముగా ఆచరించవచ్చును. మండలకాలం పూర్తి అయిన తరువాత జ్యోతిర్ముడితో శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి మల్లిఖార్జున స్వామికి నమస్కరించి శ్రీశైల మహాక్షేత్రము నందు గల త్రిఫల వృక్షము క్రింద ఈ దీక్షా విరమణ చేయుట మిక్కిలి శ్రేష్ఠము. ఇది చేయలేని వారు అర్థ మండలం అనగా 20 రోజులు శివ దీక్షవహించిన 21 వ రోజులో దీక్షావిరమణ చేయవలెను. ఈ శివదీక్షను స్థానిక శివాలయములోని శివార్చకునితో కాని ఇంతకు పూర్వము శివదీక్షను స్వీకరించిన వారితోకాని మూలాధారణను చేయించుకొనవలెను. ఇట్టి మహత్తరమైన శివదీక్షను నియమానుసారము ఆచరించిన వారికి భూత, ప్రేత, పిశాచ, శత్రు బాధలు, గ్రహారిష్టములు తొలగిపోవును. సర్వ సంపదలు కలిగి ఐహికాముషిక సుఖబీమమీలు పొందెదరు. శంకరాచార్యుల వారు తన శివానందలూ ఓ పరమేశ్వరా ! ఈ జగత్తులో సహస్రార్థిలో దేవతలు ఉన్ననూ శాశ్వత మోక్ష ఫలమును ప్రసాదించువాడవు నీవే సుమా ! కనుక నీ పాదద్మములే నాకు శరణ్యము. శివదీక్ష - మాలాధారణ మంత్రం 108 రుద్రాక్షలు, దానికి చివర పరమేశ్వరుని ముద్రగల మాలను తీసుకొనవలెను. ఈ శ్లోకములను చెప్పుచూ మాలను శివ ముద్రకు నమస్కారం చేయవలెను. శ్లో!! ఓంకార శక్తి సంయుక్తాం సచ్చిదానంద రూపిణీం ! శ్రీశైలేశ దయాపూర్ణాం శివముద్రాం నమామ్యహం !! అంటూ రుద్రాక్షమాలకు గల స్వామి వారి నమస్కారం చేయాలి.

మాస శివరాత్రి ....!
.......................................................
ప్రతి మాసానిదీ ఒక విశిష్టత.. ప్రతి మాసంలోనూ ఒక పండుగ..ప్రతి రోజూ ఒక కొత్తదనం. పండుగలంటే మనకెంతో సరదా. ఎంతో ఉత్సాహంగా సరదాగా జరుపుకుంటాం. ఎంత బీదవారైనా గొప్ప వారైనా ఎలాగో అలాగ జరుపుకోవాలనే చూస్తారు. శ్రీరామనవమి నుంచి శివరాత్రిదాకా సంవత్సరం పొడుగునా పండుగలే. బహుశా ఏ మతంలోనూ కూడా మనకున్నన్ని పండుగలు, పూజలు, వ్రతాలు ఉండవేమోననిపిస్తుంది. పండుగలనగానే పిండివంటలు చేసుకోవటం బంధుమిత్రులతో వినోదంగా కాలక్షేపం చేయటమేనని చాలా మంది భావన అయితే మనకి కనిపించే వ్యవహారమిదే. కాని ఆంతర్యంలో చాలా విశేషాలుంటాయి. ప్రతి పండుగా ఏదో ఒక దేవుడిని దేవతను ఆరాధించాలని సంప్రదాయం. దేవుళ్లు అంటే అమర్త్యులు..... మనం మర్త్యులం. -- జన్మ, మృత్యు, జరావ్యాధులతో బాధలను తప్పించుకోవాలంటే అవి లేని
వారినారాధించాలి. అప్పుడు వారిలోని దివ్యగుణాలు కొన్నైనా మనలో చోటు చేసుకుంటాయి. అందుకే పండుగలలో ఆహారం కంటే పూజలకే ఎక్కువ ప్రాధాన్యత వుంటుంది. భారతీయ ఆధ్యాత్మికాచారాలలో పండుగలకున్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. పండుగను అభిమానించని భారతీయుడు ఉండడు. ప్రత్యేకంగా పండుగను చేసుకోని నాస్తికులు సైతం పండుగ దినాలను మాత్రం ఖచ్చితంగా సంతోషంగా అనుభవించే తీరతారు. అది పూజతో నిమిత్తం లేనిది. సంతోష ఉత్సాహాలకు నిలయమైనది. కాబట్టే పండుగ అనే భావన ఎటువంటివారిలోనైనా అలౌకికానందాన్ని పంచుతుంది. ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకమైన శోభను చేకూరుస్తూ మానసికోల్లసాన్నిస్తూ గృహాలకు కొత్త అందాలను ఇస్తుంది. అందుకే చిన్నా, పెద్దా అందరూ వీటికోసం ఎంతో ఆర్తిగా ఎదురుచూస్తుంటారు. పండుగల సంబరాలు చిన్న పిల్లలవే అయినప్పటికీ ఆ ముచ్చట్లను పెద్ద్లలు కూడా ఎంతో సంతోషంగా అనుభవిస్తారు.
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే
నిర్ధేశించబడుతుంది .
మాస శివరాత్రి :
ప్రతి నెలలోను వచ్చే బహుళ పక్షంలోని చతుర్ధశిని మాస శివరాత్రి అంటారు .అలా సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులు వస్తే అందులో గొప్పదైన ఈ శివరాత్రి - అంటే -మాఘ మాస శివరాత్రి ' మహా శివరాత్రి (తిథి ద్వయం వున్నప్పుడు అమావాస్యకు ముందు రోజు - రాత్రి చతుర్ధశి కలిగిన వున్న రోజుని జరుపుకోవాలి) అవుతోంది .'మహా' అని ఎక్కడ అనిపించినా కొన్ని అలాంటి వాటికంటే గొప్పదని భావం . శివ పార్వతులిరువురికి కలిపి 'శివులు' అని పేరు ( శివ శ్చ శివా చ సివౌ ).ఆ ఇద్దరికీ సంభందించిన రాత్రి శివరాత్రి అనేది మరో అర్థం . అందుకే శివరాత్రి నాడు అయ్యకి - అమ్మకి కుడా వుత్సవం సాగుతుంది .శివ - మంగళకరమైన - రాత్రి ఏదో అది శివరాత్రి అనేది మూడో అర్థం .
ప్రాణికోటి యావత్తు నిద్రపోతూ ఉండే కాలం.. రాత్రి , నిద్ర అనేది పాక్షిక మరణంతో సమానం. ఆ రాత్రి వేల తానూ మేల్కొని రక్షించే శంకరుడు రాత్రి దేవుడు . తన వివాహం కూడా అర్దరాత్రి దాటాకనే మొదలవుతుంది. చలి కాలం వెళ్ళబోతుండగా 'మహాశివరాత్రి' పండుగ దినము వస్తుంది. చలి , మంచు భాధకు తాళలేక శరీరంలో పుట్టే చలిని తట్టుకోలేక గొంగల్లని కప్పుకుని వుండగా - పిశాచ , భూత ప్రేతాలకి దుఃఖాన్ని చేకూర్చే వాడైన శంకరుడు, నెలవంకను శిరోభూషనముగా ధరించి భస్మ లేపనం వాసనల మద్య కన్నుల పండువగా జరిగే పార్వతీ పరమేశ్వరుల (శివ-పార్వతుల) కళ్యాణ మహోత్సవము కోసం ఎన్ని రాత్రులైనా వేచి చూడాల్సిందే.....
మాస శివరాత్త్రి పర్వదినం నాడు మెడలో మీకు నచ్చిన రుద్రాక్ష ధరించి, ఈ దీపాలను పడమర దిక్కున వెలిగించి, "ఓం నమఃశివాయ" అని 108 సార్లు ధ్యానించే వారికి కైలాస ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం. అదేవిధంగా.. ఆలయాల్లో పంచామృతముతో శివునికి అభిషేకం చేయిస్తే ఈతిబాధలు, దారిద్య్రాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
తెలిసిగానీ, తెలియక గానీ భక్తి తోగాని, డంబముతో గాని, యీరోజు ఎవరైతే స్నానము, దానము, ఉపవాసము జాగరణ చేస్తారో వారికి శివ సాయుజ్యం కైలాస ప్రాప్తి తధ్యమని భక్తి గాధలు తెలుపుతున్నాయి.

No comments:

Post a Comment